
ప్రస్తుతం విభిన్న సంస్కృతుల మేళవింపుగా ఆధునికతకు అద్ధం పట్టేలా దసరా వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఎక్కడ చూసిన డీజే మ్యూజిక్‌లు, అదిరిపోయ్ డ్రమ్స్ ధ్వనిలతో దద్ధిరిల్లిపోయేలా ధూం ధాంగా జరుపుతున్నారు. అలాంటిది అవేమి లేకుండా నాటి సంబరాన్ని గుర్తుకు చేసేలా అద్భుతంగా చేశారు. ఎంత లయబద్ధంగా ఉందంటే..ఇది గర్భా మ్యాజిక్ ఏమో అనొచ్చు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో మహిళలంతా సాంప్రదాయ గర్భా నృత్యం చేస్తూ అలరించారు. ఎలాంటి మైక్, మ్యూజిక్ సౌండ్స్ లేకపోయినా అద్భుతంగా ఉంది. కేవలంగా వారి చేతి చప్పట్లు, లయబద్ధంగా పాడుతున్న పాట..సహజత్వాన్ని ఉట్టిపడేలా సాగింది. చెప్పాలంటే సౌండ్ పొల్యూషన్‌కి తావివ్వని విధంగా ఆహ్లాదకంరగా నాటి మన సంప్రదాయ సంస్కృతిని గుర్తుచేసింది..ఈ గర్భా నృత్యం.
ఆ వీడియోలో మహిళలంతా "అంబే మా కీ జై" అంటూ వృత్తాకారంలో చేస్తున్న నృత్యం ఎక్కడ బీట్ మిస్‌కాకుండా అలల ప్రవాహంలా సాగిపోతోంది. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకర్షించింది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు వాణిజ్యంతో ముడిపడిలేని గర్భా నృత్యమని కొనియాడారు. అంతేగాదు గర్బాను 'తరం' సమస్యగా మార్చాల్సిన అవసరం లేదని ఆ మహిళలు తమదైన శైలిలో చెప్పారంటూ ప్రశంసల వర్షం కురిపించారు.
(చదవండి: కళ్లు బైర్లు కమ్మేలా బంగారం ధరలు.. అక్కడ మాత్రం 10 కేజీలతో డ్రెస్సు..!)