ఒకే మనిషిలో ఒకటికి మించి టాలెంట్లు ఉంటే అబ్బా అనేస్తాం. కానీ విభిన్న రంగాల్లో మనోడు సత్తా మాములుగా లేదు. ప్రతిదాంట్లోనూ తానే ముందున్నాడు. అతడి ఆహార్యం నుంచి కెరీర్ పరంగా టాలెంట్ వరకు..ఎవర్రా అది అని నోరెళ్లబెట్టేలా సత్తా చాటుతున్నాడు ఈ 84 ఏళ్ల హోండా కంపెనీ ఇంజనీర్.
వయసుపరంగా వృద్ధుడే అయినా..ఆహార్యం పరంగా యువకులకు ఏ మాత్రం తీసిపోని దేహదారుఢ్యం అతనిది. అతడి విలక్షణమైన టాలెంట్‌లు గురించి వింటే..మాటల్లేవ్ అంతే అని చెప్పొచ్చు. అతడే జపాన్‌కి చెందని షోటారో ఓడేట్ అనే 84 ఏళ్ల ఇంజనీర్. ఆధునాత భద్రతా సాంకేతికతకు సంబంధించిన డెవలపర్. అతడి హెయిర్ స్టైల్ కారణంగా వార్తల్లో నిలవడమే కాదు నెట్టింట వైరల్‌గా మారాడు.
విలక్షణమైన హెయిర్ స్టైల్..
జపనీస్ సినిమాల్లోని పాత్రల్లోని అనిమే-ప్రేరేపిత హెయిర్ స్టైల్‌లో అతడి జుట్టు ఉంటుంది. నిజానికి ఆ పాత్రల్లోని హెయిర్‌స్టైల్‌ని నిజజీవితంలో అనుకరించడం అతం ఈజీ కాదు. మెయింటైన్ చేయడం కూడా కష్టమే. కానీ ఇతడి హెయిర్‌మాత్రం అందుకు విరుద్ధం. అత్యంత సహజమైన అనిమే-ప్రేరేపిత హెయిర్ స్టైల్ మాదిరిగా ఉండటం విశేషం.
అయితే ఈ జపనీస్ ఆటోమోటివ్ ఇంజనీర్ మాత్రం తాను ఐదేళ్లుగా ఈ హెయిర్ స్టైల్‌ని నిర్వహిస్తున్నట్లు చెబుతున్నాడు. తన చిన్నతనం వరకు సాంప్రదాయ పద్ధతి హెయిర్ స్టైల్‌లోనే ఉన్నాడట. గత కొన్ని ఏళ్లుగా తన ఎడమ కన్నుపై పడుతున్న జుట్టుని స్లైలిష్‌గా మార్చేప్రయత్నంలో ఈ స్టైల్‌ని అనుసరించాడట. ఇక తన జుట్టు ఈ స్టైల్‌లో సులభంగా మారిపోవడానికి ప్రధాన కారణం సరైన నిద్ర అలవాట్లు లేకపోవడమేనట.
ఇక అతను 2003లో హోండాలో సీటు బెల్ట్‌లలో ప్రత్యేకత కలిగిన ఇంజనీర్‌గా బాధ్యతలు చేపట్టి..అందుకు సంబంధించిన సురక్షితమైన డ్రైవింగ్ టెక్నాలజీలో దాదాపు 253 పేటెంట్లను పొందారు. అలాగే ఇదే కంపెనీలో ఆయన హోండా సెన్సింగ్ 360+ ADAS వ్యవస్థ వెనుక ఉన్న లీడ్ ఇంజనీర్ విభాగానికి, డ్రైవర్ల కంటి కదలికలను పర్యవేక్షించే స్మార్ట్ కెమెరా టెక్నాలజీనిను అభివృద్ధి చేసే బృందానికి ఈయనే సారథ్యం వహించారు.
సేఫ్టీ టెక్నాలజీలు..
సింపుల్‌గాచెప్పాలంటే ఆయన పని ఎల్లప్పుడూ.. "జీవితాన్ని సురక్షితంగా ఉంచడమే" లక్ష్యంగా సాంకేతికతలను అభివృద్ధి చేయడమే. ఆయన కేవలం టెక్నీలజీ డెవలప్పర్‌గానే కాకుండా హోండాలో ప్రముఖ సభ్యుడిగా కొత్త కార్లను కూడా ప్రమోట్ చేస్తారు కూడా.
ఆఖరికి ఫిట్‌నెస్‌లో కూడా..
చివరిగా ఫిట్‌నెస్ పరంగా అతనికి వేలకొద్ది అభిమానులు ఉన్నారట. అంతేగాదు 170 కేజీల బెంచ్‌ప్రెస్ బల శిక్షణా వ్యాయామాన్ని వరుసగా ఐదుసార్లు ప్రదర్శించిన రికార్డు కూడా అతని పేరు మీద ఉందట. ఇలా కెరీర్, ఫ్యాషన్, హెల్త్ పరంగా ఇంతలా ప్రతిభను చాటుకోవడం అంత ఈజీ కాదు కదూ..!.
This is 84-year-old Shotaro Odate, Chief Engineer at @Honda recognized for his significant contributions to automotive safety technology, including the development of the Honda SENSING 360+ system. Odate holds over 250 patents and has published nine scientific papers on topics… pic.twitter.com/r3tXDCTJB8
— Evan Kirstel #B2B #TechFluencer (@EvanKirstel) September 22, 2025
(చదవండి: Success Story: ఒకప్పుడు సెక్యూరిటీ గార్డు..ఇవాళ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజనీర్‌గా..)


