వంద నగరాలతో హైదరాబాద్ నుంచి ఫ్లైట్ కనెక్టివిటీ
తాజాగా వందో నగరంగా నవీ ముంబైకి విమాన సర్విసులు
ఈ ఏడాది కొత్తగా 8 నగరాలకు సదుపాయం
74 దేశీయ, మరో 26 అంతర్జాతీయ నగరాలకు విస్తరణ
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మరో ఎత్తుకు ఎదిగింది. వంద జాతీయ, అంతర్జాతీయ నగరాలకు హైదరాబాద్ నుంచి తాజాగా విమాన కనెక్టివిటీ విస్తరించింది. వందో నగరంగా నవీ ముంబైకి ఇటీవల ఇండిగో విమాన సర్వీసులను అందుబాటులోకి తెచి్చంది. హైదరాబాద్ ఎయిర్‌పోర్టు ప్రతి ఏడాది ప్రగతిపథంలో పరుగులు తీస్తోంది. దేశంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విమానాశ్రయాల్లో అగ్రభాగాన ఉంది. ఏటేటా హైదరాబాద్ నుంచి జాతీయ, అంతర్జాతీయ నగరాలకు విమాన సర్విసుల సేవలు విస్తరిస్తూనే ఉన్నాయి.
ఈ సంవత్సరం కొత్తగా 8 నగరాలకు కనెక్టివిటీ అందుబాటులోకి వచి్చంది. తాజాగా విమాన సేవలు ప్రారంభమైన నవీ ముంబైతోపాటు వియత్నాంలోని హనోయ్, హోచిమిన్, అథియోపియా అడిడ్ అబాబా, థాయ్‌లాండ్‌లోని పుకెట్, హాంకాంగ్, ఆమ్‌స్టర్‌డామ్, నగరాలకు విమాన సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రస్తుతం 74 జాతీయ నగరాలకు, 26 అంతర్జాతీయ నగరాలకు హైదరాబాద్ నుంచి విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి.
ఈ ఏడాది విమాన సర్విసులు ప్రారంభమైన అంతర్జాతీయ నగరాల్లో వియత్నాంకు పర్యాటకుల నుంచి భారీ డిమాండ్ ఉన్నట్లు ఎయిర్‌పోర్ట్ వర్గాలు తెలిపాయి. మరోవైపు కొత్త ఏడాది సందర్భంగా కొద్ది రోజులుగా వియత్నాంతోపాటు సింగపూర్, మలేసియా, థాయ్‌లాండ్, శ్రీలంక, మాల్దీవులు తదితర దేశాలకు పర్యాటకుల రద్దీ పెరిగింది. చికాగో, ప్యారిస్ తదితర నగరాలకు వచ్చే ఏడాది విమాన సేవలను విస్తరించే అవకాశముంది.
ప్రతి నెలా 20 లక్షల మందికిపైగా..
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతినెలా 20 లక్షల మందికిపైగా ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నారు. దేశీయ ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు, పర్యాటకులు రైళ్లకు ప్రత్యామ్నాయంగా విమాన సర్విసులను ఎంపిక చేసుకుంటున్నారు. కార్పొరేట్ సంస్థలు, వ్యాపార వర్గాలు సైతం విమాన ప్రయాణాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో ప్రయాణికుల డిమాండ్ మేరకు పలు ఎయిర్‌లైన్స్ సంస్థలు కొత్త నగరాలకు కనెక్టివిటీని అందుబాటులోకి తెస్తున్నాయి.
మరోవైపు అంతర్జాతీయ నగరాలకు సైతం రద్దీ పెరిగింది. గత నవంబర్‌లో అత్యధికంగా సుమారు 27.4 లక్షల మంది హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రయాణం చేశారు. వారిలో అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య 5 లక్షలకుపైగా ఉన్నట్లు అంచనా. ప్రతిరోజు హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి సుమారు 65 వేల నుంచి 75 వేల మంది వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తారు. వీరిలో 55 వేల మందికిపైగా దేశీయ ప్రయాణికులు ఉంటారు. 10 వేల నుంచి 15 వేల మందికిపైగా అంతర్జాతీయ ప్రయాణికులు ఉంటారు. ప్రయాణికుల డిమాండ్ మేరకే ఈ ఏడాది హైదరాబాద్ నుంచి హాంకాంగ్, వియత్నాం, ఆమ్‌స్టర్‌డ్యామ్, ఇథియోపియా తదితర దేశాలకు విమాన సర్విసులు అందుబాటులోకి వచ్చాయి.
మూడు నెలల్లో 52 వేల సర్విసులు..
ఈ ఏడాది ఆగస్టు–అక్టోబర్ మధ్య హైదరాబాద్ నుంచి 52 వేలకుపైగా విమాన సర్విసులు రాకపోకలు సాగించాయి. ప్రతి నెలా సగటున 15 వేల జాతీయ, అంతర్జాతీయ నగరాలకు విమానాలు నడిచాయి. ప్రతి రోజు సుమారు 450 సర్విసులు రాకపోకలు సాగిస్తున్నట్లు అంచనా. దేశీయ విమాన సర్వీసుల్లో ఇండిగో మొదటి స్థానంలో ఉండగా, ఎయిర్ ఇండియా, ఆకాశ ఎయిర్‌లైన్స్ సంస్థలు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. అంతర్జాతీయ సర్విసుల్లో ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ మొదటి స్థానంలో ఉంది. ఖతార్ ఎయిర్‌లైన్స్ రెండోస్థానంలో ఉండగా, ఎయిర్ అరేబియా మూడో స్థానంలో నిలిచింది.
నగరంలో నేడు
⇒ మాదాపూర్‌లోని శిల్పారామంలో హ్యండ్‌లూమ్స్, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్‌టైల్స్, నేషనల్ జ్యూట్ బోర్డు సంయుక్త నిర్వహణలోని అలిండియా క్రాప్‌్ట్స మేళా ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.
⇒ బంజారాహిల్స్ నందిగిరి హిల్స్‌లోని లేపాక్షి షోరూమ్‌లో ప్రత్యేక హస్తకళా వస్తువుల ప్రదర్శన ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. క్రిస్మస్, కొత్త సంవత్సరం, సంక్రాంతి పండుగల సందర్భంగా 30 శాతం రాయితీ ఇస్తున్నారు.
⇒ ఇందిరాపార్క్ సమీపంలోని ఎనీ్టఆర్ స్టేడియంలో హైదరాబాద్ పుస్తక ప్రదర్శన సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.
⇒ మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో ఏర్పాటు చేసిన హైలైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.
⇒ మణికొండ పైప్‌లైన్ రోడ్డులోని సుందర్ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో ఆల్ ఇండియా హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాప్ట్ ఎగ్జిబిషన్ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.


