ఇరుకు ఇళ్లకు ఇదే కిటుకు..! | How to make a small house feel bigger | Sakshi
Sakshi News home page

ఇరుకు ఇళ్లకు ఇదే కిటుకు..!

Nov 2 2025 11:06 AM | Updated on Nov 2 2025 11:25 AM

How to make a small house feel bigger

ఇంట్లో స్థలాన్ని ఎలాగూ పెంచలేం. అలాగనీ అవసరాలకు తగ్గ ఫర్నిచర్‌ను సమకూర్చుకోకుండా ఉండలేం కదా? ఉన్నంతలో స్థలాన్ని సద్వినియోగం చేసుకోవడమే ఇందుకు పరిష్కారం. దాని కోసం కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు.. తలుపు తీయగానే పెద్దపెద్ద వస్తువులు కనిపిస్తే.. మీ ఇల్లు చిన్నదిగా కన్పిస్తుంది. లివింగ్‌ రూమ్‌ ప్రవేశ ద్వారం ముందు పెద్ద మొత్తంలో ఫర్నిచర్‌ ఉండకుండా చూసుకోవాలి.

  • లివింగ్‌ రూమ్‌కు ఉన్న ద్వారాల మధ్య తిరగడానికి ఎలాంటి అవాంతరాలు లేకుండా చూసుకోండి. అంటే.. మధ్యలో కుర్చీలు ఉంటే వాటి చుట్టూ తిరిగి వెళ్లడం లాంటివి అన్నమాట.

  • సోఫాలు, కుర్చీలన్నింటినీ ఒకే వరుసలో, గోడకు పక్కన ఏర్పాటు చేయకండి. సీట్లు ఒకదానికోటి ఎదురెదురుగా, కనీసం నాలుగు నుంచి పది అడుగుల దూరంతో ఉంటే బాగుంటుంది.  

  • బరువుగా ఉండే ఫర్నిచర్‌ మొత్తాన్ని గదిలో ఒకే వైపు పెట్టొద్దు. ఇలా చేస్తే సీటింగ్‌ ఏర్పాటులో సమతుల్యత దెబ్బతింటుంది.  

  • కాఫీ టేబుల్, సెంటర్‌ టేబుల్‌ వాడకం లివింగ్‌ రూమ్‌లో సాధారణమే. మ్యాగజైన్లు, వార్త పత్రికలు పెట్టుకునేందుకు వీలుగా వీటికోసం ప్రత్యేకంగా షెల్ఫ్‌ ఉండే టేబుళ్లను ఎంచుకోండి. లివింగ్‌రూమ్‌లో ఉపయోగించే టేబుళ్లు ఒకదాంట్లో మరోటి అమరిపోయే విధంగా ఉంటే మంచిది.  

  • గదిని పెద్దదిగా కన్పించేలా చేయడంలో అద్దాన్ని మించిన సాధనం మరోటి లేదు. వెనకవైపు పచ్చని మొక్కలున్న కిటికీకి ఎదురుగా అద్దం అమరిస్తే.. ఇంటి వెలుపుల ఉన్న ఆహ్లాదకరమైన వాతావరణాన్ని లోపలికి తీసుకువస్తున్న భావన కలుగుతుంది.  

  • టేబుల్‌ కింద ఖాళీ స్థలాన్ని అలా వదిలేయకుండా.. షెల్ఫ్‌ ఏర్పాటు 
    చేసుకుంటే, ఏవైనా పెట్టుకోవడానికి అక్కరకొస్తుంది. అవి బయటకు కన్పించకుండా పైన ఓ టేబుల్‌ క్లాత్‌ వేయండి.

  • గది చిన్నదిగా ఉంటే పార్టిషన్‌ జోలికి వెళ్లకండి. ఇలా చేస్తే మరింత చిన్నదిగా కన్పిస్తుంది.  

  • లివింగ్‌ రూమ్‌లో మడిచిపెట్టడానికి అనువుగా ఉండే కుర్చీలు, టేబుళ్లు, సోఫాకమ్‌ బెడ్, బీన్‌ బ్యాగ్‌లు వంటి ఫర్నిచర్‌ నప్పుతాయి.

ఇదీ చదవండి: ఇంటి విలువ పెరగాలంటే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement