మధ్య కాలం నుంచి దీర్ఘకాలానికి పెట్టుబడులపై మెరుగైన రాబడి కోరుకునే ఇన్వెస్టర్ల ముందున్న ఎంపికల్లో మిడ్‌క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఒకటి. వీటిల్లో రిస్క్ అధికం. రాబడి కూడా అధికంగానే ఉంటుంది. లార్జ్‌క్యాప్ కంటే దీర్ఘకాలంలో అదనపు రాబడి మిడ్‌క్యాప్ ఫండ్స్‌తో సాధ్యపడుతుందని గత గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈ విభాగంలో క్వాంట్ మిడ్‌క్యాప్ ఫండ్ మంచి పనితీరు చూపిస్తోంది. పదేళ్లు అంతకుమించిన దీర్ఘకాల లక్ష్యాల కోసం ఇన్వెస్టర్లు ఈ పథకంలో పెట్టుబడులను పరిశీలించొచ్చు.
రాబడులు
స్వల్పకాలం నుంచి దీర్ఘకాలంలోనూ ఈ పథకంలో పనితీరు మెరుగ్గా ఉండడం కనిపిస్తుంది. ముఖ్యంగా గత ఏడాది కాలంలో ఈ పథకం ఎలాంటి రాబడిని ఇవ్వలేదు. అదే సమయంలో నష్టాలను మిగల్చలేదు. గడిచిన ఏడాది కాలంలో ఈక్విటీలు దిద్దుబాటు దశలో ఉండడం తెలిసిందే ఇది మినహా మిగిలిన అన్ని కాలాల్లోనూ రాబడులు పటిష్టంగా ఉన్నాయి. మూడేళ్లలో చూస్తే ఏటా 18 శాతం చొప్పున డైరెక్ట్ ప్లాన్‌లో రాబడి నమోదైంది. ఐదేళ్లలోనూ ఏటా 28 శాతం చొప్పున ప్రతిఫలాన్ని అందించింది. ఇక ఏడేళ్ల కాలంలో 23 శాతం, పదేళ్లలోనూ 18.34 శాతం చొప్పున రాబడి తెచి్చపెట్టింది. బీఎస్‌ఈ 150 మిడ్‌క్యాప్ టీఆర్‌ఐ సూచీతో పోల్చి చూస్తే ఐదేళ్లు, ఏడేళ్లలో అదనపు రాబడి ఇచి్చంది. పదేళ్ల కాలంలోనూ సూచీతో సమాన రాబడిని అందించింది. ముఖ్యంగా గడిచిన ఐదేళ్ల కాలంలో ఏ ఏడాది కూడా ఈ పథకం నికరంగా నష్టాలను ఇవ్వలేదు.
పెట్టుబడుల విధానం
ఇది యాక్టివ్ ఫండ్. అంటే ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు చేస్తుంటుంది. మార్కెట్, రంగాల వారీ పరిస్థితులు, పెట్టుబడుల అవకాశాలకు అనుగుణంగా పోర్ట్‌ఫోలియోలో కొత్త స్టాక్స్‌ను చేర్చుకోవడం, ప్రస్తుత స్టాక్స్‌లో ఎక్స్‌పోజర్ తగ్గించుకోవడం, పూర్తిగా వైదొలగడం వంటి బాధ్యలను ఫండ్ పరిశోధక బృందం ఎప్పటికప్పుడు చేస్తుంటుంది. ముఖ్యంగా ఏదో ఒక విధానానికి పరిమితం కాబోదు. మూమెంటమ్, వ్యాల్యూ, గ్రోత్ ఇలా అన్ని రకాల విధానాల్లోనూ పెట్టుబడుల అవకాశాలను ఈ పథకం పరిశీలిస్తుంటుంది. అవకాశాలకు అనుగుణంగా పెట్టుబడులపై నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది.
పోర్ట్‌ఫోలియో
ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతం రూ.8,525 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 90.52 శాతం పెట్టుబడులను ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసింది. డెట్ సెక్యూరిటీల్లో 2.8 శాతం పెట్టుబడులు పెట్టింది. 6.68 శాతం నగదు నిల్వలు ఉన్నాయి. ముఖ్యంగా ఈక్విటీ పోర్ట్‌ఫొలియోని గమనించినట్టయితే మొత్తం 29 స్టాక్స్ ఉన్నాయి. టాప్–10 స్టాక్స్‌లోనే 58 శాతం పెట్టుబడులు ఉన్నాయి. ఈక్విటీ పెట్టుబడులను గమనిస్తే.. మిడ్‌క్యాప్ కంపెనీల్లో 59 శాతం ఇన్వెస్ట్ చేసింది. అదే సమయంలో 29 శాతం మేర లార్జ్‌క్యాప్ కంపెన్లీలో ఇన్వెస్ట్ చేసింది.
లార్జ్‌క్యాప్ పెట్టుబడులు రిస్క్‌ను తగ్గిస్తాయి. మిడ్‌క్యాప్ పెట్టుబడులు మెరుగైన రాబడులకు అవకాశం కలి్పస్తాయని అర్థం చేసుకోవచ్చు. ఇంధన రంగ కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ 18 శాతం పెట్టుబడులను ఈ రంగాల కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత ఇండ్రస్టియల్స్ కంపెనీలకు 16.71 శాతం, హెల్త్ కేర్ కంపెనీలకు 15.30 శాతం, టెక్నాలజీ కంపెనీలకు 11.22 శాతం చొప్పున కేటాయింపులు చేసింది.


