చంద్రుడిపై కుప్పకూలిన లాండర్‌ | Japanese Firm Declared Lunar Mission A Failure After Crash Landing, More Details Inside | Sakshi
Sakshi News home page

చంద్రుడిపై కుప్పకూలిన లాండర్‌

Jun 7 2025 6:35 AM | Updated on Jun 7 2025 8:49 AM

Japanese firm declares lunar mission a failure after crash landing

విఫలమైన జపాన్‌ ప్రైవేట్‌ సంస్థ ప్రయోగం

టోక్యో: జపాన్‌కు చెందిన ప్రైవేట్‌ సంస్థ చంద్రుడిపైకి చేపట్టిన ప్రయోగం విఫలమైంది. ఐస్పేస్‌ సంస్థ పంపిన లూనార్‌ ల్యాండర్‌ కుప్పకూలింది. మరో రెండు నిమిషాల్లో చంద్రుడిపైన మినీ రోవర్‌ ల్యాండవుతుందనగా మిషన్‌తో సంబంధాలు తెగిపోయాయని ఐస్పేస్‌ సీఈవో టకేషి హకామడ తెలిపారు. రెండేళ్ల క్రితం ఐస్పేస్‌ చేపట్టిన మొట్ట మొదటి ప్రయోగం విఫలమైంది. దీంతో, ఈసారి ‘రిసైలెన్స్‌’ పేరుతో పక్కాగా ఈ ప్రయోగం చేపట్టినట్లు అంతకుముందు టకేషి చెప్పారు. 

ఈ ప్రయోగానికి సుమారు రూ.815 కోట్లు ఖర్చయిందని ఐస్పేస్‌ సీఈవో టకేషి చెప్పారు. అయితే, 2027లో నాసాతో కలిసి భారీ ల్యాండర్‌ను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. చంద్రుని ఉపరితలంపై ఉంచడానికి స్వీడన్‌ కళాకారుడు తయారు చేసిన బొమ్మ పరిమాణంలోని ఎర్రటి ఇంటిని, చంద్రుని మట్టిని సేకరించడానికి పారతో కూడిన రోవర్‌ రిసైలెన్స్‌లో ఉన్నాయి. రిసైలెన్స్‌లో ఉన్న లేజర్‌ వ్యవస్థ నిర్దేశించిన ప్రకారం ఎత్తును సరిగ్గా అంచనా వేయలేకపోవడంతో ల్యాండర్‌ అత్యంత వేగంగా చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టి, ధ్వంసమైనట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చామని ఐస్పేస్‌ ఒక ప్రకటనలో తెలిపింది.  

Advertisement
 
Advertisement
Advertisement