భూముల రీ సరే్వ
సాక్షి, యాదాద్రి: రైతుల భూముల సమస్యలకు చెక్ పెట్టేందుకు మొత్తం భూములను సర్వే చేసి రైతులకు భూధార్‌కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో రెండు గ్రామాలను పైలట్ గ్రామాలుగా తీసుకుని భూభారతి చట్టం ప్రకారం భూముల రీసర్వే నిర్వహించనున్నారు. ఈమేరకు భువనగిరి మండలం చందుపట్ల, బొమ్మలరామారం మండలం మునిరా బాద్‌లను పైలట్ గ్రామాలుగా ఎంపిక చేశారు. సర్వే కోసం ఇప్పటికే గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. సంకారంతి పండుగకే భూదార్‌కార్డులు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు రావడంతో సర్వే నిలిచిపోయింది. ఎన్నికలు ముగియడంతో తిరిగి సర్వే ప్రక్రియ చేపట్టనున్నారు.
సర్వే ఇలా చేస్తారు
ఈ రీసర్వేలో భాగంగా భూ భారతి చట్టం ప్రకారం ప్రతి ఇంచు భూమి లెక్క తేల్చనున్నారు. హద్దులు నిర్ణయించి ప్రభుత్వ భూములు, కుంటలు, శిఖం, వక్ఫ్, ఎండోమెంట్, రైతుల పట్టా భూములను ఖాతాల వారీగా సర్వే చేయనున్నారు. తొలి దశలో ఎంపిక చేసిన ఫైలట్ గ్రామాల్లో సర్వే చేస్తారు. సర్వేయర్లు క్షేత్రస్థాయికి వెళ్లి, భూమి యజమానితోపాటు చుట్టు పక్కల రైతుల ముందు సర్వే చేస్తారు. రేఖాంశాలు, అక్షాంశాల మధ్యన ఈ భూమి సర్వే జరుగుతుంది. ఇందులో భూమి విస్తీర్ణం, హద్దులు తనిఖీ చేస్తారు. భూమి యాజ మాన్య వివరాలను నమోదు చేస్తారు. వివరాలను డిజిటల్ రూపంలో భద్రపరుస్తారు.
ల్యాండ్ పార్సిల్ మ్యాప్ తయారు
కచ్చితత్వంతో కూడిన పూర్తి సమాచారం తీసుకుని ల్యాండ్ పార్సిల్ మ్యాప్‌ను రూపొందిస్తారు. సర్వేకోసం వచ్చిన అధికారులకు రైతులు తమ వద్ద ఉన్న భూమి సమగ్ర వివరాలను అందజేయాలి. అభ్యంతరాలు ఉంటే తెలపాలి. రైతుల సర్వేనంబర్లు, ఖాతా వారీగా టైటిల్ ఆధారాలు తీసుకుని చుట్టు పక్కల రైతులను విచారిస్తారు. భూమిలో తేడాలు, సర్వే నంబర్ల తేడాలు వంటివి గుర్తిస్తారు. ఒక సర్వే నంబర్ రికార్డులో ఉండి, కబ్జా మరో చోట ఉంటే వాటిని సరిచేస్తారు. పాస్‌బుక్‌లో ఉన్న రికార్డు ఆధారంగా భూమిని సరిచేస్తారు.
రైతులకు భూధార్‌కార్డులు
జారీ చేసేందుకు భూముల సర్వే
పైలట్ గ్రామాలుగా చందుపట్ల, మునిరాబాద్ ఎంపిక
ఇప్పటికే గ్రామసభలు
నిర్వహించిన అధికారులు
తీరనున్న భూముల చిక్కులు
గ్రామ సభల నిర్వహణ
ఎంపిక చేసిన భూ భారతీ ఫైలట్ గ్రామాల్లో ఆర్డీఓ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు గ్రామ సభలు ఏర్పాటు చేశారు. గ్రామంలోని రైతులను గ్రామ సభకు ఆహ్వానించి భూ ధార్ కార్డుల గురించి వివరిస్తున్నారు. ఇందుకోసం ముందుగానే గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. మునిరాబాద్, చందుపట్లలో గ్రామాల్లో సర్వే ప్రారంభం కానుంది. అనంతరం జిల్లాలోని అన్ని గ్రామాల్లో ప్రభుత్వం సర్వే చేపట్టనుంది.
గ్రామం మండలం మొత్తం ఎకరాలు
మునిరాబాద్ బొమ్మలరామారం 521.3
చందుపట్ల భువనగిరి 2,536


