FIFA World Cup 2022: Qatar World Cup Reporter Gets Robbed While Reporting On Live Tv - Sakshi
Sakshi News home page

FIFA WC 2022: రిపోర్టర్‌కు చేదు అనుభవం.. పోలీసుల జవాబు విని షాక్‌

Nov 22 2022 11:58 AM | Updated on Nov 22 2022 12:52 PM

Qatar World Cup reporter gets robbed while reporting on LIVE TV - Sakshi

ఖతార్‌ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనాకు చెందిన ఒక జర్నలిస్ట్‌కు ఊహించని అనుభవం ఎదురైంది. లైవ్‌ రిపోర్టింగ్‌ చేస్తుండగానే ఒక దొంగ తన చేతివాటం చూపించాడు. దొంగ చేసిన పనికి విలువైన డాక్యుమెంట్లతో పాటు నగదు కూడా పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఖతార్‌, ఈక్వెడార్‌ మధ్య తొలి మ్యాచ్‌ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది.

విషయంలోకి వెళితే.. డొమినిక్ మెట్జెర్ అనే యువతి టోడో నోటియాస్‌ అనే టెలివిజన్‌ చానెల్‌లో రిపోర్టర్‌గా పనిచేస్తుంది. ఫిఫా వరల్డ్‌కప్‌ నేపథ్యంలో లైవ్‌ కవరేజ్‌ ఇవ్వడానికి డొమినిక్‌ మెట్జెర్‌ ఖతార్‌కు వెళ్లింది. సాకర్ ఆరంభోత్సవాలు ముగిశాక ఈక్వెడార్‌, ఖతార్‌లో మధ్య మ్యాచ్‌ జరిగింది. లైవ్‌ కవరేజ్‌ చేస్తుండగానే ఒక దొంగ ఆమె హ్యాండ్‌బాగ్‌లో విలువైన డాక్యుమెంట్లు, నగదు తీసుకొని అక్కడి నుంచి ఉడాయించాడు. 

స్టేడియం మొత్తం జనాలతో నిండిపోయింది. మ్యూజిక్‌, జనాల అరుపులో నేను పెద్దగా పట్టించుకోలేదు. వాళ్లతో కలిసి గట్టిగా అరుస్తున్న సమయంలోనే ఎవడో వచ్చి నా హ్యాండ్‌ బ్యాగ్‌ జిప్‌ తీసి పర్సును దొంగలించాడు. వాటర్‌ తాగుతామని హ్యాండ్‌బ్యాగ్‌ చూస్తే అప్పటికే పర్సు దొంగతనం చేసినట్లు తెలిసింది. దీంతో వెంటనే అక్కడున్న పోలీసులను ఆశ్రయించగా.. దొంగ కచ్చితంగా దొరుకుతాడని.. అతనికి మీరు ఏ శిక్ష విధించాలనుకుంటే అది విధించొచ్చు అని చెప్పడంతో షాక్‌ తిన్నా'' అంటూ డొమినిక్‌ మెట్జెర్‌ తెలిపింది.   

చదవండి: ఇంగ్లండ్‌తో మ్యాచ్‌.. జాతీయ గీతం పాడకుండా ఇరాన్‌ ఆటగాళ్ల నిరసన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement