సాక్షి, సిటీబ్యూరో: రోజురోజుకూ అందుబాటు గృహాలకు ఆదరణ తగ్గుతూ.. విలాసవంతమైన ఇళ్లకు డిమాండ్ పెరుగుతోంది. విశాలమైన స్థలం, ఆధునిక వసతులు, మెరుగైన జీవనశైలి కోరుకునే కస్టమర్లు పెరుగుతుండటంతో లగ్జరీ ఇళ్లకు ఆదరణ వృద్ధి చెందుతోంది.
2022 నుంచి 2025 మధ్యకాలంలో లగ్జరీ ఇళ్ల ధరలు 40 శాతం మేర పెరగగా.. చౌక గృహాల రేట్లు 26 శాతం మేర క్షీణించాయి. 2022లో రూ.40 లక్షలోపు ధర ఉండే అఫర్డబుల్ ఇళ్ల ధరలు చ.అ.కు రూ.4,229గా ఉండగా.. 2025 నాటికి 26 శాతం వృద్ధి రేటుతో రూ.5,299లకు చేరింది.
అదే రూ.40 లక్షల నుంచి రూ.కోటిన్నర ధర ఉండే మిడ్ ప్రీమియం గృహాల ధరలు 2022లో చ.అ.కు రూ.6,880గా ఉండగా.. ఇప్పుడది 39 శాతం వృద్ధి రేటుతో రూ.9,537కు పెరిగింది. ఇక, రూ.కోటిన్నర కంటే ఎక్కువ ధర ఉండే లగ్జరీ యూనిట్ల ధర 2022లో చ.అ.కు రూ.14,530లుగా పలకగా.. ఇప్పుడది 40 శాతం వృద్ధి రేటుతో రూ.20,300లకు ఎగబాకింది.


