
నిజంగానే.. ఆ న్యూస్ రిపోర్టర్‌కు వెన్నులో వణుకు పుట్టించిన ఘటనే ఇది. ఓ బాలిక మిస్సింగ్ కేసులో లైవ్ రిపోర్టింగ్ చేస్తుండగా భయానక అనుభవం ఎదురైంది అతనికి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింటకు చేరింది.
బ్రెజిల్‌లోని బాకబాల్ రీజియన్ మారాన్యో ప్రాంతంలో రయిస్సా అనే 13 ఏళ్ల బాలిక జూన్ 30వ తేదీన అదృశ్యమైంది. మియరిమ్ నదిలో స్నేహితులతో ఈతకు వెళ్లి కొట్టుకుపోయింది. గత ఈతగాళ్లు ఎంత గాలించిన ఫలితం లేకుండా పోయింది. అయితే పోలీసులు మాత్రం మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని ఆమె ఆచూకీ కోసం గాలిస్తూనే ఉన్నారు. ఈలోపు..
టీవీ రిపోర్టర్ లెనిల్డో ఫ్రాజావో నీళ్లలోకి దిగి బాలిక మిస్సింగ్ కేసు వార్తకు సంబంధించి రిపోర్టింగ్ చేస్తూ కనిపించాడు. ఇంతలో అతని కాళ్లకు ఏదో తాకింది. తీరా చూస్తే అది ఆ బాలిక మృతదేహం!!. దీంతో ఒక్కసారిగా వణికిపోయిన అతను.. ఇక్కడేదో తాకుతుందంటూ తన టీంనుఅప్రమత్తం చేసే ప్రయత్నం చేశాడు. మళ్లీ లోపలకు వెళ్లను.. అక్కడేదో తాకుతోంది. బహుశా చెయ్యి అనుకుంటా అంటూ వణికిపోతున్న గొంతుతో చెప్పాడు.
వెంటనే ఆ బృందం పోలీసులకు సమాచారం అందించింది. వాళ్లు ఆ బాలిక మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్‌మార్టంకు తరలించారు. నీట మునిగే ఆమె చనిపోయిందని.. బహుశా ఆ మృతదేహం నది అడుగుభాగంలోని మట్టిలో ఇంతకాలం కూరుకుపోయి ఉంటుందని వైద్యులు తెలిపారు. ఆ రిపోర్టర్‌కు భయానక అనుభవం మిగిల్చిన వీడియో కిందే ఉంది! చూసేయండి..
A Brazilian TV reporter may have stumbled onto the body of a missing 13-year-old girl during a live segment from the very river she vanished in
Lenildo Frazão was waist-deep in the Mearim River, demonstrating the water’s depth on camera in Bacabal, Maranhão — the last place the… pic.twitter.com/0i3y13fsZ9— Re:Flex (@re_flex_world) July 21, 2025