భువనగిరి : రాష్ట్ర ప్రభుత్వం గర్భాశయ క్యాన్సర్ నివారణకు ఉచితంగా అందజేస్తున్న హెచ్‌పీవీ టీకాను 14 సంవత్సరాలు నిండిన బాలికలు సద్వినియోగం చేసుకోవాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో హెచ్‌పీవీ టీకా పంపిణీని ఆయన ప్రారంభిచారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తప్పనిసరిగా 14 సంవత్సరాల వయస్సు నిండిన బాలికలు హెచ్‌పీవీ టీకా వేసుకోవడం ద్వారా గర్భాశయ క్యాన్సర్‌ను నివారించవచ్చన్నారు. బాలికల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సుమారు రూ.6వేల నుంచి రూ.12వేల విలువ చేసే టీకాను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్నారు. 30 రోజుల పాటు జిల్లా కేంద్ర ఆస్పత్రితో పాటు రామన్నపేట, ఆలేరు, చౌటుప్పల్ సీహెచ్‌సీల్లో టీకాను అందజేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగళ్లపలి శ్రీవాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవెజ్ చిస్తీ, డీఎంహెచ్‌ఓ డాక్టర్ మనోహార్, ఆస్పత్రి సూపరింటెండెంట్ పాండునాయక్, కౌన్సిలర్ సూదగాని సరిత, మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖబాబురావు, డాక్టర్ ఇంద్రాణి, రామకృష్ణ, యామిని శృతి, నిరోష పాల్గొన్నారు.
ఫ ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి


