రియల్‌ ఎస్టేట్ ధరలు పెరిగే సూచనలు | Hyderabad Realty Prices Set To Rise Surging Demand For Developed Plots, Larger Homes And Villas | Sakshi
Sakshi News home page

రియల్‌ ఎస్టేట్ ధరలు పెరిగే సూచనలు

Oct 18 2025 10:15 AM | Updated on Oct 18 2025 12:27 PM

Hyderabad Realty Prices Set to Rise Surging Demand for Developed Plots

వచ్చే మూడు నెలల్లో కొనేందుకు సిద్ధం

రూ.75 లక్షల కేటగిరీకే మొగ్గు

పేరున్న డెవలపర్లయితే ఓకే

సాక్షి, సిటీబ్యూరో: కరోనా మహమ్మారి కంటే ముందుతో పోలిస్తే ఇంట్లో గడిపే సమయం పెరిగింది. దీంతో ఇంటి కొనుగోలు ఎంపికలో రాజీ పడటం లేదు. రిస్క్‌ తీసుకునైనా సరే సొంతింటిని కొనుగోలు చేయాలని.. చిన్న సైజు ఇంటి నుంచి విస్తీర్ణమైన గృహానికి వెళ్లాలని.. ఐసోలేషన్‌ కోసం ప్రత్యేక గది లేదా కుటుంబ సభ్యులతో గడిపేందుకు హాలిడే హోమ్‌ ఉండాలని భావించే వాళ్ల సంఖ్య పెరిగింది. దీంతో రాబోయే రోజుల్లో గృహ విభాగానికి డిమాండ్‌ ఏర్పడటం ఖాయమని జేఎల్‌ఎల్‌రూఫ్‌ అండ్‌ ఫ్లోర్‌ సంయుక్తంగా నిర్వహించిన సర్వే వెల్లడించింది.

వర్క్‌ ఫ్రం హోమ్‌ ఇతరత్రా అవసరాల కోసం బాల్కనీ స్థలంలో అదనంగా ఒక గదిని, ఐసోలేషన్‌ గదిని ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. ఆ తరహా ప్రాజెక్ట్‌లలో కొనుగోళ్లకే కస్టమర్లు మక్కువ చూపిస్తున్నారు. గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న అపార్ట్‌మెంట్లు లేదా పేరున్న డెవలపర్లకు చెందిన నిర్మాణంలోని ప్రాజెక్ట్‌లలో మాత్రమే కొనుగోళ్లకు సిద్ధమవుతున్నారు.

వచ్చే మూడు నెలల కాలంలో 80 శాతం కంటే ఎక్కువ కొనుగోలుదారులు గృహాలను కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. రూ.75 లక్షల కేటగిరీలోని ప్రాపర్టీలను కొనేందుకు సుముఖంగా ఉన్నారు. హైదరాబాద్‌తో సహా బెంగళూరు, చెన్నై, ఢిల్లీఎన్‌సీఆర్‌ నగరాలలో 3 బీహెచ్‌కే ఫ్లాట్లకు డిమాండ్‌ పెరిగింది. ఆయా మార్కెట్లలో పెట్టుబడిదారులు తామ ఉండేందుకు గృహాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు.

బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లలో విల్లాలు, అభివృద్ధి చేసిన ప్లాట్లకు డిమాండ్‌ విపరీతంగా పెరిగింది. ధరలు అందుబాటులో ఉండటం, మార్కెట్‌లో సానుకూల వాతావరణం నెలకొనడం, ప్రోత్సాహకర ప్రభుత్వ విధానాలతో రాబోయే రోజుల్లో హైదరాబాద్‌ రియల్టీ మార్కెట్‌లో ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement