నష్టాల్లో ఉన్న మదర్ డెయిరీకి పూర్వ వైభవం తీసుకొస్తామని చైర్మన్ గుడిపాటి మధుసూదన్‌రెడ్డి తెలిపారు.
- 8లో
మహా శివుడికి సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న శ్రీపర్వత వర్ధిని సమేత రామలింగేశ్వస్వామి వారి ఆలయంలో సోమవారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. మహా శివుడికి ఇష్టమైన రోజు కావడంతో విశేషంగా అభిషేకం, బిల్వార్చన పూజలను జరిపించారు. ముఖ మండపంలోని శ్రీస్పటిక రామలింగేశ్వరుడికి పూజారులు బిల్వ పత్రాలతో పూజలు జరిపి, భక్తులచే అష్టోత్తర పూజలను నిర్వహించారు. సాయంత్రం వేళ శివాలయంలో శ్రీరామలింగేశ్వర సమేత పార్వతీ దేవి సేవను ఊరేగించారు. యాదగిరీశుడి ప్రధానాలయంలో నిత్య కై ంకర్యాలను అర్చకులు సంప్రదాయంగా జరిపించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.


