సీఐటీయూ మహాసభలను విజయవంతం చేయాలి
నల్లగొండ టౌన్: నల్లగొండలో ఈ నెల 14,15 తేదీల్లో నిర్వహించనున్న సీఐటీయూ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి కోరారు. ఆదివారం నల్లగొండలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఐటీయూ ఏర్పడినప్పటి నుంచి దేశంలో కార్మికవర్గ హక్కుల కోసం అనేక పోరాటాలు చేసిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న సరళీకరణ విధానాలకు వ్యతికంగా కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతున్నది సీఐటీయూ మాత్రమే అన్నారు. సీఐటీయూ జిల్లా సభల్లో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని.. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాల్సిన కార్మికుల సమస్యలను ఎండగట్టాలన్నారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్నపాక లక్ష్మీనారాయణ, ఎండీ.సలీం, బాణాల పరిపూర్ణాచారి, డబ్బికార్ మల్లేష్, అవుత సైదులు, దండెంపల్లి సత్తయ్య, చింతపల్లి బయన్న, మల్లు గౌతమ్‌రెడ్డి, నల్ల వెంకటయ్య, ఏర్పుల యాదయ్య, పెంజర్ల సైదులు తదితరులు పాల్గొన్నారు.


