చిన్నారి ఉసురు తీసిన భార్యాభర్తల వివాదం | 11 month old baby died in parents quarrel | Sakshi
Sakshi News home page

చిన్నారి ఉసురు తీసిన భార్యాభర్తల వివాదం

Feb 27 2026 2:53 AM | Updated on Feb 27 2026 2:53 AM

11 month old baby died in parents quarrel

మద్యం మత్తులో కుమార్తెతో సహా కాలువలోకి దూకిన తండ్రి.. చిన్నారి మృతి  

జగ్గంపేట: భార్యాభర్తల మధ్య నెలకొన్న కీచులాట 11 నెలల చిన్నారి ప్రాణాలు తీసింది. ఈ దారుణ సంఘటన కాకినాడ జిల్లా జగ్గంపేటలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జగ్గంపేట టీచర్స్‌ కాలనీలో ఓడిబోయిన మణికంఠ, సాయి దంపతులు నివాసం ఉంటున్నారు. మణికంఠ మద్యానికి బానిసై జీవనోపాధికి కూడా ఇబ్బంది పడడంతో దంపతుల మధ్య తరచూ వివాదాలు జరుగుతున్నాయి. 

గురువారం కూడా భార్యాభర్తల మధ్య వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో అత్తింటి వారు పరుషంగా మాట్లాడడంతో కోపంతో ఊగిపోయిన మణికంఠ 11 నెలల కుమార్తెను తీసుకుని స్థానికంగా ఉన్న పోలవరం కాలువలోకి మోటార్‌ సైకిల్‌తో సహా దూసుకుపోయాడు. గుర్తించిన స్థానికులు వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. అప్పటికే చిన్నారి మృతి చెందింది. దీంతో తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. జగ్గంపేట ఎస్‌ఐ రఘునాథరావు కేసు నమోదు చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement