చదువుతోనే ఉజ్వల భవిష్యత్
యాదగిరిగుట్ట రూరల్: చదువుతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జెడ్పీసీఈఓ శోభారాణి అన్నారు. యాదగిరిగుట్ట మండలంలోని సైదాపురం గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలను శనివారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా హాజరు రిజిస్టర్‌ను పరిశీలించారు. ఉపాధ్యాయులు పాఠాలు ఎలా చెబుతున్నారని, మధ్యాహ్న భోజనం ఎలా ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. బాగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని తెలిపారు. అనంతరం గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. బిల్లులు ఏమైనా పెండింగ్‌లో ఉన్నాయా అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే నిర్మాణాన్ని పూర్తి చేయాలని మేసీ్త్రకి సూచించారు. అదేవిధంగా నర్సరీని పరిశీలించారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించేలా చూడాలని ఆదేశించారు. జెడ్పీ సీఈఓ వెంట పంచాయతీ కార్యదర్శి నరేష్, ప్రధానోపాధ్యాయులు రవీందర్, సిబ్బంది తదితరులున్నారు.
ఫ జెడ్పీసీఈఓ శోభారాణి


