
టోక్యో: ప్రధాని నరేంద్ర మోదీ తన రెండు రోజుల పర్యటనలో భాగంగా జపాన్‌లోని టోక్యోకు చేరుకున్నారు. ఆయన 15వ ఇండియా-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. టోక్యోలో ప్రధాని మోదీని గాయత్రి మంత్ర జపంతో స్వాగతించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దానిలో జపాన్ కళాకారులతో పాటు ప్రధాని మోదీ కూడా గాయత్రి మంత్రాన్ని పఠించడం కనిపిస్తుంది.
జపాన్ ప్రధాని షిగేరు ఇషిబా ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ జపాన్ పర్యటన చేపట్టారు. ప్రధాని మోదీ 15వ ఇండియా-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. పలువురు వ్యాపారవేత్తలతో సంభాషించనున్నారు. ‘టోక్యోలో అడుగుపెట్టాను. భారత్- జపాన్ తమ అభివృద్ధి సహకారాన్ని బలోపేతం చేసుకుంటున్నాయి. ఈ పర్యటనలో ప్రధాని ఇషిబా, ఇతర అధికారులతో సంభాషించాలనుకుంటున్నాను. ఇది సహకారానికి కొత్త మార్గాలను అన్వేషించడానికి ఉపయోగపడుతుందని ప్రధాని మోదీ ‘ఎక్స్’ పోస్టులో పేర్కొన్నారు.
VIDEO | Members of the Japanese community welcomed Prime Minister Narendra Modi in Tokyo by reciting the Gayatri Mantra and other chants as he arrived in Japan.
PM Modi is on a two-day visit to Japan at the invitation of Japanese Prime Minister Shigeru Ishiba to attend the 15th… pic.twitter.com/95m0ktLB9U— Press Trust of India (@PTI_News) August 29, 2025
టోక్యోలో ఆత్మీయ స్వాగతం అందించిన జపాన్‌లోని భారతీయ సమాజాన్ని మోదీ ప్రశంసించారు.‘టోక్యోలోని భారతీయ సమాజం అందించిన ఆప్యాయత నన్ను బాగా ఆకట్టుకుంది. మన సాంస్కృతిక మూలాలను కాపాడుకుంటూనే ఇక్కడి భారతీయులు మెలగడం నిజంగా ప్రశంసనీయం. జపాన్ పర్యటన పూర్తయ్యాక ప్రధాని మోదీ చైనాను సందర్శించనున్నారు. అక్కడ జరిగే షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు.