
జూలై–సెపె్టంబర్‌లో 15 శాతం క్షీణత
819 మిలియన్ డాలర్లకు పరిమితం
అనరాక్ క్యాపిటల్ నివేదికలో వెల్లడి
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) దేశీయంగా రియల్ ఎస్టేట్ రంగంలో ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) పెట్టుబడులు 819మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. గతేడాది ఇదే వ్యవధిలో నమోదైన 967 బిలియన్ డాలర్లతో పోలిస్తే 15 శాతం తగ్గాయి. ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ అనుబంధ సంస్థ అనరాక్ క్యాపిటల్ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఇక 2025–26 ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య కాలంలో పీఈ పెట్టుబడులు 2.6 బిలియన్ డాలర్ల నుంచి 15 శాతం క్షీణించి 2.2 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి.
ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో వచి్చన మొత్తం ఇన్వెస్ట్‌మెంట్లలో విదేశీ పెట్టుబడుల వాటా 73 శాతంగా ఉంది. తొలి త్రైమాసికంలో కాస్త ఆశావహ ధోరమి కనిపించినప్పటికీ అది కొన్నాళ్ల ముచ్చటే అయిందని, రెండో త్రైమాసికంలో కార్యకలాపాలు నెమ్మదించాయని అనరాక్ క్యాపిటల్ సీఈవో శోభిత్ అగర్వాల్ తెలిపారు. పూర్తి సంవత్సరం ప్రాతిపదికన చూస్తే పీఈ పెట్టుబడులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయని వివరించారు. 2021 ఆర్థిక సంవత్సరంలో 6.4 బిలియన్ డాలర్ల నుంచి 2025 ఆర్థిక సంవత్సరంలో 3.7 బిలియన్ డాలర్లకు పడిపోయాయని పేర్కొన్నారు.
రెసిడెన్షియల్ సెగ్మెంట్లో అమ్మకాల జోరు..
రెసిడెన్షియల్ విభాగంలో రియల్ ఎస్టేట్ అమ్మకాల పరిమాణం భారీగా ఉందని, దీంతో డెవలపర్లకు నగదు ప్రవాహం గణనీయంగా మెరుగుపడిందని అగర్వాల్ తెలిపారు. దీనితో వారు ఖరీదైన ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్)పై ఆధారపడటం తగ్గుతుందని పేర్కొన్నారు. అలాగే బ్యాంకుల వద్ద కూడా పుష్కలంగా నిధులు ఉండటంతో, గతానికి భిన్నంగా, అవి రియల్టికి రుణాలిచ్చేందుకు మరింత సానుకూలంగా ఉన్నాయని ఆయన వివరించారు. అటు కమర్షియల్ రియల్ ఎస్టేట్ విషయం తీసుకుంటే రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రస్తుతం చాలా అనిశ్చితి నెలకొన్నట్లు చెప్పారు. దీనితో ద్రవ్యోల్బణంతో పాటు అంతర్జాతీయంగా ఇతరత్రా స్థూల ఆర్థిక అనిశ్చితి కూడా పెరుగుతోందని వివరించారు.
‘అందుకే విదేశీ పెట్టుబడుల ప్రవాహం నెమ్మదించంది. భారత్ గణనీయంగా వృద్ధి చెందుతున్న మార్కెట్‌గానే కాకుండా పెట్టుబడులు వృద్ధి చెందేందుకు ఆస్కారమున్న అతి తక్కువ దేశాల్లో ఒకటిగా నిలుస్తోంది కాబట్టి ఇది తాత్కాలిక ధోరణే కావొచ్చు. అనిశ్చితులు తొలగిపోయి, స్పష్టత వచి్చందంటే చాలు కమర్షియల్ రియల్ ఎస్టేట్‌లోకి పీఈ పెట్టుబడులు మళ్లీ పుంజుకుంటాయి‘ అని అగర్వాల్ చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో ఇండ్రస్టియల్, లాజిస్టిక్స్ విభాగంలోకి పీఈ పెట్టుబడులు అసలు రాలేదు. రిటైల్, మిక్సిడ్–యూజ్, కమర్షియల్ అసెట్స్ విభాగంలో గణనీయంగా వచ్చాయి. హోటల్స్, డేటా సెంటర్లలోకి కూడా పెట్టుబడులు మెరుగ్గానే వచి్చనట్లు అనరాక్ క్యాపిటల్ తెలిపింది.
జోరుగా ఈక్విటీ పెట్టుబడులు
సెపె్టంబర్ త్రైమాసికంలో 3.8 బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: దేశ రియల్ ఎస్టేట్ రంగంలోకి ఈక్విటీ పెట్టుబడుల రాక సెపె్టంబర్ త్రైమాసికంలో బలంగా నమోదైంది. 48 శాతం అధికంగా 3.8 బిలియన్ డాలర్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చినట్టు సీబీఆర్‌ఈ ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఈక్విటీ పెట్టుబడుల రాక 2.6 బిలియన్ డాలర్లుగానే ఉంది. ప్రధానంగా భూ సమీకరణ, అభివృద్ధి, ఆఫీస్/రిటైల్ ఆస్తుల నిర్మాణంపై ఇన్వెస్టర్లు పెట్టుబడులు కుమ్మరించారు. ఇక ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో రియల్ ఎస్టేట్ రంగంలో ఈక్విటీ పెట్టుబడులు 14 శాతం ఎగసి 10.2 బిలియన్ డాలర్లకు చేరాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇవి 8.9 బిలియన్ డాలర్లుగానే ఉన్నాయి.
2024 సంవత్సరం మొత్తం మీద వచి్చన ఈక్విటీ పెట్టుబడులు 11.4 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. ‘‘వేగవంతమైన వృద్ధి దశలోకి రియట్ ఎసేŠట్‌ట్ రంగం అడుగుపెట్టింది. ఇన్వెస్టర్ల నుంచి స్థిరమైన విశ్వాసం ఇందుకు మద్దతుగా నిలుస్తోంది. రానున్న త్రైమాసికాల్లో గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టుల అభివృద్ధికి బలమైన డిమాండ్ ఉంటుంది. ఇళ్లు, ఆఫీస్, మిశ్రమ వినియోగ వసతులు, డేటా సెంటర్లు, పారిశ్రామిక, రవాణా వసతుల వ్యాప్తంగా సమతూకం ఉంటుంది’’అని సీబీఆర్‌ఈ ఇండియా చైర్మన్, సీఈవో అన్షుమన్ మ్యాగజిన్ తెలిపారు. పెట్టుబడుల్లో మరింత వైవిధ్యం ఉన్నట్టు, నిర్మాణం పూర్తయిన, నిర్మాణంలో ఉన్న ఆస్తుల్లోకి పెట్టుబడులు వస్తున్నట్టు సీబీఆర్‌ఈ ఎండీ గౌరవ్ కుమార్ పేర్కొన్నారు.