
సెప్టెంబర్ క్వార్టర్‌లో 33 శాతం పెరిగిన లీజింగ్
టాప్–8 నగరాల్లో మాత్రం క్షీణత
నైట్‌ఫ్రాంక్ ఇండియా నివేదిక
న్యూఢిల్లీ: హైదరాబాద్ ఆఫీస్ మార్కెట్లో బలమైన డిమాండ్ కొనసాగుతోంది. సెప్టెంబర్ త్రైమాసికంలో 2.9 మిలియన్ చదరపు అడుగుల (ఎస్‌ఎఫ్‌టీ) లీజింగ్ నమోదైంది. ఈ ఏ డాది మొదటి తొమ్మిది నెలల్లో లీజింగ్ 8.8 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీకి చేరుకున్నట్టు నైట్‌ఫ్రాంక్ ఇండియా తెలిపింది. దేశవ్యాప్తంగా టాప్-8 పట్టణాల్లో సెపె్టంబర్ క్వార్టర్‌లో ఆఫీస్ లీజింగ్ క్రితం ఏడాది ఇదే కాలంలోని గణాంకాలతో పోల్చిచూస్తే 6% తగ్గి 17.8 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉన్నట్టు పేర్కొంది. ఈ నగరాల్లో స్థూల లీజింగ్ మాత్రం 24 శాతం పెరిగి 66.7 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీకి చేరిందని, పూర్తి ఏడాదికి రికా ర్డు స్థాయిలో 85 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీ లీజింగ్ నమోదు కావొచ్చని అంచనా వేసింది.
పట్టణాల వారీగా..
- బెంగళూరులో ఆఫీస్ లీజింగ్ సెప్టెంబర్ క్వార్టర్‌లో 21 శాతం క్షీణించి 4.2 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది.
- చెన్నై మార్కెట్లో ఆఫీసు వసతుల లీజింగ్ 9% పెరిగి 2.8 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా నమోదైంది.
- ఢిల్లీ ఎన్‌సీఆర్ మార్కెట్లో మాత్రం సెప్టెంబర్ త్రైమాసికంలో 15 శాతం తగ్గి 2.7 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీకి పరిమితమైంది.
- పుణెలో 9 శాతం తగ్గి 2.3 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీకి ఆఫీస్ లీజింగ్ పరిమితమైంది.
- ముంబైలో సెప్టెంబర్ క్వార్టర్‌లో లీజింగ్ 27 శాతం తగ్గి 1.9 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. తొమ్మిది నెలల కాలంలో చూసినా 12 శాతం తగ్గి 7.4 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీకి పరిమితమైంది.
- కోల్‌కతాలో ఆఫీస్ లీజింగ్ సెప్టెంబర్ క్వార్టర్‌లో 190 శాతం పెరిగి 0.5 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా నమోదైంది.
- అహ్మదాబాద్ మార్కెట్లో 13 శాతం పెరిగి సెప్టెంబర్ త్రైమాసికంలో 0.4 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది.
ఇదీ చదవండి: ఈ టెక్నాలజీ చూడు.. ఇల్లు కట్టుకోవడానికి సరైన తోడు!