గృహ కొనుగోలులో అప్రమత్తత అవసరం
లేకపోతే ఆర్థిక, మానసిక కుంగుబాటు తప్పదు
సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. పొదుపు, రుణం, పెట్టుబడులతో కూడుకున్న అంశం. జీవితంలో ఎంతో ప్రాధాన్యత కలిగిన స్థలం లేదా ఇల్లు కొనుగోలు చేసే ముందు జాగ్రత్తగా లేకుంటే అటు ఆర్థికంగా ఇటు మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయ్యో.. ఈ ఇల్లు కొని తప్పు చేశానే.. అని జీవితాంతం బాధపడాల్సి వస్తుంది.
రియల్ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం కోసం ఎన్నో చట్టాలు, నిబంధనలు ఉన్నా.. సామాన్యుడి సొంతింటి కలను క్యాష్ చేసుకోవాలనే అక్రమార్కులు కనిపిస్తూనే ఉన్నారు. ప్రీలాంచ్ మోసాలతో పాటు అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టి, వాటిని విక్రయించడం వంటివి ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అందుకే ఇల్లు కొనుగోలు చేసే ముందు కొనుగోలుదారులు అప్రమత్తంగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. వారు సూచిస్తున్న పలు జాగ్రత్తలివీ..
టైటిల్ డీడ్
డెవలపర్‌కు కన్వేయన్స్ రూపంలో భూమికి స్పష్టమైన, మార్కెట్ చేయదగిన టైటిల్ ఉండాలి. గృహ కొనుగోలుదారులు దీని కోసం అడగాలి. స్థానిక సబ్ రిజి్రస్టార్ కార్యాలయానికి వెళ్లి సదరు భూమిపై ఎలాంటి వివాదాలు, లిటిగేషన్లు లేవని నిర్ధారించుకోవాలి. అలాగే ప్రాపర్టీ ట్యాక్స్ రసీదుల వంటి ఇతర కీలక పత్రాలను కూడా పరిశీలించాలి.
అనుమతులు
ప్రాజెక్ట్ లేఅవుట్, భవన నిర్మాణ ప్రణాళికకు మున్సిపల్ అధికారుల ఆమోదం ఉండాలి. ఇవి లేకుంటే అది అక్రమ నిర్మాణం కిందే లెక్క. ఈ నేపథ్యంలో ఇళ్ల కొనుగోలుదారులు సదరు ప్రాజెక్ట్‌కు అన్ని రకాల అనుమతులు ఉన్నాయో లేవో క్రాస్ చెక్ చేసుకోవాలి.
సర్టిఫికెట్లు
ప్రాజెక్ట్ ప్రారంభానికి సంబంధించి కమెన్స్ సర్టిఫికెట్, అది పూర్తయ్యాక కంప్లీషన్ సర్టిఫికెట్ చాలా ముఖ్యం. ప్రాజెక్ట్ నిబంధనల ప్రకారమే నిర్మించిందని చెప్పడానికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ మంజూరు చేస్తారు. అలాగే ప్రతీ ప్రాజెక్ట్‌కు అగ్నిమాపక, పర్యావరణం, నీటి సరఫరా, విద్యుత్ సహా బహుళ విభాగాల నుంచి నిరభ్యంతర ధృవీకరణ పత్రం(ఎన్‌ఓసీ) సరి్టఫికెట్లు అవసరం. ఇవన్నీ పునఃపరిశీలించిన తర్వాతే గృహ కొనుగోలు నిర్ణయం తీసుకోవాలి.
రిజిస్ట్రేషన్
రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(రెరా) చట్టం కింద ప్రతీ ప్రాజెక్ట్‌ను నమోదు చేయాలి. రెరా ఆమోదం పొందకుండా ప్రాజెక్ట్ నిర్మాణం, అమ్మకం వంటివి చేయకూడదు. అందువల్ల ఆయా ప్రాజెక్ట్‌కు రెరా అనుమతి ఉందా లేదా అనేది తనిఖీ చేసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి.
ఇదీ చదవండి: హైదరాబాద్‌లో పెరుగుతున్న హౌసింగ్ ఇన్వెంటరీ


