వంట గ్యాస్‌కు ధరల మంట | - | Sakshi
Sakshi News home page

వంట గ్యాస్‌కు ధరల మంట

Mar 9 2026 8:21 AM | Updated on Mar 9 2026 8:21 AM

పెరిగిన ధరతో అదనపు భారం గ్యాస్‌ ధరల పెంపు దారుణం

వంట గ్యాస్‌ ధరలు తగ్గించాలి

రంజాన్‌ కానుకల్లో కోత!

ఈ ఏడాది 50 శాతం తగ్గింపు

గతంలో 2,300

కుటుంబాలకు పంపిణీ

ఈ సారి 1,250 మందికే..

ఆందోళనలో పేద ముస్లింలు

భువనగిరిటౌన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రంజాన్‌ కానుకల (తోఫా) పంపిణీలో కోత పెట్టింది. గతం కంటే ఈసారి 50 శాతం తగ్గించింది. అయితే 2023లో భువనగిరికి 1,300, ఆలేరుకు వెయ్యి చొప్పున కానుకల ప్యాకెట్లను పంపిణీ చేసింది. ప్రస్తుతం ఒక కుటుంబానికి చీర, కుర్తా పైజామా, ఒక డెస్స్‌తో కలిపి ప్రత్యేక ప్యాకెట్‌(ను సిద్ధం చేసింది. జిల్లా వ్యాప్తంగా 4వేల పేద ముస్లిం కుటుంబాలకుగాను కనీసం 2వేల కుటుంబాలకై నా పంపిణీ చేయాల్సి ఉంది. అయినప్పటికీ ప్రభుత్వం భువనగిరి నియోజకవర్గానికి 750, ఆలేరు నియోజకవర్గానికి 500 మాత్రమే కేటా యించి సరఫరా చేసింది. అధికారులు ఒక్కొక్క గ్రామానికి కనీసం ముగ్గురికి కూడా పంపిణీ చేయలేని పరిస్థితి నెలకొంది. అందరికి ఎలా పంపిణీ చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. గతంలో ఎక్కువ మందికి పంపిణీ చేసి ఇప్పడు తగ్గించడమేంటని ముస్లింలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి పేద ముస్లిం కుటుంబానికి రంజాన్‌ తోఫా అందించాలని ముస్లిం మతపెద్దలు డిమాండ్‌ చేస్తున్నారు.

పెరిగిన గృహ, వాణిజ్య గ్యాస్‌ ధరలు

మొత్తం 2.61లక్షల గ్యాస్‌ కనెక్షన్లు

వినియోగదారులపై రూ.90లక్షల భారం

మీము నెలకు రెండు గ్యాస్‌ సిలిండర్ల వరకు వినియోగిస్తాం. పెరిగిన ధరతో ప్రతినెలా అదనంగా రూ.120 వరకు భారం పడుతుంది. పెరిగిన ధరను తగ్గించి పేద కుటుంబాలకు ఊరట కలిగించాలి.

– గాజుల గీత, ఆత్మకూర్‌(ఎం)

వంట గ్యాస్‌పై రూ.60, కమిర్షియల్‌ గ్యాస్‌ రూ.100 పెంచడం దారుణం. పెరిగిన వంట గ్యాస్‌ ధరల వల్ల పేద, మధ్య తరగతి కుటుంబాలపై అదనంగా భారం పడుతుంది. వెంటనే గ్యాస్‌ ధరలు తగ్గించాలి.

– కొండమడుగు నాగమణి,

ఐద్వా మండల కార్యదర్శి

భువనగిరి : ఇరాన్‌, ఇజ్రాయిల్‌–అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం భారత్‌లో వంట గ్యాస్‌ మంట పుట్టిస్తోంది. యుద్ధం కారణంగా గ్యాస్‌ సరఫరా తగ్గింది. దీంతో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని చమురు సంస్థలు ఈ నెల 6వ తేది అర్ధరాత్రి నుంచి వంటగ్యాస్‌ ధరలు పెంచేశాయి. మరోవైపు వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించే గ్యాస్‌ సరఫరాను నిలిపేశాయి. దీంతో జిల్లాలోని హోటళ్లు, రెస్టారెంట్లు ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆహార పదార్థాల ధరలు కూడా పెరుగుతాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ప్రభావం ఇలా..

గ్యాస్‌ బుక్కింగ్‌ సరఫరాకు సంబంధించిన వెబ్‌సైట్లు ఈ నెల 6వ తేది అర్ధరాత్రి నుంచే డీలర్ల పరిధి నుంచి చమురు సంస్థల అజమాయిషిలోకి వెళ్లాయి. గృహ వినియోగదారులు సిలిండర్‌ బుక్‌ చేసేందుకు గడువును 21 నుంచి 25 రోజులకు పెంచారు. ఈ వ్యత్యాసం రానున్న రోజుల్లో 30 నుంచి 35 రోజులకు పెరిగే అవకాశం ఉందని డీలర్ల అంచనా వేస్తున్నారు. బుక్‌ తర్వాత డెలివరీకి వారం, పది రోజులు పట్టే అవకావం ఉంటుంది. దీంతో గ్యాస్‌ ను పొదుపుగా వాడుకోవడంతోపాటు కట్టెల పొయ్యిలను కూడా పెట్టుకోవాల్సి ఉంది.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

జిల్లాలో ప్రధానంగా భువనగిరి, చౌటుప్పల్‌, ఆలేరు, యాదరగిరిగుట్ట, భూదాన్‌పోచంపల్లి పట్టణాల్లో కొన్ని పెద్ద హోటళ్లు ఉన్నాయి. వీరు నేరుగా అర్డర్ల త్వారా సంబంధిత డీలర్ల ద్వారా వాణిజ్య సిలిండర్లను తెచ్చుకుంటారు. కొందరు రెండు మూడు రోజులకు సరిపడా నిల్వ ఉంచుకుంటారు. కానీ, ప్రస్తుతం ఇ పరిస్థితి లేదు. దీంతో నిర్వాహకులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది.

వారం రోజుల నుంచి పెరిగిన బుకింగ్‌లు

జిల్లాలో వారం రోజుల నుంచి వంట, కమర్షియల్‌ గ్యాస్‌ గాని బుకింగ్‌లు పెరిగాయి. ప్రస్తుతం పెరిగిన ధరలతో పాటు మారిన విధానంతో రెండు మూడు రోజులుగా మరింతగా బుకింగ్‌లు పెరుగుతున్నాయి. కాగా ఈకేవైసీ లేకుండా గ్యాస్‌ బుకింగ్‌ చేసే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో డీలర్ల వద్దకు వెళ్లి ఈకేవైసీ చేసుకోవాల్సి ఉంది.

అదనపు భారం.. రూ.90 లక్షలు

జిల్లాలో ప్రస్తుతం 7,54,831 మంది జనాభా ఉంది. ఇండేన్‌, భారత్‌, హెచ్‌పీసీ గ్యాస్‌ డీలర్లు ఉన్నారు. ఆయా డీలర్ల పరిధిలో సుమారు 2,61,201 గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం గృహ సిలిండర్‌ ధర ఈ నెల 6 నుంచి రూ.60లు పెరగడంతో ప్రస్తుతం వంట గ్యాస్‌ ధర 14 కిలోల సిలిండర్‌కు రూ.960.50కు చేరింది. వాణిజ్య గ్యాస్‌ ధర 19 కేజీల సిలిండర్‌కు రూ.2,100కు చేరినా సరఫరా నిలిచింది. ప్రస్తుతం జిల్లాలోని ప్రజలు ప్రతినెలా 1.50 లక్షల వరకు గ్యాస్‌ సిలిండర్లు వినియోగిస్తుండగా 90 లక్షల రూపాయల వరకు అదనపు భారం పడనుంది.

ఆలేరు : గ్యాస్‌ సిలిండర్‌ ధరల పెంపును వ్యతిరేకిస్తూ ఆదివారం ఆలేరు పట్టణంలో సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ నాయకులు ఆందోళన చేపట్టారు. రైల్వేగేట్‌ చౌరస్తాలో కట్టెల పొయ్యిమీద వంట చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్యాస్‌ సిలిండర్‌ ధరల పెంపుతో పేద, మధ్యతరగతి వర్గాలపై ఆర్థికభారం పడుతుందన్నారు. పెంచిన గ్యాస్‌సిలిండర్‌ ధరలను తక్షణమే తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు ఆర్‌.జనార్దన్‌, సహదేవ్‌, అడివయ్య, నాగరాజు, బాలమల్లేష్‌, సమరసింహారెడ్డి, రాఘవరెడ్డి, కొమురయ్య, గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement