ఫ్లెక్సిబుల్‌ ఆఫీస్‌లకు డిమాండ్: కారణం ఇదే! | Demand For Flexible Office Space | Sakshi
Sakshi News home page

ఫ్లెక్సిబుల్‌ ఆఫీస్‌లకు డిమాండ్: కారణం ఇదే!

Nov 29 2025 3:37 PM | Updated on Nov 29 2025 4:45 PM

Demand For Flexible Office Space

దేశంలో ఆఫీసు స్పేస్‌ శరవేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం 8 ప్రధాన నగరాలలో ఆఫీసు స్పేస్‌ స్టాక్‌ 100 కోట్ల చ.అ.లను దాటింది. ఒకప్పుడు బ్యాక్‌ ఆఫీస్‌ కార్యకలాపాలకు మాత్రమే పరిమితమైన ఇండియా.. నేడు గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్లు (జీసీసీ)లకు ప్రధాన కేంద్రంగా మారింది.

ప్రతిభ, నైపుణ్యం కలిగిన కార్మికులు, తక్కువ జీవన వ్యయం, అందుబాటులో స్థిరాస్తి ధరలు, ప్రభుత్వ ప్రోత్సాహకర విధానాలు కారణంగా బహుళ జాతి సంస్థలు జీసీసీల ఏర్పాటుకు ఇండియాను ఎంచుకుంటున్నాయి. రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌(రీట్స్‌)విస్తరణ, గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్లు(జీసీసీ), ఫ్లెక్సిబుల్‌ ఆఫీస్‌లకు ప్రాధాన్యత పెరుగుతుండటమే ఈ డిమాండ్‌కు కారణం.

కాస్త తడబడి..
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో సప్లయి చెయిన్‌లో నష్టాలు, ఇంధన వ్యయాలు, మూలధన ప్రవాహాలను ప్రభావితం చేయడంతో కార్యాలయ విభాగం కాస్త తడబడింది. 2025 క్యూ3లో 1.78 కోట్ల చ.అ. కార్యాలయ స్థల లావాదేవీలు జరిగాయి. 

వార్షిక ప్రాతిపదికన 6 శాతం క్షీణించినప్పటికీ.. 2024 క్యూ3తో పోలిస్తే  అత్యధిక వృద్ధిని నమోదు చేసింది. బెంగళూరు, ఎన్‌సీఆర్, ముంబై లావాదేవీలలో సగం వాటాలను కలిగి ఉన్నాయి. 42 లక్షల చ.అ.లతో బెంగళూరు ముందంజలో ఉంది. ఈ త్రైమాసికంలో హైదరాబాద్, చెన్నైలు వ్యాల్యూమ్‌ వృద్ధిలో అత్యధిక వాటాలను కలిగి ఉన్నాయి. హైదరాబాద్‌ 45 శాతం, చెన్నై 51 శాతం వాల్యూమ్‌లను కలిగి ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement