తనయులు పట్టించుకోవడంలేదని, ఆదుకోవాలని కోరుతూ ప్రజావాణికి వచ్చి గోడు వెల్లబోసుకున్న వృద్ధదంపతులను చూసి చలించిన కలెక్టర్ అనురాగ్ జయంతి వారిని కన్నకొడుకులా ఆదరించి వయోవృద్ధుల ఆశ్రమంలో చేర్పించారు. వివరాలిలా ఉన్నాయి.. ఆలేరు మండలం కొలనుపాకకు చెందిన ధర్మ సోమిరెడ్డి, రమణమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిని కుమారులు పంచుకొని, వారిని నిర్లక్ష్యం చేయడంతో గతంలోనే కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కొడుకులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అయినా వారిలో మార్పురాలేదు. దీంతో ఆ వృద్ధదంపతులు సోమవారం మళ్లీ ప్రజావాణికి వచ్చారు. ‘మాకు ఎవరూ లేరు.. మీరే దిక్కు.. మమ్మల్ని అనాథాశ్రమంలో చేర్పించండి’ అంటూ ఆ వృద్ధదంపతులు కలెక్టర్‌ను ప్రాధేయపడ్డారు. స్పందించిన కలెక్టర్ వారిని చౌటుప్పల్ మండలం పెద్ద కొండూరులోని వయోవృద్ధుల ఆశ్రమంలో చేర్పించారు.


