జపాన్‌ రాజకీయాల్లో ట్విస్ట్‌.. ప్రధాని ఇషిబా రాజీనామా! | Japanese PM Shigeru Ishiba To Quit His Post After Election Debacle, Check Post Inside | Sakshi
Sakshi News home page

జపాన్‌ రాజకీయాల్లో ట్విస్ట్‌.. ప్రధాని ఇషిబా రాజీనామా!

Sep 7 2025 1:23 PM | Updated on Sep 7 2025 1:58 PM

Japanese PM Shigeru Ishiba to quit His Post

టోక్యో: జపాన్‌లో రాజకీయ సంక్షోభం ఎదురు కానుంది. జపాన్‌ ప్రధాని పదవికి షిగేరు ఇషిబా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే, పార్టీలో అంతర్గత విభేదాలకు స్వస్తి పలకాలనే ఉద్దేశ్యంతోనే ఆయన నిర్ణయం తీసుకున్నారని స్థానిక మీడియా పలు కథనాల్లో వెల్లడించారు. దీంతో, ఈ విషయంలో రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.

వివరాల ప్రకారం.. జపాన్‌ ప్రధాని పదవికి షిగేరు ఇషిబా రాజీనామా చేయాలని సంచలన నిర్ణయం నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని జపాన్‌ ప్రభుత్వ రంగ టీవీ ఎన్‌హెచ్‌కే వెల్లడించింది. కాగా, జూలైలో జరిగిన ఎన్నికల్లో అధికారిక లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీ కూటమి పార్లమెంట్‌ ఎగువ సభలో మెజార్టీని కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో తన పార్టీ ఘోర ఓటమికి బాధ్యత వహించాలని డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.

దీంతో పార్టీలో అంతర్గత విభేదాలకు స్వస్తి పలకాలనే కారణంగానే ఆయన ఇందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇషిబా ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు విలేకరుల సమావేశం నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇదిలా ఉండగా.. షిగేరు ఇషిబా తన 29 ఏళ్ల వయసులో 1986లో తొలిసారిగా పార్లమెంట్‌లో అడుగుపెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement