ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీ ప్రస్తుతం జపాన్ ట్రిప్‌లో ఉన్నారు. ఇటీవల పుష్ప-2 మూవీని జపాన్‌లోనూ రిలీజ్ చేశారు. అంతకుముందు మూవీ ప్రమోషన్స్‌తో పాల్గొన్న బన్నీ.. ఇప్పుడు కుటుంబంతో కలిసి చిల్ అవుతున్నారు. తాజాగా టోక్యోలోని ప్రముఖ సెన్‌సోజి ఆలయాన్ని తన ఫ్యామిలీతో కలిసి సందర్శించారు. దీనికి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇది కాస్తా వైరల్ కావడంతో అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే బన్నీ ప్రస్తుతం జవాన్ డైరెక్టర్ అట్లీతో జతకట్టారు. వీరిద్దరి తొలిసారి వస్తోన్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో దీపికా పదుకోన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ ఇటీవలే ముంబైలో షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.
ఇటీవలే బన్నీకి సంబంధించిన మరో బిగ్ అప్‌డేట్ వచ్చేసింది. అల్లు అర్జున్ తన నెక్స్ట్ మూవీ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్‌తో చేయనున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్, బన్నీ వాసు వర్క్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.


