బడికి దూరంగా 290 మంది | - | Sakshi
Sakshi News home page

బడికి దూరంగా 290 మంది

Mar 2 2026 8:57 AM | Updated on Mar 2 2026 8:57 AM

బడికి దూరంగా 290 మంది

బడికి దూరంగా 290 మంది

చదువుకునేలా ప్రోత్సహిస్తున్నాం

ప్రత్యేక సర్వేలో గుర్తించిన పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడాం. గుర్తించిన వారికి సమీపంలో ఉన్న పాఠశాలల్లో చేర్పించాం. కార్మికులు పనిచేసే ప్రాంతాల్లో ఎక్కువ మంది పిల్లలుంటే ఆయా పరిశ్రమల యాజమాన్యం వారికి చదువు చెప్పించాలని సూచించాం. 19 ఏళ్లు నిండిన వారు ఓపెన్‌ ఇంటర్‌ చదివేలా అవగాహన కల్పించి ప్రోత్సహిస్తున్నాం.

– సత్యనారాయణ,

జిల్లా విద్యా శాఖ అధికారి

భువనగిరి : ప్రతిఒక్క విద్యార్థి చదుకోవాలనే లక్ష్యంతో విద్యకు ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా కొందరు మాత్రం బడికి దూరంగానే ఉంటున్నారు. విద్యార్థులు బడికి దూరంగా ఉండటానికి గల కారణాలను తెలుసుకునేందుకు జిల్లా విద్యా శాఖ ఇటీవల ప్రత్యేక సర్వే నిర్వహించింది. జిల్లా వ్యాప్తంగా 290 మంది బడికి దూరంగా ఉన్నట్లు గుర్తించారు. జిల్లాలో ఇటుక బట్టీలు, పారిశ్రామిక ఏరియాల్లో పనిచేస్తున్న వారి పిల్లలే బడికి దూరంగా ఉన్నట్లు తేల్చారు. ఇందులో బొమ్మలరామారం, తుర్కపల్లి, చౌటుప్పల్‌, భువనగిరి ప్రాంతాల్లో ఎక్కువ మంది ఉన్నారని అధికారులు పేర్కొంటున్నారు.

సర్వే నివేదిక

ఉన్నతాధికారులకు..

జిల్లాలో 715 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటితోపాటు కేజీబీవీలు, మోడల్‌, గురుకుల పాఠశాలల్లో ప్రభుత్వం అన్ని సౌకర్యాలు సమకూరుస్తూ చదువుకునే వెసులుబాటు కల్పిస్తోంది. ప్రభుత్వ ఏటా విద్యా సంవత్సరం ప్రారంభంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా.. ఎంతో మంది పిల్లలు బడికి వెళ్లడం లేదు. వీరిని గుర్తించి పాఠశాలల్లో చేర్పించాలనే లక్ష్యంతో జిల్లాలోని 17 మండలాల పరిధిలో 48 క్లస్టర్లలో 51 మంది సీఆర్‌పీలు ప్రతి ఇంటికి వెళ్లి 6 నుంచి 19 ఏళ్లలోపు వయస్సు కలిగి చదువుకు దూరంగా ఉంటున్నవారి వివరాలను సేకరించి సంబంధిత నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించారు.

పాఠశాలల్లో అడ్మిషన్‌

ప్రత్యేక సర్వే ద్వారా జిల్లాకు వలస వచ్చినవారు, జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి చదువుకు దూరంగా ఉన్న 290 మంది వివరాలు సేకరించారు. గుర్తించిన వారిలో సుమారు 200కుపైగా పాఠశాలల్లో చేర్పించగా 15 ఏళ్లు పైబడిన వారికి అవగాహన కల్పించి ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌లో చేర్పించారు. మరికొందరికి ప్రత్యేక స్కూళ్లు ఏర్పాటు చేసి చదువు చేప్పేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు.

ఫ ఇటుక బట్టీలు, పారిశ్రామిక

ఏరియాల్లో పిల్లలే ఎక్కువ

ఫ ప్రత్యేక సర్వేలో

గుర్తించిన విద్యా శాఖ

ఫ 200 మందికిపైగా పాఠశాలల్లో చేర్పించిన యంత్రాంగం

ఫ ప్రభుత్వానికి నివేదిక అందజేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement