ఇప్పుడు డిమాండంతా ఇలాంటి ఇళ్లకే.. | Demand for 2 3 BHK Apartments Real estate | Sakshi
Sakshi News home page

ఇప్పుడు డిమాండంతా ఇలాంటి ఇళ్లకే..

Nov 15 2025 9:54 AM | Updated on Nov 15 2025 11:09 AM

Demand for 2 3 BHK Apartments Real estate

కరోనా మహమ్మారి తర్వాతి నుంచి కొనుగోలుదారుల అభిరుచిలో మార్పులొచ్చాయి. ఎక్కువ విస్తీర్ణం ఉన్న గృహాల కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. 1,100 చ.అ. నుంచి 1,300 చ.అ.ల్లోని 2 బీహెచ్‌కే, 1,500 చ.అ. నుంచి 2,500 చ.అ.ల్లోని 3 బీహెచ్‌కే అపార్ట్‌మెంట్లకు డిమాండ్‌ ఏర్పడిందని ఓ సంస్థ తన సర్వేలో వెల్లడించింది.

నానక్‌రాంగూడ, కోకాపేట, నార్సింగి, కొండాపూర్‌ వంటి పశ్చిమ హైదరాబాద్‌లో కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని పాజెక్ట్‌ల గురించి విచారణ పెరిగింది. అలాగే ఆ ఏరియాల్లోనే కొత్త ప్రాజెక్ట్‌లు ఎక్కువగా లాంచింగ్స్‌ జరుగుతున్నాయి. మణికొండ, కూకట్‌పల్లి, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లోని అద్దె గృహాలకు డిమాండ్‌ ఎక్కువగా ఉంది.

చందానగర్‌లో అద్దెల వృద్ధి 3.54 శాతం, టోలిచౌకీలో 3.42 శాతం, మియాపూర్‌లో 3.10 శాతం, మణికొండలో 3.34 శాతం, కూకట్‌పల్లిలో 3.04 శాతం, గచ్చిబౌలిలో 2.98 శాతం, కొండాపూర్‌లో 3.11 శాతం, హైటెక్‌సిటీలో 3.15 శాతంగా ఉంది. హైదరాబాద్‌లో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో దాదాపు 12 వేల ఇన్వెంటరీ ఉంది. భూముల ధరలు, నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో గృహాల ధరలు పెరిగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement