రాయదుర్గం భూముల వేలంతో మళ్లీ ఊపు
జిల్లాలో భారీగా భూముల అమ్మకాలు, కొనుగోలు
రెండేళ్లుగా స్తబ్ధుగా ఉన్న రియల్ రంగంలో మళ్లీ కదలిక మొదలైంది. 2023 నవంబర్‌లో అసెంబ్లీ, 2024లో లోక్‌సభ ఎన్నికలకు తోడు అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక సంక్షోభం.. తర్వాత చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల్లో వెలసిన నిర్మాణాల కూల్చివేతలతో భూముల క్రయవిక్రయాలు భారీగా తగ్గినప్పటికీ ఇటీవల మళ్లీ ఊపందుకోవడం రియల్ రంగానికి కొంత ఊరటనిస్తోంది.
2023 జనవరి నుంచి డిసెంబర్ వరకు జిల్లా వ్యాప్తంగా 2,48,189 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా, వీటి ద్వారా ప్రభుత్వానికి రూ.3,893.26 కోట్ల ఆదాయం సమకూరింది. 2024 జనవరి నుంచి డిసెంబర్ వరకు 2,41,297 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా, వీటి ద్వారా రూ.3,911.87 కోట్ల ఆదాయం వచ్చింది. 2025 జనవరి నుంచి అక్టోబర్ 20 వరకు 1,98,766 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా ప్రభుత్వానికి రూ.3,381.12 కోట్ల ఆదాయం సమకూరింది.
రాయదుర్గం భూముల వేలంతో..
రాయదుర్గంలోని పలు భూములకు ఇటీవల హెచ్‌ఎండీఏ వేలం నిర్వహించగా బహిరంగ మార్కెట్లో ఎకరం ధర రూ.177 కోట్లు పలికిన విషయం తెలిసిందే. ఆర్థికమాంద్యం కారణంగా ఇప్పటి వరకు ఇక్కడ పెట్టుబడులకు కొంత వెనుకాడిన రియల్ సంస్థలు తాజా వేలంతో మళ్లీ జిల్లాపై దృష్టి సారించాయి.
ఇదే సమయంలో ప్రభుత్వం మీర్‌ఖాన్‌పేట కేంద్రంగా 30 వేల ఎకరాల్లో ‘భారత్ ఫ్యూచర్ సిటీ’కి రూపకల్పన చేయడం, పరిశ్రమలకు అనువైన వా తావరణం కల్పిస్తుండటం తెలిసిందే. ప్రతిష్టాత్మక 550 బడా కంపెనీలను ఇక్కడికి తీసుకురావడమే లక్ష్యమని ప్రభుత్వం ప్రకటించడం, రేడియల్ రోడ్లు, రింగు రోడ్లకు భూ సేకరణ ప్రక్రియను చేపట్టి, ఇప్పటికే ఆయా పనులకు శంకుస్థాపనలు చేయడంతో ఆయా పరిసరాల్లో భూముల కొనుగోళ్లకు వ్యాపారులు ఆసక్తి చూపుతున్నారు.
ఇదీ చదవండి: రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్లకు ఈ-వేలం: ఇదిగో ఫుల్ డీటెయిల్స్
భవిష్యత్తులో ఇక్కడ భూముల ధరలు మరింత పెరిగే అవకాశం ఉండడంతో బడా రియల్టర్లే కాదు సాధారణ ప్రజలు కూడా తమ పిల్లల భవిష్యత్తు అవసరాల కోసం ముందే ప్లాట్లు, ఖాళీ స్థలాలు కొనిపెడుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే.. ఈ జూలై, ఆగస్టు, సెపె్టంబర్‌లో రిజి్రస్టేషన్ల సంఖ్య కొంత పెరగడమే ఇందుకు నిదర్శనమని రిజి్రస్టేషన్స్ అండ్ స్టాంప్స్ విభాగం అధికారులు చెబుతున్నారు.


