ప్రియురాలి హత్యాయత్నం కేసులో నిందితుడు రిమాండ్
చివ్వెంల(సూర్యాపేట): మండల పరిధిలోని కుడకుడ గ్రామంలో గురువారం లా విద్యార్థినిపై సుత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన నిందితుడిని పోలీసులు అదే రోజు సాయంత్రం అదుపులోకి తీసుకుని, శుక్రవారం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఐ రాజశేఖర్ మాట్లాడుతూ.. కొంత కాలంగా తనను దూరం పెడుతుందని, అనుమానం, కక్షతో ప్రియురాలైన స్పందనను బోయిండ్ల మహేష్ సుత్తితో తలపై కొట్టి తీవ్రంగా గాయపరిచినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతుందని పేర్కొన్నారు. ఈమేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి సూర్యాపేట కోర్టులో రిమాండ్ చేసినట్లు తెలిపారు. సమావేశంలో ఎస్‌ఐ మహేశ్వర్, కనకరత్నం, సిబ్బంది పాల్గొన్నారు.


