breaking news
Lunar lander
-
చంద్రుడిపై కుప్పకూలిన లాండర్
టోక్యో: జపాన్‌కు చెందిన ప్రైవేట్ సంస్థ చంద్రుడిపైకి చేపట్టిన ప్రయోగం విఫలమైంది. ఐస్పేస్ సంస్థ పంపిన లూనార్ ల్యాండర్ కుప్పకూలింది. మరో రెండు నిమిషాల్లో చంద్రుడిపైన మినీ రోవర్ ల్యాండవుతుందనగా మిషన్‌తో సంబంధాలు తెగిపోయాయని ఐస్పేస్ సీఈవో టకేషి హకామడ తెలిపారు. రెండేళ్ల క్రితం ఐస్పేస్ చేపట్టిన మొట్ట మొదటి ప్రయోగం విఫలమైంది. దీంతో, ఈసారి ‘రిసైలెన్స్’ పేరుతో పక్కాగా ఈ ప్రయోగం చేపట్టినట్లు అంతకుముందు టకేషి చెప్పారు. ఈ ప్రయోగానికి సుమారు రూ.815 కోట్లు ఖర్చయిందని ఐస్పేస్ సీఈవో టకేషి చెప్పారు. అయితే, 2027లో నాసాతో కలిసి భారీ ల్యాండర్‌ను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. చంద్రుని ఉపరితలంపై ఉంచడానికి స్వీడన్ కళాకారుడు తయారు చేసిన బొమ్మ పరిమాణంలోని ఎర్రటి ఇంటిని, చంద్రుని మట్టిని సేకరించడానికి పారతో కూడిన రోవర్ రిసైలెన్స్లో ఉన్నాయి. రిసైలెన్స్లో ఉన్న లేజర్ వ్యవస్థ నిర్దేశించిన ప్రకారం ఎత్తును సరిగ్గా అంచనా వేయలేకపోవడంతో ల్యాండర్ అత్యంత వేగంగా చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టి, ధ్వంసమైనట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చామని ఐస్పేస్ ఒక ప్రకటనలో తెలిపింది. -
జపాన్: చంద్రుడి ప్రయోగం విఫలం
జపాన్‌కు చెందిన ప్రైవేట్ స్పేస్ కంపెనీ ఐస్పేస్(ispace) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రుడి ప్రయోగం విఫలమైంది. హకుటో-ఆర్ మిషన్ 2 పేరుతో మూన్(లునార్) ల్యాండర్‌ను ప్రయోగించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ ల్యాండర్ క్రాష్ ల్యాండింగ్ అయ్యింది. ఈ విషయాన్ని ఐస్పేస్ అధికారికంగా ప్రకటించింది. చంద్రుడి ఉపరితలానికి మరో 5 కిలోమీటర్ల దూరం ఉండగానే ఈ ప్రయోగం విఫలం కావడం గమనార్హం. ఈ మిషన్‌లో రిసైలెన్స్(Resilience) అనే ల్యాండర్ చంద్రుడిపై సీ ఆఫ్ కోల్డ్ (మేర్ ఫ్రిగోస్) ప్రాంతంలో శుక్రవారం ఉదయం ల్యాండ్ కావాల్సి ఉంది. కానీ చివరి 10 నిమిషాల్లో గ్రౌండ్ స్టేషన్‌తో సంబంధాలు తెగిపోయాయి. ఐస్పేస్ సంస్థ విఫలమైన కారణాలను విశ్లేషిస్తోంది. కాగా చంద్రుడిపై ప్రయోగాలు చేసే మొదటి ప్రైవేట్ కంపెనీగా ఐస్పేస్ చరిత్ర సృష్టించాలనుకుంది.As of 8:00 a.m. on June 6, 2025, mission controllers have determined that it is unlikely that communication with the lander will be restored and therefore completing Success 9 is not achievable. It has been decided to conclude the mission.“Given that there is currently no… pic.twitter.com/IoRUfggoiQ— ispace (@ispace_inc) June 6, 2025రీసైలెన్స్ను ఈ ఏడాది జనవరిలో స్పేస్ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ప్రయోగించారు. ఐదు నెలల ప్రయాణం తర్వాత చంద్రుడి కక్ష్యలోకి ఈ ల్యాండర్ ప్రవేశించింది. ఈ ప్రయోగంతో చారిత్రక విజయం సాధిమని స్పేస్ఎక్స్ గంపెడాశలు పెట్టుకుంది. సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో.. ప్రయోగం విఫలమై క్రాష్ ల్యాండ్ అయ్యింది. ఇదిలా ఉంటే.. ఈ ఫెయిల్యూర్ ఐస్పేస్‌కు కొత్త కాదు. 2023లోనూ చంద్రుడి ప్రయోగం విఫలమైంది. ఆ ప్రయోగంలోని లోటుపాట్లను సరి చేసుకున్నప్పటికీ మరోసారి ఎదురుదెబ్బ తప్పలేదు. -
చందమామపై బ్లూ ఘోస్ట్
కేవ్ కెనావెరల్ (యూఎస్): చంద్రుడిపై మొట్టమొదటిసారిగా ఒక ప్రైవేట్ సంస్థకు చెందిన ల్యాండర్ సురక్షితంగా దిగి చరిత్ర సృష్టించింది. ఆదివారం అమెరికాలోని ఫైర్‌ఫ్లై ఏరోస్పేస్ సంస్థకు చెందిన బ్లూ ఘోస్ట్ ల్యాండర్ ఆటోపైలట్ విధానంలో నెమ్మదిగా చందమామపై దిగింది. చంద్రుని ఈశాన్య కొనవైపు పురాతన అగ్నిపర్వత సానువుల్లో ఇది దిగిందని ఫైర్‌ఫ్లై ఏరోస్పేస్ చీఫ్ ఇంజనీర్ విల్ కోగన్ ప్రకటించారు. ‘‘దశాబ్దకాలం క్రితం పురుడుపోసుకున్న మా అంకుర సంస్థ చరిత్ర సృష్టించింది. బ్లూ ఘోస్ట్ ల్యాండింగ్ పలు గండాలను తప్పించుకుంది. ఇప్పుడు చంద్రుని ఉపరితలంపై స్థిరంగా ఉంది’’ అని పేర్కొన్నారు. గతంలో పలు దేశాలకు చెందిన ప్రైవేట్ సంస్థలు చంద్రునిపై ల్యాండర్లను దింపేందుకు ప్రయతి్నంచి విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో అదుపు తప్పడం, క్రాష్ ల్యాండింగ్, కూలిపోవడం, ఒరిగిపోవడం వంటి అపశ్రుతులకు తావులేకుండా ఒక ప్రైవేట్ సంస్థ తొలి ప్రయత్నంలోనే విజయవంతంగా చంద్రునిపై ల్యాండర్‌ను దించడం ఇదే తొలిసారి. దేశాల్లో అమెరికా, రష్యా, చైనా, భారత్, జపాన్ మాత్రమే ఇప్పటిదాకా ఈ ఘనత సాధించాయి. బ్లూఘోస్ట్ ల్యాండయిన అరగంటకే చంద్రుని పరిసరాల ఫొటోలు తీసి అమెరికాలో ఆస్టిన్ నగరంలోని సంస్థ మిషన్ కంట్రోల్ కేంద్రానికి పంపింది. అమెరికాలో అరుదైన పేడపురుగు జాతి అయిన బ్లూ ఘోస్ట్ పేరును ఈ ల్యాండర్‌కు పెట్టారు. నాలుగు కాళ్ల ఈ ల్యాండర్ ఎత్తు 2 మీటర్లు. వెడల్పు 3.5 మీటర్లు. జనవరి 15న ఫ్లోరిడాలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి దీన్ని ప్రయోగించారు. ఇది చంద్రునిపై ధూళిని పరీక్షించనుంది. 10 అడుగుల లోతు రంధ్రం చేసి అక్కడి మట్టిని పరిశీలించనుంది. నాసా వ్యోమగాముల స్పేస్సూట్పై పేరుకుపోయే చంద్రధూళిని దులిపేసే పరికరం పనితీరును కూడా అక్కడ పరీక్షించనుంది. గురువారం మరో ల్యాండర్ హూస్టన్‌కు చెందిన ఇంట్యూటివ్ మెషీన్స్ సంస్థకు చెందిన నాలుగు మీటర్ల ఎత్తయిన ల్యాండర్‌ను గురువారం చంద్రునిపై దింపేందుకు కూడా శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. దక్షిణ ధ్రువానికి 100 మైళ్ల దూరంలో కిందివైపు దాన్ని ల్యాండ్ చేయాలని చూస్తున్నారు. గతేడాది ఇదే ప్రాంతంలో ఒక ల్యాండర్‌ను విజయవంతంగా దించినా దాని కాలు విరిగి పక్కకు ఒరిగి నిరుపయోగంగా మారింది. రెండేళ్ల క్రితం ఈ సంస్థ ఒక ల్యాండర్‌ను ప్రయోగించినా అది వేగంగా ఢీకొని చంద్రునిపై కూలిపోయింది. జపాన్‌కు చెందిన ఐస్పేస్ సంస్థ ల్యాండర్ కూడా త్వరలో చంద్రునిపై కాలుమోపనుంది. దీన్ని కూడా బ్లూఘోస్ట్తో పాటే ప్రయోగించారు. -
చంద్రునిపైకి ‘ఘోస్ట్’ ప్రయోగం
హాథ్రోన్: అంతరిక్ష ప్రయోగాలకు ఈ మధ్యకాస్త గ్యాప్ వచ్చింది. అయితే 2025 ఆరంభంలోనే ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ఎక్స్(SpaceX) తన ప్రయోగాలను మొదలుపెట్టింది. చంద్రుడిపై అన్వేషణలో భాగంగా.. ఒకే రాకెట్‌తో ఏకంగా రెండు ల్యాండర్లను విజయవంతంగా ప్రయోగించింది. తద్వారా ఒకేసారి రెండు మిషన్లను ప్రారంభించినట్లైంది!. భారత కాలమానం ప్రకారం.. బుధవారం ఉదయం ఈ ప్రయోగం జరిగింది. ఫ్లోరిడాలోని నాసా(NASA) కెనెడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్-9 రాకెట్ బ్లూ ఘోస్ట్-1, ఐస్పేస్‌కు చెందిన హకుటో-ఆర్2లను ల్యాండర్లను మోసుకెళ్లింది. చంద్రుడిపై పరిశోధనలకుగానూ స్పేస్ఎక్స్ వీటిని ప్రయోగించింది. ఈ రెండు వేర్వేరు దేశాలకు మాత్రమే కాదు.. వేర్వేరు టెక్నాలజీలకు చెందినవి కూడా. ఆయా నిర్ణీత రోజుల్లో అవి చంద్రుడి మీదకు దిగనున్నాయి. ఇంతకీ ఇవి స్విచ్ఛాఫ్ అయ్యేలోపు ఎలాంటి పనులు చేస్తాయంటే.. Today’s mission is our third launch to a lunar surface and just the first of several our Falcon fleet will launch for @NASA’s Commercial Lunar Payload Services (CLPS) program this year. These missions help humanity explore the Moon, Mars, and beyond, bringing us one step closer… pic.twitter.com/Go2yUccFb3— SpaceX (@SpaceX) January 15, 2025ఘోస్ట్ ఏం చేస్తుందంటే.. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, కమర్షియల్ లూనార్ ప్లేలోడ్ సర్వీసెస్(CLPS)లో భాగంగా బ్లూ ఘోస్ట్-1ను రూపొందించారు. చంద్రుడిపై ఉన్న అతిపెద్ద పరివాహక ప్రాంతం మేర్ క్రిసియంలో ఇది దిగి.. పరిశోధనలు చేయనుంది. ఈ ల్యాండర్ చంద్రుడి మీదకు చేరుకోవడానికి 45 రోజలు టైం పడుతుంది. ఇది చంద్రుడిపై స్వతంత్రంగానే ల్యాండ్ అయ్యి.. రెండువారాలపాటు సైంటిఫిక్ ఆపరేషన్స్ నిర్వహిస్తుంది. అక్కడి పరిస్థితులను ఫొటోలు తీస్తుంది. అలాగే.. పది అడుగుల లోతులో ఉష్ణోగ్రతలను పరిశీలిస్తుంది. అలాగే రెగోలిథ్(అక్కడి భూపొర)ను సేకరిస్తుంది. భూమికి చందద్రుడికి మధ్య లేజర్ కిరణాల సాయంతో దూరాన్ని కొలుస్తుంది. ఈ పనులన్నీ చేయడానికి పది సైంటిఫిక్ పరికరాలను మోసుకెళ్లింది. ఇది చంద్రుడిపై నిర్వహిస్తున్న అత్యాధునిక పరిశోధనగా నాసా చెబుతోంది. హకుటో చేసే పని ఇదే.. జపాన్‌కు చెందిన ఐస్పేస్ కంపెనీ హకుటో ఆర్2 అనే రీసైలెన్స్ ల్యాండర్‌ను రూపొందించింది. ఇది చంద్రుడి ఉత్తర గోళార్థంలోని మేర్ ఫ్రిగోరిస్లో అడుగుపెట్టనుంది. ఇందుకోసం ఈ ల్యాండర్‌కు 4 నుంచి ఐదు నెలల సమయం పడుతుంది. కింది ఏడాది ఏప్రిల్‌లో ఐస్పేస్ ఇదే తరహా ప్రయోగాన్ని నిర్వహించినప్పటికీ.. సెన్సార్లు పనిచేయకపోవడంతో ల్యాండర్ క్రాష్ ల్యాండ్ అయ్యింది. టెనాషియస్ అనే మైక్రోరోవర్ను హకుటో-ఆర్2 చంద్రుడి ఉపరితలం మీదకు ప్రయోగిస్తుంది. అది అక్కడి రెగోలిత్‌ను సేకరిస్తుంది. చంద్రుడి మీద పరిశోధనలకు అంతరిక్ష పరిశోధన సంస్థలే కాదు.. ప్రైవేట్ కంపెనీలు కూడా ఆసక్తిని కనబరుస్తున్నాయి. ఈ క్రమంలో చంద్రుడిపై మానవాన్వేషణలో మున్ముందు మరింత అత్యాధునిక ప్రయోగాలు జరిగే అవకాశం లేకపోలేదు.