సాక్షి, సిటీబ్యూరో: ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ వస్తువులు కనిపిస్తుంటే ఇల్లు అందవికారంగా కనిపించడమే కాదు ఇంటి యజమానిపై ప్రతికూల అభిప్రాయాలు ఏర్పడతాయి. అందుకే అందమైన ఇంటీరియర్‌తో ఇంటికి వచి్చన అతిథులకు స్వాగతం పలుకుతున్నారు నేటి గృహ కొనుగోలుదారులు. ఇంటీరియర్‌లో అల్మారాలది ప్రత్యేక స్థానం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇవి సామాగ్రిని భద్రపర్చడానికి మాత్రమే కాకుండా ఇంటి అందాన్ని రెట్టింపు చేస్తాయి. స్థలాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడంలో కీలకమైన అల్మారాలతో ఆధునిక డిజైన్లతో గృహ శోభను రెట్టింపు చేస్తాయి.
స్లైండింగ్ డోర్ కబోర్డ్స్, వాక్ ఇన్ వార్డ్‌రోబ్స్, మిర్రర్ ఫినిష్, కార్నర్ కబోర్డ్స్, ఫ్లోర్ టు సీలింగ్ కబోర్డ్స్ వంటి ఎన్నో రకాల డిజైన్లు, రంగులతో అల్మారాలు మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. వీటితో పాటు చెక్క అల్మారాలు, ప్లైవుడ్, లామినేటెడ్, గ్లాస్, మెటల్‌తో కూడా అల్మారాలు ఉన్నాయి. తేమ ఎక్కువగా ఉండే ప్రదేశాలలో లామినేట్, మెటల్ ఫినిషింగ్ అల్మారాలు వినియోగించడం ఉత్తమం. చెదల సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి మూడు నెలలకు ఒకసారి డీప్ క్లీనింగ్ అవసరం.


