సాక్షి, సిటీబ్యూరో: వాస్తు.. ఇంటి ఎంపికలో కీలకం. వాస్తును విశ్వసించేవారు అన్నీ అనుకూలంగా ఉంటే తప్ప కొనేందుకైనా, అద్దెకుండేందుకైనా నిర్ణయానికి రారు. అయితే ఇంటికి వాస్తు బాగుంటేనే సరిపోదని, పరిసరాల ప్రభావం కూడా ఇంటిపై, అందులోని నివాసితులపై ప్రభావం చూపిస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
ఇంటి చుట్టుపక్కల, సమీపంలో శ్మశానం, ఆస్పత్రులు ఉంటే కొందరిలో మానసిక ఆందోళనలకు దారితీయవచ్చు. ఏదో రూపంలో ఏదో ఒక సమయంలో మనసుపై ప్రభావం చూపే వీలుంది. లేనిపోని భయాందోళనలకు గురవుతుంటారు. ఇది ఆరోగ్యంపై దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. అలాగే మురుగు కాల్వలు, భారీ శబ్ధాలు చేసే కాలుష్య కర్మాగారాలు వంటివి కూడా నివాసితులపై ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉంటుంది. అందుకే సాధ్యమైనంత వరకూ వీటికి దూరంగా ఉండటమే ఉత్తమమని చెబుతుంటారు.


