జపాన్‌: చంద్రుడి ప్రయోగం విఫలం | Japan Ispace Resilience Lander Crashed On The Moon Here Complete Details, Check Out Full Story Inside | Sakshi
Sakshi News home page

జపాన్‌: చంద్రుడి ప్రయోగం విఫలం

Jun 6 2025 9:11 AM | Updated on Jun 6 2025 9:41 AM

Japan ispace Resilience lander crashed on the Moon Here Complete Details

జపాన్‌కు చెందిన ప్రైవేట్‌ స్పేస్‌ కంపెనీ ఐస్పేస్‌(ispace) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రుడి ప్రయోగం విఫలమైంది. హకుటో-ఆర్ మిషన్ 2 పేరుతో మూన్(లునార్‌) ల్యాండర్‌ను ప్రయోగించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ ల్యాండర్ క్రాష్ ల్యాండింగ్ అయ్యింది. ఈ విషయాన్ని ఐస్పేస్‌ అధికారికంగా ప్రకటించింది. చంద్రుడి ఉపరితలానికి మరో 5 కిలోమీటర్ల దూరం ఉండగానే ఈ ప్రయోగం విఫలం కావడం గమనార్హం.  

ఈ మిషన్‌లో రిసైలెన్స్(Resilience) అనే ల్యాండర్ చంద్రుడిపై సీ ఆఫ్ కోల్డ్ (మేర్ ఫ్రిగోస్) ప్రాంతంలో శుక్రవారం ఉదయం ల్యాండ్ కావాల్సి ఉంది. కానీ చివరి 10 నిమిషాల్లో గ్రౌండ్ స్టేషన్‌తో సంబంధాలు తెగిపోయాయి. ఐస్పేస్‌ సంస్థ విఫలమైన కారణాలను విశ్లేషిస్తోంది. కాగా చంద్రుడిపై ప్రయోగాలు చేసే మొదటి ప్రైవేట్ కంపెనీగా ఐస్పేస్‌ చరిత్ర సృష్టించాలనుకుంది.

రీసైలెన్స్‌ను ఈ ఏడాది జనవరిలో స్పేస్‌ఎక్స్‌ ఫాల్కన్‌ 9 రాకెట్‌ ద్వారా ప్రయోగించారు. ఐదు నెలల ప్రయాణం తర్వాత చంద్రుడి కక్ష్యలోకి ఈ ల్యాండర్‌ ప్రవేశించింది. ఈ ప్రయోగంతో చారిత్రక విజయం సాధిమని స్పేస్‌ఎక్స్‌ గంపెడాశలు పెట్టుకుంది. సాఫ్ట్‌ ల్యాండింగ్‌ కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో.. ప్రయోగం విఫలమై క్రాష్‌ ల్యాండ్‌ అయ్యింది. 

ఇదిలా ఉంటే.. ఈ ఫెయిల్యూర్‌ ఐస్పేస్‌కు కొత్త కాదు. 2023లోనూ చంద్రుడి ప్రయోగం విఫలమైంది. ఆ ప్రయోగంలోని లోటుపాట్లను సరి చేసుకున్నప్పటికీ మరోసారి ఎదురుదెబ్బ తప్పలేదు.

Advertisement
 
Advertisement
Advertisement