రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్లూ.. బీ కేర్‌ ఫుల్‌! | RERA Warning to Real Estate Agents Rs 10000 Fine Per Day | Sakshi
Sakshi News home page

రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్లూ.. బీ కేర్‌ ఫుల్‌!

Jan 3 2026 3:51 PM | Updated on Jan 3 2026 4:20 PM

RERA Warning to Real Estate Agents Rs 10000 Fine Per Day

కమీషన్లకు ఆశ పడి గృహ కొనుగోలుదారులకు ఏవేవో మాయమాటలు చెప్పి ప్లాట్, అపార్ట్‌మెంట్‌ విక్రయించేశామా.. చేతులు దులిపేసుకున్నామా? అంటే కుదరదు. ఎందుకంటే రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్లు, మధ్యవర్తులు, బ్రోకర్లు టీజీ రెరాలో రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం తప్పనిసరి. రెరా రిజిస్ట్రేషన్‌ లేకుండా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడం నేరం. 

గృహ కొనుగోలుదారులకు సరైన సమాచారం అందించి వారు మోసాలకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్లు, మధ్యవర్తులది. రెరా నిబంధనలు పాటించని ఏజెంట్లకు రోజుకు రూ.10 వేల చొప్పున జరిమానా విధిస్తారు. గృహ కొనుగోలుదారులకు భరోసా, పెట్టుబడులకు భద్రత కల్పించడమే తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ(టీజీ రెరా) ప్రధాన లక్ష్యం. ఏజెంట్లు, మధ్యవర్తులు ఆదాయ పన్ను చట్టం 1961లోని నిబంధనలకు 43 ఆఫ్‌ 1961 ప్రకారం తన ఖాతా పుస్తకాలు, రికార్డులు, ఇతరత్రా పత్రాలను నిర్వహించడంతో పాటు తరచూ 
సమీక్షించాలి.

ప్రాజెక్ట్‌ల రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి.. 
రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్ట్‌లకు జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, టీజీఐఐసీ, డీటీసీపీ, యూడీఏ ఇతర స్థానిక సంస్థల అనుమతులతో పాటు రెరా రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి. 500 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణం లేదా 8 కంటే ఎక్కువ యూనిట్లు ఉన్న రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్ట్‌లు రెరా అథారిటీ ఆమోదం, రిజిస్ట్రేషన్‌  లేకుండా ప్లాట్లు, అపార్ట్‌మెంట్ల అమ్మకం, బుకింగ్, ఆఫర్లు, మార్కెటింగ్, ఇతర ప్రచారాలు చేయకూడదు. రెరా నిబంధనలను ఉల్లంఘించి నిర్లక్ష్యంగా వ్యవహరించే ప్రాజెక్ట్‌లు, బిల్డర్లకు రెరా చట్టంలోని సెక్షన్‌–59 ప్రకారం అపరాధ రుసుములు విధిస్తుంది.

ఇది చదివారా? రియల్‌ ఎస్టేట్‌.. ఫుల్‌ జోష్‌!

10,408 ప్రాజెక్ట్‌ల నమోదు.. 
ఇప్పటి వరకు టీజీ రెరాలో 10,408 ప్రాజెక్ట్‌లు నమోదయ్యాయి. 4,729 మంది ఏజెంట్లు రిజిస్ట్రేషన్‌  చేసుకున్నారు. 10 మంది ప్రాజెక్ట్‌లు/ఏజెంట్ల రిజి్రస్టేషన్లను రద్దు చేశారు. జయాస్‌ ప్లాటినం, బీఆర్‌ మోడోల్యాండ్‌ అపార్ట్‌మెంట్స్, కేసినేని నార్త్‌స్కేప్, సిగ్నిఫా సిగ్నేచర్, లక్ష్మీ ఇన్ఫోబాన్‌ టవర్‌–23, ఎపిటోమ్‌ ఇంటిగ్రేటెడ్‌ సిటీ–ఫేజ్‌ 2, వియాన్‌ వన్‌80, గంగిడీస్‌ రాయల్‌ అడోబ్, స్పెక్ట్రా టెక్‌ టవర్స్‌ వీటిల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు టీజీ రెరాలో 2,619 ఫిర్యాదులు నమోదు కాగా.. 1,709 ఫిర్యాదులను పరిష్కృతమయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement