మోత్కూరు : మోత్కూరు పట్టణంలో శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రామలింగేశ్వర స్వామి దంపతులను ఊరేగించారు. ఎడ్ల బండిని పూల మాలలతో అలంకరించి గరుత్మంతుడి వాహనంపై రామలింగేశ్వర స్వామి దంపతులను నిల్చోబెట్టి ఊరేగింపును మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం స్వప్నసోమనర్సయ్య ప్రారంభించారు. మోత్కూరు పట్టణంలోని చెరువు కట్ట, పాత బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, పోతాయిగడ్డ, పద్మశాలి కాలనీ, డ్రైవర్స్ కాలనీ, వడ్డెర కాలనీ, సుందరయ్య కాలనీ, అంగడి బజార్ తదితర కాలనీలలో స్వామి, అమ్మవారి ఊరేగింపు నిర్వహించారు.కార్యక్రమంలో వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న, దేవాలయ కమిటీ చైర్మన్ గుండగోని రామచంద్రు, ప్రతినిధులు బుర్ర యాదయ్య, బయ్యని రాజు, ఉయ్యాల అంజయ్య, బుర్ర కృష్ణ, గుండు శ్రీను, మందుల సురేష్, బుర్ర నర్సయ్య, జెనిగల భిక్షం, జెనిగల శ్రీను, బిళ్లపాటి మహేందర్‌రెడ్డి, వెంకన్న, శేఖరాచారి, పోచం అంజయ్య, బందెల రవి పాల్గొన్నారు.


