
జపాన్‌పై 3–2తో నెగ్గిన హర్మన్‌ప్రీత్ బృందం
ఆసియా కప్ హాకీ టోర్నీ
రాజ్‌గిర్ (బిహార్): వరుసగా రెండో మ్యాచ్‌లోనూ భారత పురుషుల హాకీ జట్టుకు ప్రత్యర్థి నుంచి గట్టిపోటీ ఎదురైంది. భారీ విజయాలు సాధిస్తుందనుకున్న చోట భారత జట్టు మరోసారి గోల్ తేడాతోనే గట్టెక్కింది. ఆసియా కప్ టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన పూల్ ‘ఎ’ రెండో లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 3–2 గోల్స్ తేడాతో జపాన్ జట్టును ఓడించింది. వరుసగా రెండో విజయం నమోదు చేసుకున్న భారత జట్టు ‘సూపర్–4’ దశకు మరింత చేరువైంది.
చైనాతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 4–3తో గెలిచింది. జపాన్‌తో జరిగిన పోరులో భారత్ తరఫున మన్‌దీప్ సింగ్ (4వ నిమిషంలో) ఒక గోల్ చేయగా... కెపె్టన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (5వ నిమిషంలో, 46వ నిమిషంలో) రెండు గోల్స్ సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. జపాన్ జట్టుకు కొసె కవాబె (38వ, 59వ నిమిషంలో) రెండు గోల్స్ అందించాడు.
పూల్ ‘ఎ’లో భారత్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో నెగ్గి ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... చెరో మ్యాచ్‌లో గెలిచిన చైనా, జపాన్ మూడు పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి. నేడు జరిగే చివరిదైన మూడో లీగ్ మ్యాచ్‌లో కజకిస్తాన్‌తో భారత్ తలపడుతుంది. అంతకుముందు జరిగిన మరో మ్యాచ్‌లో చైనా 13–1 గోల్స్ తేడాతో కజకిస్తాన్‌పై ఘనవిజయం సాధించింది.