కిస్ కిస్ కిస్సిక్.. కొంపముంచిన కోల్డ్‌ప్లే | Caught On Kiss Cam Andy Byron Resigns For Astronomer CEO Post | Sakshi
Sakshi News home page

కిస్ కిస్ కిస్సిక్.. కొంపముంచిన కోల్డ్‌ప్లే

Jul 20 2025 12:54 PM | Updated on Jul 20 2025 3:55 PM

Caught On Kiss Cam Andy Byron Resigns For Astronomer CEO Post

ప్రముఖ మ్యూజిక్‌ కాన్సర్ట్‌ ‘కోల్డ్‌ ప్లే’ ఆ కంపెనీ సీఈవో కొంపముంచింది. తన సహోద్యోగినితో సన్నిహితంగా మెలుగుతూ.. ముద్దు పెట్టుకొన్న వీడియో వైరల్‌ కావడం తెలిసిందే. ఈ ఎపిసోడ్‌ ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. ఆయన ఏకంగా తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. మరోవైపు.. నాలుగు రోజుల తర్వాత కూడా ఆ వీడియో విపరీతంగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో ప్రముఖ కంపెనీలు సైతం తమ ప్రచారాలకు ఆ వీడియోను వాడేసుకుంటున్నాయి.  

ఆస్ట్రానమర్‌ సీఈవో ఆండీ బైరోన్‌ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. తాను కంపెనీ వీడుతున్నట్లు శనివారం ఆయన ప్రకటించారు. ఆ కంపెనీలో హెచ్‌ఆర్‌ డిపార్ట్‌మెంట్‌లో చీఫ్‌ పీపుల్‌ ఆఫీసర్‌ క్రిస్టిన్‌ క్యాబెట్‌ను కౌగలించుకుని.. ముద్దాడుతున్న వీడియో ఒకటి వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. బుధవారం మాసెచూసెట్స్ స్టేట్‌ బోస్టన్‌లోని గిల్లెట్‌ స్టేడియంలో జరిగిన కోల్డ్‌ ప్లే కాన్సర్ట్‌లో వీళ్లిద్దరి ఇలా కెమెరా కంటపడ్డారు. ఆ వెంటనే నాలుక్కరుచుకొని ఇద్దరు విడిపోయి దాక్కొన్నారు. దీంతో కోల్డ్‌ప్లే క్రిస్‌ మార్టిన్‌ ‘‘వారు అఫైర్‌లో అయినా ఉండి ఉండాలి.. లేదా సిగ్గుతో  దాక్కొని ఉండాలి’’ అంటూ కామెంట్‌ చేయడంతో అది మరింత వైరల్‌ అయ్యింది. మరోవైపు.. 

ఈ వ్యవహారం కంపెనీకి తలవంపులుగా మారింది. దీంతో సీఈవో ఆండీ బైరోన్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్లు కంపెనీ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రకటించింది. ఈ విషయం వైరల్‌ కావడంతో ఆస్ట్రానమర్‌ కంపెనీ అంతర్గత దర్యాప్తు చేపట్టింది.  ఈ క్రమంలో  ఆండీ తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని లింక్డిన్‌లో ఆ కంపెనీ ఒక పోస్టు ద్వారా తెలియజేసింది. 

‘‘మా కంపెనీ లీడర్లు నడవడిక, బాధ్యత విషయంలో అత్యున్నత స్థాయి ప్రమాణాలు పాటిస్తారని ఆశిస్తాం. ఇటీవల ఆ స్థాయి ప్రమాణాలను నిలబెట్టుకోలేదు. ఆండీ తన రాజీనామా సమర్పించారు. దీనిని బోర్డ్‌ఆఫ్‌ డైరెక్టర్స్‌ ఆమోదించారు’’ అని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆస్ట్రానమర్‌ అనేది న్యూయార్క్‌ కేంద్రంగా నడుస్తున్న ఒక టెక్నాలజీ కంపెనీ.

క్రిస్ట్రిన్‌ క్యాబెట్‌కు గతంలో వివాహం.. విడాకులు అయ్యాయి. ఆండీ బైరోన్‌కు వివాహం అయ్యింది. ఆయన భార్య మేగన్‌ కెరిగన్‌ బైరోన్‌.. ఓ ప్రముఖ విద్యాసంస్థకు అసోషియేట్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.  ఈ జంటకు ఇద్దరు పిల్లలు. అయితే ఆండీ వీడియో వైరల్‌ కావడంతో ఆ కాపురంలోనూ కలతలు చెలరేగినట్లు కథనాలు వెలువడుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement