breaking news
Live Reporting
-
నదిలో లైవ్ రిపోర్టింగ్.. వెన్నులో వణుకుపుట్టించే వీడియో
నిజంగానే.. ఆ న్యూస్ రిపోర్టర్‌కు వెన్నులో వణుకు పుట్టించిన ఘటనే ఇది. ఓ బాలిక మిస్సింగ్ కేసులో లైవ్ రిపోర్టింగ్ చేస్తుండగా భయానక అనుభవం ఎదురైంది అతనికి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింటకు చేరింది. బ్రెజిల్‌లోని బాకబాల్ రీజియన్ మారాన్యో ప్రాంతంలో రయిస్సా అనే 13 ఏళ్ల బాలిక జూన్ 30వ తేదీన అదృశ్యమైంది. మియరిమ్ నదిలో స్నేహితులతో ఈతకు వెళ్లి కొట్టుకుపోయింది. గత ఈతగాళ్లు ఎంత గాలించిన ఫలితం లేకుండా పోయింది. అయితే పోలీసులు మాత్రం మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని ఆమె ఆచూకీ కోసం గాలిస్తూనే ఉన్నారు. ఈలోపు.. టీవీ రిపోర్టర్ లెనిల్డో ఫ్రాజావో నీళ్లలోకి దిగి బాలిక మిస్సింగ్ కేసు వార్తకు సంబంధించి రిపోర్టింగ్ చేస్తూ కనిపించాడు. ఇంతలో అతని కాళ్లకు ఏదో తాకింది. తీరా చూస్తే అది ఆ బాలిక మృతదేహం!!. దీంతో ఒక్కసారిగా వణికిపోయిన అతను.. ఇక్కడేదో తాకుతుందంటూ తన టీంనుఅప్రమత్తం చేసే ప్రయత్నం చేశాడు. మళ్లీ లోపలకు వెళ్లను.. అక్కడేదో తాకుతోంది. బహుశా చెయ్యి అనుకుంటా అంటూ వణికిపోతున్న గొంతుతో చెప్పాడు.వెంటనే ఆ బృందం పోలీసులకు సమాచారం అందించింది. వాళ్లు ఆ బాలిక మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్‌మార్టంకు తరలించారు. నీట మునిగే ఆమె చనిపోయిందని.. బహుశా ఆ మృతదేహం నది అడుగుభాగంలోని మట్టిలో ఇంతకాలం కూరుకుపోయి ఉంటుందని వైద్యులు తెలిపారు. ఆ రిపోర్టర్‌కు భయానక అనుభవం మిగిల్చిన వీడియో కిందే ఉంది! చూసేయండి.. A Brazilian TV reporter may have stumbled onto the body of a missing 13-year-old girl during a live segment from the very river she vanished inLenildo Frazão was waist-deep in the Mearim River, demonstrating the water’s depth on camera in Bacabal, Maranhão — the last place the… pic.twitter.com/0i3y13fsZ9— Re:Flex (@re_flex_world) July 21, 2025 -
లైవ్ రిపోర్టింగ్‌లో మహిళా జర్నలిస్టుకు షాకింగ్ అనుభవం
టెలివిజన్ జర్నలిస్టుగా లైవ్ రిపోర్టింగ్ చేయడం అంటే అంత ఆషామాషీ వ్యవహారంకాదు. ఒక్కోసారి భయంకరమైన అనుభవాలు, మరి కొన్నిసార్లు అనూహ్యమైన ఘటనలు చోటు చేసుకుంటాయి. ఈ కోవలోనే లైవ్ రిపోర్టింగ్‌లో పాకిస్థానీ మహిళా రిపోర్టర్ పాకిస్థానీ మహిళా రిపోర్టర్‌కు ఊహించని అనుభవం ఎదురైంది. రిపోర్ట్ చేస్తుండగా ఎద్దు దాడి చేసిన అనూహ్య ఘటన నెట్టంట వైరల్‌గా మారింది.‘‘పాకిస్తాన్లో ప్రత్యక్ష ప్రసార టీవీ కవరేజీ సమయంలో బుల్ హిట్స్ రిపోర్టర్” అనే క్యాప్షన్‌తో ఎక్స్‌లో ఒక వీడియో షేర్ అయింది. 10 లక్షలకు పైగా వ్యూస్ సొంతం చేసుకుందీ వీడియో.Bull Hits Reporter during Live tv Coverage in Pakistan pic.twitter.com/eP23iFXykv— Ghar Ke Kalesh (@gharkekalesh) July 2, 2024 మార్కెట్లో ఎద్దుల ధరలపై స్థానిక వ్యాపారులతో మాట్లాడుతూ లైవ్ రిపోర్టింగ్ చేస్తోంది. ఎద్దుల జంట రూ. 5 లక్షల ధర పలుకు తోందనీ, అంతకంటే తక్కువకు విక్రయించేందుకు అక్కడి వ్యాపారాలు సిద్ధంగా లేరు అని చెబుతుండగానే , అకస్మాత్తుగా ఒక ఎద్దు ఆమెపై దాడిచేసింది. దీంతో ఆమె కేకలు వేస్తూ అల్లంత దూరాన ఎగిరి పడింది. ఆమెచేతిలోని మైక్ కూడా అల్లంత దూరాన పడింది. దీంతో పక్కనే ఉన్న వ్యాపారి స్పందించి చెల్లాచెదురుగా పడి పోయిన ఆమె మైక్రోఫోన్, మౌత్‌ను ఆమెకు అందించాడు. కొంతమంది రిపోర్టర్ యోగ క్షేమాలపై ఆందోళన వ్యక్తం చేయగా, మరికొందరు యూజర్లు రకరకాల కామెంట్లు చేశారు. లైవ్ రిపోర్టింగ్లోఇదో హఠాత్తు పరిణామమనికొందరు, ఫీల్డ్ రిపోర్టింగ్ సమయంలో జాగ్రత్త తీసుకోవాలని మరికొందరు వ్యాఖ్యానించారు. -
FIFA : రిపోర్టర్‌కు చేదు అనుభవం.. పోలీసుల జవాబు విని షాక్
ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనాకు చెందిన ఒక జర్నలిస్ట్‌కు ఊహించని అనుభవం ఎదురైంది. లైవ్ రిపోర్టింగ్ చేస్తుండగానే ఒక దొంగ తన చేతివాటం చూపించాడు. దొంగ చేసిన పనికి విలువైన డాక్యుమెంట్లతో పాటు నగదు కూడా పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఖతార్, ఈక్వెడార్ మధ్య తొలి మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. డొమినిక్ మెట్జెర్ అనే యువతి టోడో నోటియాస్ అనే టెలివిజన్ చానెల్లో రిపోర్టర్‌గా పనిచేస్తుంది. ఫిఫా వరల్డ్‌కప్ నేపథ్యంలో లైవ్ కవరేజ్ ఇవ్వడానికి డొమినిక్ మెట్జెర్ ఖతార్‌కు వెళ్లింది. సాకర్ ఆరంభోత్సవాలు ముగిశాక ఈక్వెడార్, ఖతార్‌లో మధ్య మ్యాచ్ జరిగింది. లైవ్ కవరేజ్ చేస్తుండగానే ఒక దొంగ ఆమె హ్యాండ్బాగ్లో విలువైన డాక్యుమెంట్లు, నగదు తీసుకొని అక్కడి నుంచి ఉడాయించాడు. స్టేడియం మొత్తం జనాలతో నిండిపోయింది. మ్యూజిక్, జనాల అరుపులో నేను పెద్దగా పట్టించుకోలేదు. వాళ్లతో కలిసి గట్టిగా అరుస్తున్న సమయంలోనే ఎవడో వచ్చి నా హ్యాండ్ బ్యాగ్ జిప్ తీసి పర్సును దొంగలించాడు. వాటర్ తాగుతామని హ్యాండ్‌బ్యాగ్ చూస్తే అప్పటికే పర్సు దొంగతనం చేసినట్లు తెలిసింది. దీంతో వెంటనే అక్కడున్న పోలీసులను ఆశ్రయించగా.. దొంగ కచ్చితంగా దొరుకుతాడని.. అతనికి మీరు ఏ శిక్ష విధించాలనుకుంటే అది విధించొచ్చు అని చెప్పడంతో షాక్ తిన్నా'' అంటూ డొమినిక్ మెట్జెర్ తెలిపింది. చదవండి: ఇంగ్లండ్‌తో మ్యాచ్.. జాతీయ గీతం పాడకుండా ఇరాన్ ఆటగాళ్ల నిరసన -
ఆ జర్నలిస్ట్ వర్క్ డెడికేషన్ని చూసి... ఫిదా అవుతున్న నెటిజన్లు
పాకిస్తాన్లో గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలకు సంభవించిన వరదలు బీభత్సం సృష్టించాయి. దీంతో పాకిస్తాన్లో వేలాదిమంది మృతి చెందారు. లక్ష్లలాదిమంది నిరాశ్రయులయ్యారు. రహదారులు, వంతెనలు, రైల్వే మార్గం పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఆకలితో అలమటిస్తున్నారు. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని విధించడమే కాకుండా వరద ప్రభావిత ప్రాంతాల్లోకి ఆర్మీని పంపించి సహాయక చర్యలు చేపట్టింది. అలాగే ప్రపంచ దేశాలకు సాయం అందించాల్సిందిగా పిలుపునిచ్చింది. మరోవైపు వరదలతో అల్లకల్లోలంగా ఉన్న పాకిస్తాన్ ప్రాంతాల్లో పరిస్థితులు గురించి సమాచారాన్ని అందించే పనిలో పడ్డాయి అక్కడ మీడియా సంస్థలు. ఈ క్రమంలో ఒక రిపోర్ట్ర్ పాకిస్తాన్‌లోని వరదలకు సంబంధిచి లైవ్ రిపోర్టింగ్‌ని అందించడానికి పెద్ద సాహసమే చేశాడు. సదరు రిపోర్టర్ ఏకంగా వరద ఉధృతిలో... పీకల్లోతు నీటిలో నిలబడి మరీ అక్కడ పరిస్థితి గురించి సమాచారం అందించాడు. దీంతో నెటిజన్లు ఆ జర్నలిస్ట్ డెడికేషన్ వర్క్‌కి హ్యాట్సాప్ అని ప్రశంసిస్తే, మరికొందరూ టీఆర్పీ రేటింగ్స్ కోసైం కొన్ని మీడియా సంస్థలు జర్నలిస్ట్‌లు చేత ఇలాంటి ప్రమాదకరమైన రిపోర్టింగ్‌లు చేయిస్తున్నాయంటూ మండిపడ్డారు. ఈ మేరకు ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. (చదవండి: నడి రోడ్డుపై ఎద్దుతో పరాచకాలు... దెబ్బకు కుమ్మిపడేసింది) -
టీవీ రిపోర్టర్‌ను వెంటాడిన పంది..
లైవ్ టీవీ రిపోర్టింగ్ చేసే జర్నలిస్ట్‌లకు కొన్నిసార్లు అనుహ్య పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుంది. తాజాగా గ్రీక్‌కు చెందిన ఓ రిపోర్టర్‌కు వింత అనుభవం ఎదురైంది. ఇటీవల ఏఎన్‌టీ1 టీవీకి చెందిన మాంటికోస్ అనే రిపోర్టర్ కైనెటా నగరంలో వరద నష్టంపై రిపోర్ట్ చేస్తున్నాడు. అయితే అతను రిపోర్టింగ్ చేస్తున్న సమయంలో ఓ పంది అతని వద్దకు వచ్చింది. అయితే దాని నుంచి తప్పించుకుని రిపోర్ట్ చేద్దామని చూసిన అది అతన్ని వెంబడించింది. ఆ సమయంలో స్టూడియోలో ఉన్న జర్నలిస్టులతో మాంటికోస్ మాట్లాడుతూ.. ‘ఇక్కడ ఓ పంది మమ్మల్ని ఉదయం నుంచి వెంబడిస్తుంది. పంది నన్ను కోరకాడానికి ప్రయత్నిస్తుంది.. అందుకే ఇక్కడ నిల్చోలేకపోతున్నాను. నన్ను క్షమించండి’ అని పేర్కొన్నాడు. ఇది అంతా చూస్తున్న స్టూడియోలోని జర్నలిస్టులు తమ నవ్వును ఆపుకోలేకపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, గతంలో లైవ్ రిపోర్టింగ్ చేస్తున్న మహిళా రిపోర్టలతో కొందరు వ్యక్తులు అసభ్యకరంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. Greek journo pestered by a pig while reporting on the recent floods in #Kinetta #Greece #tv #bloopers #ant1tv #Ant1news pic.twitter.com/vsLBdlWCMB — Kostas Kallergis (@KallergisK) November 26, 2019 -
టీవీ లైవ్‌లో అలా బుక్ అయ్యాడు
వివిధ సందర్భాల్లో టీవీ చానెళ్లు, వాటి వ్యవహారంపై దుమారం రేగుతూనే ఉంటుంది. మరికొన్ని బ్లూఫర్స్లా నవ్వు పుట్టిస్తాయి కూడా. తాజాగా అలాంటి సంఘటన ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకవైపు లైవ్ టెలికాస్ట్ అవుతుండగా, మరోవైపు ఆత్రంగా పిజ్జా తింటూ అడ్డంగా బుక్కయిపోయాడో ఉద్యోగి. పని ఒత్తిడి, క్షుద్బాధకు ఓర్వలేక అలా కక్కుర్తి పడ్డాడో ఏమోగానీ , ఈ వీడియోతో మాత్రం పిజ్జా మ్యాన్ లక్షలాది వ్యూస్‌తో ఇంటర్నెట్ హీరో అయిపోయాడు. తాజా ఘటనలో చానెల్ లైవ్‌లో రిపోర్టర్ రిపోర్టింగ్ చేస్తుండగా.. చానెల్‌కు చెందిన మరో ఉద్యోగి పిజ్జా తింటూ లైవ్‌లో కనిపించాడు. దొంగచాటుగా తింటూ.. సడన్‌గా అలా లైవ్ లో ప్రత్యక్షమయ్యే సరికి అతగాడు బిక్క చచ్చిపోయాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా నిలిచింది. సీబీఎస్ఎన్ చానెల్లో ఈ ఫన్నీ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియోను వీక్షించిన నెటిజన్లు హాల్వే పిజ్జా గై అనే నిక్ నేమ్‌తో ఫన్నీ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. tfw you go to eat your hallway pizza and get told you’re in the live shot pic.twitter.com/ppkq9PJraO — Mike Uehlein (@MikeUehlein) February 27, 2019 Poor thing...Bless his heart....he's probably starving.😁 — kawfytawk (@kawfytawk) February 27, 2019 -
షాకింగ్: లైవ్‌లో మహిళా జర్నలిస్ట్ మృతి
ఇస్లామాబాద్: లైవ్ రిపోర్టింగ్ చేస్తున్న ఓ యువ మహిళా జర్నలిస్టు అకస్మాత్తుగా మృతిచెందారు. ఈ ఘటన పాకిస్తాన్లో ఇటీవల చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాదాపు 25 ఏళ్ల వయసున్న యువతి పాకిస్తాన్‌కు చెందిన 92 టీవీ ఛానెల్లో జర్నలిస్టుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఓ ప్రోగ్రాంలో పాల్గొని ఆ మహిళా జర్నలిస్ట్ లైవ్ రిపోర్టింగ్ ఇస్తున్నారు. క్రేన్ మీద నిల్చున్న ఆమె ఓ విషయంపై కొన్ని క్షణాల ముందే రిపోర్టింగ్ ప్రారంభించారు. గట్టిగా మాట్లాడుతున్న ఆమె అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైనట్లు కనిపించారు. ఆమెకు కళ్లుతిరిగాయో లేక గుండెపోటుకు గురయ్యారో స్పష్టతలేదు కానీ ఒక్కసారిగా క్రేన్ మీద నుంచి కుప్పకూలిపోయి నేలపై పడిపోయారు. అక్కడున్నవారు ఆమెను చేరుకుని పరిశీలించిలోపే మహిళా జర్నలిస్టు తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషాధ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందమైన జర్నలిస్టు ఎలా చనిపోయారో ఆశ్చర్యంగా ఉందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరికొందరు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు కామెంట్ చేశారు. ఇటీవల చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.