యాదగిరీశుడి సేవలో ఉప లోకాయుక్త
యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని రాష్ట్ర ఉప లోకాయుక్త బీఎస్ జగ్జీవన్ కుమార్ గురువారం దర్శించుకున్నారు. ఆలయ ఈఓ భవానీ శంకర్ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ఆయనకు సంప్రదాయంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గర్భాలయంలోని స్వయంభూలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా, ఈఓ లడ్డూ ప్రసాదం, స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు.
నిందితుడిపై
నాన్ బెయిలెబుల్ వారెంట్
ఫ జైలుకు తరలించిన పోలీసులు
చివ్వెంల(సూర్యాపేట) : చివ్వెంల మండలం ఐలాెపురం గ్రామానికి చెందిన చెరుకుపల్లి సైదులు వివిధ కేసుల్లో కోర్టుకు గైర్హాజరవుతుండడంతో సూర్యాపేట కోర్టు సెకండ్ అడిషనల్ జ్యూడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ మంచాల మమత అతడిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. దీంతో గురువారం చివ్వెంల పోలీసులు సైదులును అదుపులోకి తీసుకొని న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. నిందితుడి పట్ల కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ జైలుశిక్ష విధించడంతో పోలీసులు అతడిని సూర్యాపేట సబ్ జైలుకు తరలించారు.
గుర్తుతెలియని వ్యక్తి
మృతదేహం లభ్యం
మర్రిగూడ(చింతపల్లి) : చింతపల్లి మండల కేంద్రం శివారులోని చిన్న చెరువులో గురువారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు స్థానిక ఎస్‌ఐ ముత్యాల రామ్మూర్తి తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు చెరువు వద్దకు పరిశీలించామని, మృతుడి వయస్సు సుమారు 45 నుంచి 50 ఏళ్ల మధ్య ఉంటుందని, ముఖం గుర్తుపట్టలేని విధంగా ఉందని ఎస్‌ఐ పేర్కొన్నారు. గుబురు గడ్డం కలిగి, ఎరుపు,నీలం రంగు గీతల డిజైన్ కలిగిన ఫుల్ హ్యాండ్ చొక్కా, బూడిద రంగు డ్రాయర్ ధరించినట్లు వివరించారు. అతడి కుడి చేతికి రాగి కడియం, మెడలో తాయత్తు ఉన్నాయని తెలిపారు. మృతుడి వివరాలు తెలిస్తే చింతపల్లి పోలీస్ స్టేషన్‌లో లేదా 87126 70230, 87126 75858 నంబర్లను సమాచారం ఇవ్వాలని సూచించారు.


