టార్గెట్‌ తప్పలేదు.. ఇరాన్‌ ఇంటెలిజెన్స్‌ మంత్రి హతం | US Israel Iran War News Live Updates | Sakshi
Sakshi News home page

Live Updates

Cricker

టార్గెట్‌ తప్పలేదు.. ఇరాన్‌ ఇంటెలిజెన్స్‌ మంత్రి హతం

మిత్రదేశాలపై ట్రంప్‌ ఫైర్‌

  • హార్మూజ్ జలసంధిపై మిత్రదేశాలు స్పందించడం లేదన్న ట్రంప్‌
  • హార్మూజ్ జలసంధిని “సో కాల్డ్ స్ట్రైట్” అంటూ ఫైర్‌
  • ఆ మార్గంపై అసలు అమెరికా ఆధారపడదని వ్యాఖ్య
  • వేరే దేశాలే ఆధారపడతాయన్న డొనాల్డ్‌ ట్రంప్‌
2026-03-18 20:21:04

గల్ఫ్‌లో ఇరాన్‌ గ్యాస్‌ ఇండస్ట్రియల్‌ కాంప్లెక్స్‌పై దాడి

గల్ఫ్‌లో ఇరాన్‌కు గ్యాస్‌ ఇండస్ట్రియల్‌ కాంప్లెక్స్‌ 
అసాలుయెహ్‌లోని సౌత్ పార్స్ లో ఆ కాంప్లెక్స్‌
దానిపై దాడి చేసిన ఇజ్రాయెల్, అమెరికా
పెద్ద ఎత్తున మంటలు చెలరేగినట్లు చెప్పిన ఇరాన్ మీడియా

2026-03-18 18:16:34

ఇజ్మాయిల్‌ ఖాతిబ్‌ను హతమార్చినట్లు ఇజ్రాయెల్‌ ప్రకటన

ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్‌ భీకరదాడులు  
ఇరాన్‌ ఇంటెలిజెన్స్‌ మంత్రే టార్గెట్‌గా వైమానిక దాడులు
ఇరాన్‌ ఇంటెలిజెన్స్‌ మంత్రి ఇజ్మాయిల్‌ ఖాతిబ్‌ మృతి
ఇజ్మాయిల్‌ ఖాతిబ్‌ను హతమార్చినట్లు ఇజ్రాయెల్‌ ప్రకటన
 

2026-03-18 16:07:58

అగ్రశ్రేణి అధికారుల మృతిని నిర్ధారించిన ఇరాన్‌

  • అలీ లారిజానీ, ఘోలమ్‌రెజా సులేమానీ మృతి
  • ఇజ్రాయెల్‌ దాడుల్లో హతమైన అధికారులు
  • నిన్న ప్రకటన చేసిన ఇజ్రాయెల్‌
  • నిజమేనని చెప్పిన ఇరాన్‌
  • ఇద్దరు నేతలకు ఇరాన్‌ సంతాపం
  • అగ్రశ్రేణి అధికారుల మృతితో ఇరాన్‌కు పెద్ద దెబ్బ
2026-03-18 14:58:00

ఖేష్మ్‌పై ట్రంప్‌ కన్ను

  • ఇరాన్‌లోని భారీ దీవి ఖేష్మ్‌పై ట్రంప్‌ కన్ను
  • ఇరాన్‌ అండర్‌ మిసైల్‌గా మారిన ఖేష్మ్‌ 
  • క్లారెన్స్‌ జలసంధిని ఇక్కడి నుంచే నియంత్రణ
  • 1445 చదరుపు కీలోమీటర్లున్న ఖేష్మ్‌
  • ఖేష్మ్‌ జలసంధి అనేది ఇరాన్‌లోని పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉన్న ఒక ముఖ్యమైన జలసంధి. 
  • వాణిజ్యపరంగా, రక్షణపరంగా, సముద్ర ప్రవాహాల నియంత్రణలో కీలక పాత్ర 
  • పర్షియన్ గల్ఫ్‌లోని నౌకాశ్రయాలు, ముఖ్యంగా హర్మూజ్‌ జలసంధి సమీపంలో ఉండటం వల్ల అంతర్జాతీయ చమురు రవాణాలో కీలకం
  • ఇరాన్‌ సముద్ర రక్షణ వ్యవస్థలో వ్యూహాత్మక స్థానం 
  • హర్మూజ్‌ జలసంధిలో వ్యాణిజ్యం సజావుగా సాగేలా ఇరాన్‌పై దాడుల్ని ముమ్మరం చేసిన అమెరికా    
  • ఇరాన్‌ వ్యూహాత్మక రక్షణలో, వాణిజ్యంలో కీలకమైన ఖేష్మ్‌ జలసంధిపై చూపు 
  • ఖేష్మ్‌ను స్వాధీనం చేసుకుంటే అన్నీ రకాలుగా ఇబ్బంది పెట్టొచ్చని భావిస్తున్న ట్రంప్‌   
2026-03-18 13:58:20

ఇరాన్‌పై దాడులు.. రూటు మార్చిన ఇజ్రాయెల్‌-అమెరికా

  • ఇరాన్‌పై ఇజ్రాయెల్‌,అమెరికా కొనసాగుతున్న దాడులు
  • ఇరాన్‌పై యుద్ధంలో రూటు మార్చిన అమెరికా,ఇజ్రాయెల్‌  
  • ఇరాన్‌ అధ్యక్ష కార్యాలయం,క్షిపణి కేంద్రాలు,ఇరాన్‌ ముఖ్య నేతలే లక్ష్యంగా దాడులు
  • దాడులకు సిద్ధమైన అమెరికా,ఇజ్రాయెల్‌ 
  • బీ-2 బాంబర్లతో ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా 
2026-03-18 10:39:29

ఇరాన్ క్షిపణి స్థావరాలపై అమెరికా దాడి

  • హర్మూజ్‌ జలసంధిలో కార్యకలాపాలు కొనసాగేలా అమెరికా కీలక నిర్ణయం
  • హర్మూజ్‌ జలసంధి  సమీపంలోని ఇరాన్ క్షిపణి స్థావరాలపై అమెరికా అత్యంత శక్తివంతమైన బాంబులతో దాడి 
  • అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకారం.. ఇరాన్ తీర ప్రాంతంలోని క్షిపణి స్థావరాలపై  సుమారు 2,268 కిలోల పేలుడు బాంబులను ప్రయోగం
  • ఇరాన్‌ స్థావరాలపై దాడి చేసినట్లు అమెరికా ప్రకటన 

 

2026-03-18 10:37:03

  • అమెరికా-ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇరాన్‌ కీలక సైనికాధికారి లారిజానీ మృతి
  • లారిజానీ మృతిపై రగిలిపోతున్న ఇరాన్‌ 
  • ప్రతీకారంగా డ్రోన్‌లతో ఇజ్రాయెల్‌పై విరుచుకు పడ్డ ఇరాన్‌
2026-03-18 07:14:15

గల్ఫ్‌ దేశాలపై కొనసాగుతున్న క్షిపణులు, డ్రోన్ల వర్షం

  • పశ్చిమాసియా యుద్ధంలో 18వ రోజైన మంగళవారం ఇరాన్‌కు భారీ నష్టం జరిగింది.
  • అమెరికా-ఇజ్రాయెల్‌ దాడుల్లో కీలక సైనికాధికారి లారిజానీ, బసీజ్‌ బలగాల అధిపతి గులాం రెజా మృతి
  • ఇరాన్, లెబనాన్‌లపై భారీగా బాంబు దాడులు
  • గల్ఫ్‌ దేశాలపై కొనసాగిన క్షిపణులు, డ్రోన్ల వర్షం
2026-03-18 07:12:05

సెక్యూరిటీ చీఫ్‌ లారిజానీ మృతిపై ఇరాన్‌ ప్రకటన

  • ఇజ్రాయెల్‌ దాడిలో సెక్యూరిటీ చీఫ్‌ లారిజానీ మృతి చెందినట్లు ధృవీకరించిన ఇరాన్‌ 
  • లారిజానీ అమరుడంటూ ప్రకటన
     
2026-03-18 07:05:43

లారిజానీ మృతిపై నెతన్యాహు ప్రకటన

  • లారిజానీ మృతిపై ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు ప్రకటన
  • ఇరాన్‌ ప్రభుత్వాన్ని బలహీనపర్చి ప్రజలకు స్వేచ్ఛ ప్రసాదించడమే తమ లక్ష్యమని పునరుద్ఘాటన
  • ఇరాన్‌ ప్రజల భవిష్యత్తు వారి చేతుల్లో ఉండాలన్నది తమ ఉద్దేశమన్న నెతన్యహు
  • అలీ లారిజానీతోపాటు బసిజ్‌ చీఫ్‌ సులేమానీని హతమార్చామని ప్రకటన
  • వారిద్దరూ గ్యాంగ్‌స్టర్‌(అయతొల్లా అలీ ఖమేనీ) అసిస్టెంట్లు అంటూ మండిపాటు
2026-03-18 06:52:40

ఇరాన్‌పై పైచేయి సాధించిన అమెరికా-ఇజ్రాయెల్‌

  • ఇరాన్‌పై ఇజ్రాయెల్‌,అమెరికా యుద్ధం 
  • ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇరాన్‌కు భారీ ఎదురుదెబ్బ 
  • దివంగత సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీకి కుడిభుజం మృతి
  • సుప్రీం నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ కార్యదర్శి అలీ లారిజానీ 
  • ఇరాన్‌ ఇస్లామిక్‌ రెవల్యూషనరీ గార్డ్‌ కోర్‌(ఐఆర్‌జీసీ)కు చెందిన బసిజ్‌ పారామిలటరీ ఫోర్స్‌ కమాండర్‌ జనరల్‌ ఘోలమ్‌రెజా సులేమానీ మృతి
  • అధికారికంగా ప్రకటించిన ఇజ్రాయెల్‌ రక్షణ శాఖ మంత్రి కట్జ్‌ 
  • ఇరాన్‌ నాయకత్వం వెన్నుముక విరిచేశామని ప్రకటన 
  • అత్యున్నత సైనికాధికారులు నివాసం ఉండే కీలక స్థావరాలపై ఇజ్రాయెల్‌ క్షిపణలు, డ్రోన్ల దాడి
  • ఈ దాడుల్లో అలీ లారిజానీ, ఘోలమ్‌రెజా సులేమానీ సహా పలువురు మృతి
  • ఇంకా అధికారికంగా ప్రకటించని ఇరాన్‌ 
2026-03-18 06:48:32
Advertisement
 
Advertisement
Advertisement