మగువ చేతికి ప్రగతి రథం | - | Sakshi
Sakshi News home page

మగువ చేతికి ప్రగతి రథం

Feb 24 2026 9:04 AM | Updated on Feb 24 2026 9:04 AM

మగువ

మగువ చేతికి ప్రగతి రథం

ప్రతి నెలా మొదటి వారంలో..

డీడీలు చెల్లించాం

మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు

బస్సులను కొనుగోలు చేసిన తర్వాత ఆర్టీసీకి అద్దె ప్రాతిపదికన అందజేస్తారు. మండల మహిళా సమాఖ్యలు పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని ఏడేళ్లలో తిరిగి ఇస్తారు. ఒక్కో బస్సుకు ఆర్టీసీ ప్రతి నెలా మొదటి వారంలో అద్దె రూ. 69,468 చెల్లించేందుకు అంగీకారం తెలిపింది. ప్రతి నెలా చెల్లించే ఈ మొత్తం సెర్ప్‌ కమ్యూనిటీ ఇన్వెస్ట్‌ మెంట్‌ ఫండ్‌ కింద మండల ఖాతాలో జమఅవుతుంది. ఈ మొత్తాన్ని మహిళా సంఘాల్లోని సభ్యుల అభ్యన్నతికి వినియోగిస్తారు.

ఇప్పటి వరకు 12 సంఘాలకు నిధులు మంజూరు

ఒక్కో బస్సుకు రూ.36లక్షల చొప్పున..

బస్సుల కొనుగోలుకు డీడీలు చెల్లించిన అధికారులు

ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేలా ప్రణాళిక

భువనగిరి:

మహిళా సంఘాల సభ్యులు ఆర్టీసీ బస్సులకు యజమానులు కానున్నారు. ప్రతి మండల మహిళా సమాఖ్యకు ఒక్కొక్కొ బస్సు చొప్పున కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బస్సుల కొనుగోలుకు పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్‌) వద్ద ఉండే కమ్యూనీటి నుంచి నిధులను విడుదల చేసింది. బస్సుల అద్దె పై ఇప్పటికే ఆర్టీసీతో సెర్ప్‌ ఒప్పందంకుర్చుకుంది.

సెర్ప్‌ నుంచి రూ.30లక్షలు

జిల్లాలో 17 మండలాలకు గాను 17 మహిళా సమాఖ్యలు ఉన్నాయి. ఒక్కో మహిళా సమాఖ్యలో 700 నుంచి 1,100 మంది సభ్యులు ఉంటారు. ఇందులో భాగంగా బస్సుల కొనుగోలు కోసం ప్రతిపాదనలు తయారు చేశారు. ఒక్కో బస్సు రూ. 36 లక్షల విలువ ఉండటంతో సెర్ప్‌ నుంచి రూ. 30 లక్షలు, మిగతా రూ. 6 లక్షలను మండల సమాఖ్య నుంచి లేదా బ్యాంకు నుంచి రుణం తీసుకుని చెల్లించనున్నారు. ఇప్పటి వరకు 12సంఘాలకు నిధులు మంజూరయ్యాయి. బస్సుల కొనుగోలుకు గాను డీడీలు కూడా చెల్లించారు.

సంస్థ పై తగ్గనున్న ఒత్తిడి

ఇప్పటి వరకు ప్రైవేట్‌ వ్యక్తుల నుంచి బస్సులను అద్దెకు తీసుకుని ఆర్టీసీ నిర్వహిస్తోంది. మహిళలకు ఉచిత ప్రయాణం అందించేందుకు ఉద్దేశించిన మహాలక్ష్మి పథకం ప్రారంభించిన తర్వాత ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. అదనంగా బస్సుల అవసరం ఏర్పడింది. మహిళా సంఘాల ద్వారా బస్సులు సమకూరడంతో ఆర్టీసీ పై ఒత్తిడి తగ్గనుంది. ప్రయాణాల్లో మహిళల సంఖ్య అధికంగా ఉండటంతో బస్సుల్లో సీట్లు సరిపోవడంలేదు. కొత్త బస్సులతో ప్రయాణికులకు సైతం సౌకర్యం కలగనుంది.

జిల్లాలో ప్రస్తుతం 12 మహిళా సమాఖ్యలకు నిధులు మంజూరు అయ్యాయి. బస్సుల కొనుగోలు కోసం ఇప్పటికే డీడీలు చెల్లించాం. మిగిలిన మహిళా సమాఖ్యలకు రెండో విడతలో నిధులు మంజరయ్యే అవకాశం ఉంది. ఈ విధానం వల్ల మహిళా సంఘాల సభ్యులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

– నాగిరెడ్డి, డీఆర్‌డీఓ

మగువ చేతికి ప్రగతి రథం1
1/2

మగువ చేతికి ప్రగతి రథం

మగువ చేతికి ప్రగతి రథం2
2/2

మగువ చేతికి ప్రగతి రథం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement