న్యూఢిల్లీ: బిల్డర్ల (ఇళ్ల ప్రాజెక్టులు నిర్మించే వారు) ట్రాక్ రికార్డును (గత చరిత్ర) పరిశీలించిన తర్వాతే కొత్త ప్రాజెక్టులకు అనుమతులను మంజూరు చేసేందుకు వీలుగా ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తూ రెరా చట్టంలో సవరణలు తీసుకురావాలని గృహ కొనుగోలుదారుల సంఘం (ఎఫ్‌పీసీఈ) డిమాండ్ చేసింది.
ప్రాపర్టీ కొనుగోలుదారులు యూనిట్ కొనుగోలును రద్దు చేసుకుంటే తిరిగి చెల్లించేందుకు ఏకీకృత నిబంధనను తీసుకురావాలని కోరుతూ ఎఫ్‌పీసీఈ ప్రెసిడెంట్ అభయ్ ఉపాధ్యాయ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు లేఖ రాశారు. హామీ మేరకు సదుపాయాలు కలి్పంచడంలో బిల్డర్లు విఫలమైతే తగిన పరిష్కారం ఉండాలని కోరారు.
ఇదీ చదవండి: రాజీపడితేనే సొంతిల్లు.. లేదంటే సవాలే!


