మరోసారి తెరపైకి లాక్‌డౌన్‌ | Iran War Live Updates March 25th | Sakshi
Sakshi News home page

Live Updates

Cricker

మరోసారి తెరపైకి లాక్‌డౌన్‌

గల్ఫ్‌ దేశాలపై విరుచుకుపడుతున్న ఇరాన్‌

గల్ఫ్‌ దేశాలపై విరుచుకుపడుతున్న ఇరాన్‌ 
కువైట్‌ అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగా డ్రోన్‌ దాడి 
ఇంధన ట్యాంకర్‌ను ఢీకొట్టిన డ్రోన్‌ 
పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. 
ఇరాన్‌ నుంచి వచ్చిన పలు క్షిపణులు, డ్రోన్‌లను తమ రక్షణవ్యవస్థలు అడ్డుకున్నాయని పేర్కొన్న కువైట్‌ దళాలు 

2026-03-25 10:16:19

ఇరాన్ యుద్ధ ముగింపుకు ట్రంప్ 15 సూత్రాల ప్రణాళిక

  • పశ్చిమాసియాలో కొనసాగుతున్న అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కొత్త శాంతి ప్రణాళిక 
  • ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు, హర్మూజ్‌ జలసంధి భద్రత, చమురు సరఫరా, అణు ఆయుధాల నియంత్రణ, ఇజ్రాయెల్‌ భద్రత వంటి అంశాలను కలుపుతూ ఈ ప్రణాళిక 
  • చమురు సరఫరా భద్రత: హర్మూజ్‌ జలసంధి ద్వారా నిరంతర సరఫరా కొనసాగించేందుకు ఇరాన్‌ నుంచి హామీ.
  • అణు ఆయుధాల నియంత్రణ: ఇరాన్‌ అణు ప్రోగ్రామ్‌పై కఠినమైన పర్యవేక్షణ.
  • ఇజ్రాయెల్‌ భద్రత: పశ్చిమాసియాలో ఇజ్రాయెల్‌ రక్షణకు అమెరికా మద్దతు.
  • దౌత్య చర్చలు: అమెరికా–ఇరాన్ మధ్య ప్రత్యక్ష సంప్రదింపులు, తాత్కాలిక ఒప్పందాలు
2026-03-25 09:25:49

ఇరాన్‌పై యుద్ధంపై వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ సంచలన కథనం

  • ఇరాన్‌పై యుద్ధంపై వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ సంచలన కథనం 
  • టెహ్రాన్‌పై అగ్రరాజ్యం సాగిస్తోన్న యుద్ధంలో సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(UAE) పాల్గొనేందుకు సిద్ధమైనట్లు కథనం
  • తమ వైమానిక స్థావరాలను అమెరికా(US) సైన్యం ఉపయోగించుకొనేందుకు సౌదీ అరేబియా గ్రీన్‌ సిగ్నల్‌
2026-03-25 08:03:22

ఆగని బాంబుల మోత

  • ఆగని బాంబుల మోత
  • అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్‌ యుద్ధంలో దాడుల ఉద్ధృతి తీవ్రం
  • యుద్ధం ముగింపునకు చర్చలు జరుగుతున్నాయని ట్రంప్‌ చెబుతున్నా.. ఆగని బాంబుల మోత
  • బాంబుల వర్షం కురిపించిన అటు ఇజ్రాయెల్, ఇటు ఇరాన్‌ 
  • ఇరాన్, లెబనాన్‌లపై వైమానిక దాడులతో విరుచుకు పడ్డ ఇజ్రాయెల్‌ 
  • గల్ఫ్‌ దేశాలతోపాటు ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ క్షిపణులు, డ్రోన్ల ప్రయోగం
  • మరోవైపు పర్షియన్‌ గల్ఫ్‌ దిశగా వేల మంది తరలి వెళుతున్న అమెరికా సైనికులు  
     
2026-03-25 08:03:22

వదంతులు నమ్మొద్దు

  • పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం
  • ప్రస్తుత పరిస్థితులను కోవిడ్‌ మహమ్మారితో పోల్చిన ప్రధాని మోదీ
  • ఇంధన సరఫరా అంతరాయాన్ని ఎదుర్కోవడానికి కోవిడ్‌ మహమ్మారి వ్యాప్తి సమయంలో చూపినటువంటి సామూహిక సహనం, ఐక్యత, సంసిద్ధతను ప్రదర్శించాలని ప్రజలకు మోదీ విజ్ఞప్తి
  • పౌరులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వ నిర్ణయాలను నమ్మాలని ఉద్ఘాటన
  • ప్రధాని వ్యాఖ్యలు కొత్త లాక్‌డౌన్‌కు సంకేతమని సోషల్‌ మీడియాలో తప్పుగా ప్రచారం
  • నాటి దేశవ్యాప్త దిగ్బంధం, నిర్జన రోడ్లు, లక్షలాది మంది వలస కూలీలు కాలినడకన సొంతూళ్లకు పయనం కావడం, కార్యాలయాలు అకస్మాత్తుగా వర్క్‌ ఫ్రమ్‌ హోం విధానంలోకి మారడం వంటి ఆనాటి దుర్భర పరిస్థితులు పునరావృతం అవుతాయేమోనని నెటిజన్లు కంగారు
2026-03-25 07:44:39

మరోసారి తెరపైకి లాక్‌డౌన్‌

  • ట్రంప్‌ ఇరాన్‌పై యుద్ధాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటన 
  • అయినా వెనక్కి తగ్గని ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు 
  • దాడుల్ని తిప్పికొడుతున్న ఇరాన్‌ 
  • కొనసాగుతున్న యుద్ధంతో ప్రపంచంలోని పలు దేశాల్లో ఇంధన కొరత 
  • నాటి కోవిడ్‌-19 పరిస్థితుల్ని గుర్తు చేసుకుంటున్న ప్రపంచ దేశాల ప్రజలు
  • ఇంధన కొరతతో లాక్‌ డౌన్‌ ఉంటుందేమోనన్న చర్చ
2026-03-25 07:44:39

‘ఎలాంటి సవాలుకైనా సిద్ధంగా ఉండాలి’.. ప్రజలకు మోదీ పిలుపు

  • భారత్‌లో ఇరాన్‌పై యుద్ధ భయాలు
  • యుద్ధ భయాలను అధిగమించేలా ఏడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన కేంద్రం  
  • కోవిడ్‌–19 మహమ్మారి సమయంలో వేర్వేరు రంగాల్లో సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధమని ప్రకటించిన ప్రధాని  మోదీ
  • ప్రతి సవాలును మనం ఓర్పు, సంయమనం, ప్రశాంతమైన మనసుతో ఎదుర్కోవాలని పిలుపు
  • ఎలాంటి సవాలుకైనా సిద్ధంగా ఉండాలని ప్రజలకు మోదీ పిలుపు
     
2026-03-25 07:44:39

‘పూర్తి విజయం’సాధించే దాకా

  •  పశ్చిమాసియాలో యుద్ధానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఐదు రోజుల విరామం
  • వెనక్కి తగ్గని మిత్ర దేశం ఇజ్రాయెల్‌ 
  • ‘పూర్తి విజయం’సాధించే దాకా పోరాడుతూనే ఉంటామంటూ ఇరాన్‌ సైన్యం కుండబద్దలు 
  • యుద్ధానికి తెర దించే దిశగా ఇరాన్‌తో రెండు రోజులకు పైగా కీలక చర్చలు
     
2026-03-25 07:44:39
Advertisement
 
Advertisement
Advertisement