ఈ తండ్రి ప్రేమకు సాటిరారు..
మర్రిగూడ : మండలంలోని శివ్నగూడెం గ్రామానికి చెందిన మోర సత్యనారాయణ, ధనమ్మ దంపతుల కుమార్తె శివాని చిన్నతనంలోనే ఫ్లోరోసిస్ బారిన పడడంతో ఆమె రెండు కాళ్లు చచ్చుబడి నడవలేని స్థితికి చేరుకుంది. వైకల్యం శివాని చదవుకు అడ్డంకి కాకూడదని భావించిన తండ్రి సత్యనారాయణ ఆమెను విద్యావంతురాలిని చేయాలని దుకు నిశ్చయించుకున్నారు. ప్రస్తుతం శివాని మర్రిగూడ మోడల్ స్కూల్‌లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. వార్షిక పరీక్షలు ప్రారంభంకావడంతో ప్రతిరోజు సత్యనారాయణ తన కుమార్తెను ఎత్తుకొని పరీక్షా కేంద్రానికి తీసుకెళ్తున్నారు. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు, తోటి విద్యార్థుల తల్లిదండ్రులు సత్యనారాయణకు తన కుమార్తైపె ఉన్న ప్రేమకు ఎవరూ సాటిరారని ప్రశంసిస్తున్నారు.
దివ్యాంగురాలైన తన కుమార్తెను ఎత్తుకొని
పరీక్ష కేంద్రానికి తీసుకెళ్తున్న సత్యనారాయణ


