గ్రీన్‌లాండ్‌: ఇక్కడ ఇల్లు కొనొచ్చు.. కానీ స్థలం కొనలేరు! | Real Estate in Greenland You Can Buy a Home But Not the Land | Sakshi
Sakshi News home page

గ్రీన్‌లాండ్‌: ఇక్కడ ఇల్లు కొనొచ్చు.. కానీ స్థలం కొనలేరు!

Jan 22 2026 12:08 PM | Updated on Jan 22 2026 12:27 PM

Real Estate in Greenland You Can Buy a Home But Not the Land

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కారణంగా నిత్యం వార్తల్లో నిలుస్తోంది గ్రీన్‌లాండ్‌. దశాబ్దాల క్రితం తమ చేజారిన ఈ ద్వీప దేశాన్ని తిరిగి చేజిక్కించుకోవాలని ట్రంప్‌ ఉవ్విళ్లూరుతున్నారు. డెన్మార్క్ రాజ్యంలో భాగమైన స్వయంప్రతిపత్త ప్రాంతం మొత్తాన్ని కొనుగోలు చేయడానికి అమెరికా ఆసక్తిని వ్యక్తం చేస్తుండగా వాస్తవంగా ఇక్కడ ఎక్కడా లేని భిన్న భూ యాజమాన్య చట్టాలు ఉన్నాయి.

ఇంటి కొనుగోలు, భూమి పరిమితులు
గ్రీన్‌లాండ్‌లో మీరు ఇల్లు కొనుగోలు చేయవచ్చు కానీ భూమి స్వంతం చేసుకోవడం సాధ్యం కాదు. ఎందుకంటే.. గ్రీన్‌లాండ్ మొత్తం భూమి ప్రభుత్వానికి చెందినది. ప్రైవేట్ భూ యాజమాన్యానికి అనుమతి ఉండదు. స్థానికులు, కంపెనీలు, లేదా సహకార గృహ సంఘాలు మాత్రమే భూమిని ఉపయోగించుకునే హక్కును పొందగలరు. కానీ భూమి అసలు వారికి స్వంతం కాదని గుర్తుంచుకోవాలి.

హౌసింగ్ కంపెనీలు.. పబ్లిక్ హౌసింగ్, ఇతర ఆస్తులను నిర్వహిస్తాయి. మీరు ఇల్లు కొనుగోలు చేసినా, భూమి కోసం “సైట్ కేటాయింపు” (use-right allocation) కోసం స్థానిక మునిసిపాలిటీకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సైట్ కేటాయింపు పొందిన తర్వాత మాత్రమే ఆ భూమిని ఉపయోగించుకునేందుకు వీలుంటుది. కానీ దాన్ని కొనలేరు.

సైట్ కేటాయింపుతో ఏమేం చేయొచ్చు..
కొత్త ఇల్లు నిర్మించుకోవచ్చు. ఇప్పటికే ఉన్న ఇంటిని విస్తరించుకోవచ్చు. నిర్మించిన ఇల్లు కొనుక్కోవచ్చు. కారు పార్కింగ్‌ ఏర్పాటు చేసుకోవచ్చు. నిర్మాణం ఉపయోగాన్ని మార్చుకోవచ్చు (ఉదాహరణకు, దుకాణం నుంచి ఇల్లుగా మార్పు). పైపు, శాటిలైట్ డిష్, మురుగునీరు సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవచ్చు.

గ్రీన్‌లాండ్‌లో భూమి చట్టాలు ఒక తాత్విక సిద్ధాంతానికి అనుగుణంగా ఉంటాయి. అదేంటంటే.. భూమి వ్యక్తిగత యాజమాన్యంలో ఉండకూడదు. అది సమష్టిగా ప్రజలందరికీ చెందాలి.

ఆస్తి ఎవరు కొనొచ్చు..
గ్రీన్‌లాండ్, డెన్మార్క్ లేదా ఫారో దీవుల పౌరులు ఇక్కడ ఆస్తి కొనవచ్చు. ఈ ద్వీపంలో కనీసం రెండు సంవత్సరాలు నివసించి, పన్నులు చెల్లించిన వారు కూడా సైట్‌ కేటాయింపు కోసం దరఖాస్తు చేయవచ్చు.

ఇంటివలన పొందే స్థల పరిమాణం కూడా కుటుంబానికి అనుగుణంగా ఉంటుంది. ఉదాహరణకు, నలుగురు సభ్యులున్న కుటుంబానికి నాలుగు పడకగదుల అపార్ట్‌మెంట్ కేటాయిస్తారు. కానీ నుక్ వంటి పెద్ద పట్టణాలలో వెయిటింగ్ లిస్ట్ చాలా పొడవుగా ఉంటుంది. అందువల్ల ఇక్కడ ఇంటికి సైట్‌ కేటాయింపు రావడానికి ఎక్కువ సమయం పడుతుంది.

గ్రీన్‌లాండ్ రియల్ ఎస్టేట్ మార్కెట్
గ్రీన్‌లాండ్‌లో పెద్ద పట్టణాలు గృహాల కొరతను ఎదుర్కొంటున్నాయి.  ఉద్యోగుల కోసం ముఖ్యంగా స్వయంప్రతిపత్త ప్రాంతాలకు వలస వచ్చిన వారికి ప్రత్యేక వసతులు ఉంటాయి. ఇంటికి సైట్‌ కేటాయింపు కోసం వేచి ఉండే సమయం నుక్‌లో సుమారుగా 10–12 సంవత్సరాలు ఉంటుంది. ప్రైవేట్ కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు వసతిని అందిస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement