నారాయణ జూనియర్‌ కాలేజీ విద్యార్థిని మృతి | inter student dies in tirupati | Sakshi
Sakshi News home page

నారాయణ జూనియర్‌ కాలేజీ విద్యార్థిని మృతి

Feb 23 2026 10:23 PM | Updated on Feb 24 2026 9:27 AM

inter student dies in tirupati

సాక్షి,తిరుపతి: రేణిగుంట నారాయణ జూనియర్‌ కాలేజీలో విద్యార్థిని మృతి చెందింది. జ్వరంతో బాధపడుతున్న విద్యార్థిని సిబ్బంది ఆస్పత్రికి తరలించారు.

ఇంజక్షన్‌ ఇవ్వడంతో విద్యార్థిని చర్మంపై వాపై వచ్చింది. తిరుపతి రుయా ఆస్పత్రికి విద్యార్థిని తల్లిదండ్రులు తీసుకుని వెళ్లారు. చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి చెందింది. అయితే, వైద్యం వికటించడం వల్లే తమ కుమార్తె మరణించినట్లు బాధితురాలి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. విద్యార్థిని మృతిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 

Advertisement
 
Advertisement
Advertisement