
ఆర్థిక భద్రత ముఖ్యమే. పొదుపుగా ఉండాలి. ఇవన్ని ఆర్థిక సూత్రాలే. కానీ వాటితోపాటు కాసింత సంతోషానికి, ఎంజాయ్మెంట్కి కూడా చోటివ్వాలి. లేదంటే ఈ జీవితం క్షణ భంగురం. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియదు. ఊహకందని భవిష్యత్తు కోసం మరింత ఆరాటం, పొదుపు ఎంత అనర్థదాయకమో ఈ వ్యక్తిని చూస్తే తప్పక తెలుస్తుంది. ఉన్నంతలో సంతోషంగా ఉండటం వేరు. ఎప్పటికైనా అతి పొదుపు చివరికి వ్యథనే మిగులుస్తుంది అనేందుకు ఇతడే ఉదాహారణ.
జపాన్కి చెందిన సుజుకి అనే వ్యక్తి ఒక రెస్టారెంట్లో పనిచేస్తుండేవాడు. అతడు చిన్నతనం నుంచి కటిక పేదరికంలో పెరిగాడు. అందుకే పూర్తి సమయం ఉద్యోగానికే కేటాయించి, డబ్బులు ఆదా చేసేవాడు. చౌకగా లభించే అపార్టుమెంట్లో నివశించేవాడు. ఆఖరికి తన కాబోయే భార్యను కూడా తను పనిచేసే రెస్టారెంట్లోనే కలుసుకున్నాడు. అతడు చాలా పొదుపరి అని భార్యకు తెలుసు. వారికి ఒక కుమారుడు జన్మించాడు. అతడు పుట్టాక కాస్తా ఖర్చులకు వెనకడాకపోయినా..మిగతా అన్నింటి విషయంలో చాలా స్ట్రిక్ట్గా పొదుపుగా ఉండేవాడు.
జీవితంలో ఒక్కసారి కూడా రెస్టారెంట్ భోజనం చేయలేదు. ఏసీ కూడా ఉపయోగించకుండా లైఫ్ని గడిపేశాడు. కనీసం బైక్ లేదా కారు వంటివే ఉపయోగించ లేదు. ఉద్యోగానికి సైకిల్పైనే వెళ్లేవాడు. మాటల్లో చెప్పలేనంత పిసినారిలా బతికాడు. ఎలాగైతేనేం అతలా పొదుపుగా ఉండి ఏకంగా రూ. 4 కోట్లు దాక ధనం కూడబెట్టాడు. అయితే ఆ డబ్బుతో భార్యతో సంతోషంగా ఉందాం అనుకునేలోపు ఆకస్మికంగా చనిపోయింది. "ఇప్పుడు ఆలోచనలో పడ్డాడు. ప్రస్తుతం సుజుకి 65 ఏళ్లు. ఇన్నాళ్లు ఎంతలా కఠినంగా వ్యవహరించాను అని కుమిలిపోతున్నాడు.
చిన్న చిన్న ఆనందాలు, కానీ సరదాలకు కానీ తావివ్వకుండా ఓ మర మనిషిలా బతికానే అంటూ రోదిస్తున్నాడు. ఎంతలా వెక్కి వెక్కి ఏడ్చినా..కాలాన్ని వెనక్కి తిప్పలేం. ఆ రోజులు మళ్లీ రావు. ఇప్పుడు ఈ డబ్బుని తానేం చేసుకోవాలి అని కన్నేరుమున్నీరుగా విలపిస్తున్నాడు." హాయిగా కడుపు ఆరగించుకునే సమయంలో మొలకలు, చిన్న చికెన్ ముక్కలతో కాలక్షేపం చేశాడు. ఇప్పుడు హాయిగా తిందామన్నా..శరీరం, వయసు రెండు సహకరించడం లేదు. పోనీ షికారు చేద్దామన్నా..రెండడుగులు వేస్తే..ఆయాసం, పైగా అక్కడి వాతావరణం పడక నానా ఇక్కట్లు పడుతున్నాడు.
ఇతడిలాంటి వాళ్లెందరో జపాన్లో ఉన్నారట. గతంలో ఓ వ్యక్తి ఏకంగా పొదుపుకే జీవితాన్ని అంకితం చేసి రూ. 8 కోట్లు దాక కూడబెట్టి వార్తల్లో నిలిచాడట. ఈ ఘటనలు..డబ్బు సంపాదనే జీవితం కాదు. ధనం కూడబెట్టుకుంటే.నే.హాయిగా ఉంటాం అన్నది ఎన్నటికీ సరైనది కాదన్నది జగమెరిగిన సత్యం. ఖర్చు చేయాల్సిన చోట ఖర్చు పెట్టాలి, పొదుపుగా ఉండాల్సిన చోట ఖర్చుని అదుపులో ఉంచాలి. ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసేవాడే మహనీయడని చెబుతున్నారు ఆర్థిక నిపుణులు. ఆర్థిక భధ్రత తోపాటు, ఆర్థిక స్వేచ్ఛకు ప్రాముఖ్యత ఇవ్వండి. అంతా అయిపోయాక ఏం చేద్దామన్నా..ఏం చేయలేం అని హెచ్చరిస్తున్నారు.
(చదవండి: "మైక్ లేదు, వాయిద్యాలు లేవు" అద్భుతమైన గర్భా నృత్యం..! మాటల్లేవ్ అంతే..)