
న్యూఢిల్లీ: ఎల్రక్టానిక్స్, సెమీకండక్టర్ల విభాగాల్లో పరస్పరం సహకరించుకునే దిశగా జర్మన్ టెక్నాలజీ సంస్థ రాబర్ట్ బాష్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు దేశీ ఎల్రక్టానిక్స్ దిగ్గజం టాటా ఎల్రక్టానిక్స్ వెల్లడించింది. దీని ప్రకారం టాటా ఎల్రక్టానిక్స్ అస్సాంలో ఏర్పాటు చేసే అసెంబ్లీ .. టెస్ట్ యూనిట్లో, గుజరాత్‌లోని ఫౌండ్రీలో చిప్‌ల ప్యాకేజింగ్, తయారీ కార్యకలాపాలపై ఇరు సంస్థలు కలిసి పని చేస్తాయి.
అలాగే వాహనాల్లో వినియోగించే ఎల్రక్టానిక్స్ తయారీ సేవలను అందించే విధంగా స్థానిక ప్రాజెక్టులపై కూడా దృష్టి పెట్టనున్నాయి. దేశీయంగా సమగ్రమైన సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ వ్యవస్థను నెలకొల్పేందుకు తమ భాగస్వామ్యం దోహదపడుతుందని టాటా ఎలక్ట్రానిక్స్ సీఈవో రణ్‌ధీర్ ఠాకూర్ తెలిపారు. అధునాతన ఆటోమోటివ్ ఎల్రక్టానిక్స్‌కి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో సరఫరా వ్యవస్థను పటిష్టం చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని రాబర్ట్ బాష్ ఈవీపీ డిర్క్ క్రెస్ చెప్పారు.