సీఎం రేవంత్‌రెడ్డిది చేతకాని పాలన | - | Sakshi
Sakshi News home page

సీఎం రేవంత్‌రెడ్డిది చేతకాని పాలన

Mar 1 2026 7:16 AM | Updated on Mar 1 2026 7:16 AM

సీఎం రేవంత్‌రెడ్డిది చేతకాని పాలన

సీఎం రేవంత్‌రెడ్డిది చేతకాని పాలన

చౌటుప్పల్‌ : సీఎం రేవంత్‌రెడ్డి తన చేతకాని పాలనతో పేదల గుండెల్లో గునపం దింపుతున్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రాంచందర్‌రావు ధ్వజమెత్తారు. శనివారం చౌటుప్పల్‌ మండలం కొయ్యలగూడెం గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మొన్నటి వరకు హైడ్రా పేరుతో, నిన్న మూసీ ప్రాజెక్టులో భాగంగా గాంధీ విగ్రహం ప్రతిష్ఠాపనకు, తాజాగా ఖమ్మంలో భూదాన్‌ భూముల పేరుతో పేదల ఇళ్లను కూలుస్తున్నారని ఆరోపించారు. ఖమ్మంలో మంత్రుల భూములకు ధరలు పెరగాలన్న ఆలోచనతో పేదల ఇళ్లను కూల్చివేశారని ఆరోపించారు. మైనింగ్‌ పేరిట శారదా పీఠాన్ని సైతం తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. తాను ఆదివారం ఖమ్మం పర్యటనకు వెళ్తున్నానని, అక్కడి నిర్వాసితులైన నిరుపేదలకు న్యాయం జరిగే వరకు బీజేపీ అండగా ఉంటుందని తెలిపారు. గ్రామాలలో శివాజీ మహారాజ్‌ విగ్రహాల ఏర్పాటుతో యువతలో దేశభక్తి పెరుగుతుందన్నారు. నేటి సంక్షేమ పథకాలను నాడు తన పాలనలోనే శివాజీ మహారాజ్‌ అమలు చేశారని గుర్తుచేశారు. రానున్న రోజుల్లో ప్రతి గ్రామంలో శివాజీ మహారాజ్‌ విగ్రహాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి గంగిడి మనోహర్‌రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి, స్థానిక సర్పంచ్‌ కై రంకొండ స్వప్నఅశోక్‌, బీజేపీ మండల, మున్సిపాలిటీ అధ్యక్షులు కై రంకొండ అశోక్‌, కడారి కల్పన, ఉప సర్పంచ్‌ జెల్ల పవన్‌, నాయకులు దోనూరు వీరారెడ్డి, దూడల భిక్షంగౌడ్‌, శాగ చంద్రశేఖర్‌రెడ్డి, ఆలె చిరంజీవి, కంచర్ల గోవర్ధన్‌రెడ్డి, గడ్డం నర్సింహ, పిశికె సంజీవ, నూనె మాధవి, పక్కీరు శ్రీనివాస్‌రెడ్డి, అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.

ఫ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement