breaking news
Chris Martin
-
సీఈవోతో సరసాల ఎపిసోడ్లో కీలక మలుపు
వాషింగ్టన్: ప్రముఖ మ్యూజిక్ కాన్సర్ట్ ‘కోల్డ్ ప్లే’ ఎపిసోడ్లో మరో కీలక మలుపు తిరిగింది. కంపెనీ మాజీ సీఈవో ఆండీ బైరాన్‌ను కౌగిలించుకున్నందుకు అమెరికా టెక్ సంస్థ ఆస్ట్రానమర్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ క్రిస్టిన్ కాబోట్‌ను సైతం సంస్థ బయటకు సాగనంపింది. సంస్థ పరువు తీశారంటూ ఆమెతో బలవంతంగా రాజీనామా చేయించింది. ఈ క్రమంలో హ్యూమన్ రిసోర్స్ చీఫ్ కాబోట్ ఇప్పుడు తమ కంపెనీలో లేరని, రాజీనామా చేశారంటూ ఆస్ట్రానమర్ ఓ ప్రకటనలో తెలిపింది. గత బుధవారం మాసెచూసెట్స్ స్టేట్ బోస్టన్లోని గిల్లెట్ స్టేడియంలో కోల్డ్ ప్లే కాన్సర్ట్ జరిగింది. ఆ కాన్సర్ట్‌లో ఆస్ట్రానమర్ సీఈవో ఆండీ బిరాన్,హెచ్ఆర్ హెడ్ క్రిస్టిన్ కాబోట్‌లు హాజరయ్యారు. అయితే,కాన్సర్ట్ జరిగే సమయంలో ఆండీ, క్రిస్టెన్ ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. సరిగ్గా అదే సమయంలో వారిపై స్పాట్ లైట్ పడడం, ఆ దృశ్యం పెద్దస్క్రీన్లో కనిపించడంతో వారి ప్రేమాయణం బయటపడింది. సీఈవో వ్యవహారం ఆయన స్థాయికి తగ్గట్టుగా లేదని నెటిజన్లు చురకలు వేయగా... విడాకులు ఇవ్వనున్నట్లు ఆయన భార్య సంకేతాలిచ్చింది.సంస్థ ఆస్ట్రానమర్ ఆండీని పదవి నుంచి బలవంతంగా తొలగించింది. సీఈవో బాధ్యతల్ని మరొకరికి అప్పగించింది. అవమానం భారం తట్టుకోలేని ఆండీ తన పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో హెచ్ఆర్ హెడ్ క్రిస్టెన్ కబోట్ సైతం సంస్థకు రాజీనామా చేయడం టెక్ వర్గాల్లో చర్చాంశనీయంగా మారింది. Andy Byron, CEO of Astronomer, was caught at a Coldplay concert apparently having an affair with the company’s CPO, Kristin Cabot.Both Byron and Cabot are married to other people.Most awkward moment of 2025?pic.twitter.com/bVOTq6XgF8— Paul A. Szypula 🇺🇸 (@Bubblebathgirl) July 17, 2025 -
CEO చిలక్కొట్టుడు.. లైవ్ లో అడ్డంగా బుక్కైపోయాడు..
-
కిస్ కిస్ కిస్సిక్.. కొంపముంచిన కోల్డ్‌ప్లే
ప్రముఖ మ్యూజిక్ కాన్సర్ట్ ‘కోల్డ్ ప్లే’ ఆ కంపెనీ సీఈవో కొంపముంచింది. తన సహోద్యోగినితో సన్నిహితంగా మెలుగుతూ.. ముద్దు పెట్టుకొన్న వీడియో వైరల్ కావడం తెలిసిందే. ఈ ఎపిసోడ్ ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. ఆయన ఏకంగా తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. మరోవైపు.. నాలుగు రోజుల తర్వాత కూడా ఆ వీడియో విపరీతంగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో ప్రముఖ కంపెనీలు సైతం తమ ప్రచారాలకు ఆ వీడియోను వాడేసుకుంటున్నాయి. ఆస్ట్రానమర్ సీఈవో ఆండీ బైరోన్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. తాను కంపెనీ వీడుతున్నట్లు శనివారం ఆయన ప్రకటించారు. ఆ కంపెనీలో హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో చీఫ్ పీపుల్ ఆఫీసర్ క్రిస్టిన్ క్యాబెట్ను కౌగలించుకుని.. ముద్దాడుతున్న వీడియో ఒకటి వైరల్ అయిన సంగతి తెలిసిందే. బుధవారం మాసెచూసెట్స్ స్టేట్ బోస్టన్లోని గిల్లెట్ స్టేడియంలో జరిగిన కోల్డ్ ప్లే కాన్సర్ట్‌లో వీళ్లిద్దరి ఇలా కెమెరా కంటపడ్డారు. ఆ వెంటనే నాలుక్కరుచుకొని ఇద్దరు విడిపోయి దాక్కొన్నారు. దీంతో కోల్డ్‌ప్లే క్రిస్ మార్టిన్ ‘‘వారు అఫైర్‌లో అయినా ఉండి ఉండాలి.. లేదా సిగ్గుతో దాక్కొని ఉండాలి’’ అంటూ కామెంట్ చేయడంతో అది మరింత వైరల్ అయ్యింది. మరోవైపు.. Andy Byron, CEO of Astronomer, was caught at a Coldplay concert apparently having an affair with the company’s CPO, Kristin Cabot.Both Byron and Cabot are married to other people.Most awkward moment of 2025?pic.twitter.com/bVOTq6XgF8— Paul A. Szypula 🇺🇸 (@Bubblebathgirl) July 17, 2025ఈ వ్యవహారం కంపెనీకి తలవంపులుగా మారింది. దీంతో సీఈవో ఆండీ బైరోన్ను సస్పెండ్ చేస్తున్నట్లు కంపెనీ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రకటించింది. ఈ విషయం వైరల్ కావడంతో ఆస్ట్రానమర్ కంపెనీ అంతర్గత దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలో ఆండీ తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని లింక్డిన్లో ఆ కంపెనీ ఒక పోస్టు ద్వారా తెలియజేసింది. After a video of him with his company’s HR head at a Coldplay concert went viral, Andrew Byron, the CEO of U.S. tech company Astronomer, has resigned from his position. The New York-based company shared this information on LinkedIn.#Coldplay #AndrewByron pic.twitter.com/QA6iTGDxqq— Bipin Singh (@bipinsinghreal) July 20, 2025‘‘మా కంపెనీ లీడర్లు నడవడిక, బాధ్యత విషయంలో అత్యున్నత స్థాయి ప్రమాణాలు పాటిస్తారని ఆశిస్తాం. ఇటీవల ఆ స్థాయి ప్రమాణాలను నిలబెట్టుకోలేదు. ఆండీ తన రాజీనామా సమర్పించారు. దీనిని బోర్డ్ఆఫ్ డైరెక్టర్స్ ఆమోదించారు’’ అని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆస్ట్రానమర్ అనేది న్యూయార్క్ కేంద్రంగా నడుస్తున్న ఒక టెక్నాలజీ కంపెనీ.క్రిస్ట్రిన్ క్యాబెట్కు గతంలో వివాహం.. విడాకులు అయ్యాయి. ఆండీ బైరోన్కు వివాహం అయ్యింది. ఆయన భార్య మేగన్ కెరిగన్ బైరోన్.. ఓ ప్రముఖ విద్యాసంస్థకు అసోషియేట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. అయితే ఆండీ వీడియో వైరల్ కావడంతో ఆ కాపురంలోనూ కలతలు చెలరేగినట్లు కథనాలు వెలువడుతున్నాయి. -
లైవ్‌లో అడ్డంగా బుక్కై.. సీఈవో చిలక్కొట్టుడుపై జోకులు
ఆయనొక ప్రముఖ కంపెనీకి సీఈవో. పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. అయితే తన కంపెనీలో పని చేసే ఓ ఉద్యోగితో చిలక్కొట్టుడు యవ్వారానికి దిగాడు. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని ఓ మ్యూజికల్ నైట్‌కు వెళ్లారు. అక్కడ ఆమెతో సన్నిహితంగా ఉన్న టైంలో అనుకోకుండా కెమెరా వాళ్లవైపు తిరిగింది. అంతే సోషల్ మీడియా ఆ జంట గురించి కోడై కూస్తోంది.కోల్డ్‌ప్లే క్రిస్‌మార్టిన్ బుధవారం మాసెచూసెట్స్ స్టేట్ బోస్టన్లోని జిల్లెట్ స్టేడియంలో ప్రదర్శన ఇచ్చాడు. ప్రదర్శన కొనసాగుతున్న టైంలో.. కెమెరా హఠాత్తుగా ఓ జంట వైపు తిరిగాయి. అప్పటిదాకా ఒకరినొకరు వాటేసుకున్న ఆ ఇద్దరూ.. కెమెరా ఫోకస్ తమ మీద పడే సరికి సిగ్గుతో ముడుచుకుపోయారు. ఆపై ముఖాలు దాచేసుకుంటూ కనిపించారు. అయితే.. అందులో ఉంది ఆస్ట్రానమర్ సీఈవో ఆండీ బైరోన్. ఆస్ట్రానమర్ అనేది న్యూయార్క్ కేంద్రంగా నడుస్తున్న ఒక టెక్నాలజీ కంపెనీ. అయితే ఆయనతో ఆ వీడియోలో ఉన్నది ఆయన భార్య కాదు. ఆ కంపెనీలోనే చీఫ్ పీపుల్ ఆఫీసర్‌గా పని చేస్తున్న క్రిస్ట్రిన్ క్యాబెట్. ఈ వీడియోతో ఆ ఇద్దరి మధ్య ఏదో నడుస్తోందన్న ప్రచారం తీవ్రతరమైంది. మరికొందరు పబ్లిక్ ఈ ఇద్దరు ఇలా పట్టుబడడంపై రకరకాలుగా స్పందిస్తున్నారు. అంతెందుకు.. Coldplay Drops the Beat And a Secret Office Romance!At a recent concert, @coldplay inadvertently revealed an alleged affair between @astronomer_zero CEO #AndyByron and his colleague Kristin Cabot, proving the band really knows how to bring secrets into the spotlight!… pic.twitter.com/LMAs9tnz2r— Photo News (@PhotoNewsPk) July 17, 2025క్రిస్‌మార్టిన్ సైతం ఈ వ్యవహారంపై సరదాగా స్పందించాడు. ఈ ఇద్దరినీ చూడండి.. బహుశా వీళ్ల మధ్య సంబంధం ఉందేమో లేకుంటే మాములుగానే సిగ్గుపడుతున్నారేమో అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు టిక్‌టాక్, రెడ్డిట్, ట్విటర్, ఇన్‌స్ట్రాగ్రామ్‌లో వైరల్ అవుతున్నాయి. Damnit, Coldplay…#AndyByron pic.twitter.com/byy2RfqkNB— Coach Drew (@andy_stawicki2) July 17, 2025 CEO of Astronomer, Andy Byron (married with 2 kids) caught in 4K with the CPO of Astronomer, Kristin Cabot (also married) on the Jumbotron at Coldplay concert in Boston last night #astronomer #andybyron #kristincabot #astronomerceo #astronomercpo #coldplay #coldplayconcert pic.twitter.com/KjybeWVHVW— Meme Corp (@memecorpfail) July 17, 2025 lol 🤪 if they’d have just stuck it out and smiled for the #camera this would never have surfaced as virally as it did 😂 #Coldplay #Astronomer #AndyByron #kisscam #KristinCabot pic.twitter.com/6B8edsZBvU— Marie ☘️ (@7eights2nine10) July 17, 2025 Between Astronomer CEO Andy Byron Wife Megan Kerrigan and His CPO Kristin Cabot, who is more beautiful. Hi there Megan Kerrigan, you dont deserve that cheating dude. I can be all yours DM me. #ColdplayBoston #Coldplay #AstronomerCEO #andybyron pic.twitter.com/oe8ToIpc55— Derrick Groves (@DerricGroves) July 17, 2025 Me liking every tweet about the CEO and head of HR affair pic.twitter.com/0UsOrO4726— Ramp Capital (@RampCapitalLLC) July 18, 2025My low effort, painting for today pic.twitter.com/DHBjpLonUz— Travis Chapman (@Travispaints) July 17, 2025the wife watching this at home https://t.co/Sr0BhgCJAZ pic.twitter.com/ttHRRcqstL— Shreemi Verma (@shreemiverma19) July 17, 2025 ఇదిలా ఉంటే.. క్రిస్ట్రిన్ క్యాబెట్కు గతంలో వివాహం.. విడాకులు అయ్యాయి. మరోవైపు ఆండీ బైరోన్కు వివాహం అయ్యింది. ఆయన భార్య మేగన్ కెరిగన్ బైరోన్.. ఓ ప్రముఖ విద్యాసంస్థకు అసోషియేట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. తాజా వీడియో వైరల్ నేపథ్యంలో ఆండీ బైరోన్ పేరిట ఓ ప్రకటన వెలువడింది. అయితే అది వ్యంగ్యంగా ఉండడం గమనార్హం. ఫ్యాక్ట్‌చెక్‌లో అదొక పేరడీ పేజీ నుంచి సర్క్యులేట్ అయ్యిందని తేలింది. అధికారికంగా బైరోన్ దీనిపై ఎలాంటి ప్రకటన ఇవ్వేలదు. అయితే.. భర్తకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యాక.. ఆమె తన పేరులోని బైరోన్ను సోషల్ మీడియా అకౌంట్ల నుంచి తొలగించారు. అంతేకాదు.. ఆ అకౌంట్లనూ డీయాక్టివేట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ జంట విడాకులు ఖాయమనే చర్చ మొదలైంది. -
బ్రిటీష్ సింగర్ నోట ‘జై శ్రీరామ్’.. వీడియో వైరల్
బ్రిటిష్ సింగర్ క్రిస్ మార్టిన్ నోట ‘‘జై శ్రీరాం’’ అనే పదం వినిపించింది. ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్న ఆయన శనివారం సాయంత్రం నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో తన బ్యాండ్ ‘కోల్డ్‌ప్లే’ బృందంతో ప్రదర్శన ఇచ్చారు. ఫిక్స్ యూ, ఏ స్కై ఫుల్ ఆఫ్ స్టార్స్‌తో యువతను ఉర్రుతలూగించారు. ఈ క్రమంలో.. ప్రదర్శన ముగించే సమయానికి క్రిస్ మార్టిన్(Chris Martin) అక్కడున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. తనపై చూపించిన అభిమానానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి పట్టుకున్న ఫ్లకార్డుపై జై శ్రీరాం అని ఇంగ్లీష్‌లో రాసి ఉంది. అది చూసి ఆయన ‘‘జై శ్రీరామ్’’(Jai Shreeram) అనడంతో స్టేడియం మారుమోగిపోయింది. ఆపై ఆ పదం అర్థం ఏంటని? అక్కడున్నవాళ్లను అడిగి తెలుసుకున్నారు. When Chris Martin said ‘Jai Shri Ram’ at Mumbai concert... the crowd went wild!#ChrisMartin #MumbaiConcert #ColdplayInIndia #JaiShriRam pic.twitter.com/yNeB6FcMOF— India Today NE (@IndiaTodayNE) January 19, 2025బూమ్ బూమ్ బుమ్రా పేరు కూడా.. ప్రదర్శన ఇచ్చే టైంలో ఉన్నట్లుండి మార్టిన్ నోట జస్ప్రీత్ బుమ్రా పేరు ప్రస్తావన కూడా వచ్చింది. ‘‘ఆగండి.. ప్రదర్శన అయిపోలేదు. చివరగా జస్ప్రీత్ బుమ్రా వచ్చి పాల్గొంటాడట’’ అని మార్టిన్ మైకులో చెప్పాడు. దీంతో అభిమానులు బుమ్రా నినాదాలతో హోరెత్తిపోయారు. అయితే అలాంటిదేం అదేం జరగకపోయినా.. క్రిస్ మార్టిన్ నోట బుమ్రా పేరు రావడంతో క్రికెట్ అభిమానులు మాత్రం ఖుషీ అయ్యారు.Coldplay's Mumbai concert on Saturday was unforgettable for music lovers and cricket fans. During the performance, Chris Martin surprised the audience by mentioning India's star bowler, Jasprit Bumrah.#ColdplayMumbai #Coldplay #JaspritBumrah #ChrisMartin #MusicConcert pic.twitter.com/TMz2wscdkm— Mid Day (@mid_day) January 19, 2025ఇదిలా ఉంటే.. హాలీవుడ్ స్టార్ డకోటా జాన్సన్(Dakota Johnson), క్రిస్ మార్టిన్ ప్రియురాలు. ఈ ఇద్దరూ భారత్ సందర్శనకు వచ్చారు. తాజాగా.. ముంబైలోని ప్రసిద్ధ శ్రీ భూల్‌నాథ్ ఆలయాన్ని ఈ జంట దర్శించుకుంది. ఆధ్యాత్మిక సందర్శన కోసం సాంప్రదాయ భారతీయ దుస్తుల్లో కనిపించారు. క్రిస్ బ్లూ కుర్తాలో మెడపై రుద్రాక్ష మాలతో కనిపించాడు. Dakota Johnson telling her wishes in ear of Shri Nandi Maharaj. Amazing how foreign nationals come to India and try following our culture and traditions! #Coldplay #ChrisMartin #DakotaJohnson pic.twitter.com/0Dz19yXg5c— Priyanshi Bhargava (@PriyanshiBharg7) January 18, 2025 ఆలయంలో నంది చెవిలో మార్టిన్ తన మనసులోని కోరికను వినిపించగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతకు ముందు.. మార్టిన్, జాన్సన్‌లు ముంబైలో ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. -
ధోనిని ముప్పుతిప్పలు పెట్టిన కివీస్ టాప్-3 బౌలర్, ఇప్పుడు సూపర్ మార్కెట్లో
క్రికెట్లో ఒక వెలుగు వెలిగిన క్రికెటర్లు ఏదో ఒకరోజు ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాల్సిందే. అయితే రిటైర్మెంట్కు ముందే భవిష్యత్తులో ఏం చేయాలనేది ముందే నిర్ణయించుకోవడం చూస్తుంటాం. కొంతమంది క్రికెటర్లు ఆటకు గుడ్‌బై చెప్పిన తర్వాత బిజినెస్ ప్లాన్ చేయడం.. కామెంటేటర్లుగా మారడం చూస్తుంటాం. క్రికెట్ బాగా పాపులర్ ఉన్న మన దేశంలో ఎక్కువమంది క్రికెటర్లు రిటైర్మెంట్ తర్వాత కామెంటేటరీ ఫీల్డ్‌లోకి వస్తున్నారు. అయితే మరికొంత మంది క్రికెటర్లు వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. ఉదాహరణకు దిగ్గజం కపిల్ దేవ్ వ్యాపారంలో రాణిస్తుండడంతో పాటు అప్పుడప్పుడు కామెంటేటరీ బాక్స్‌లో కనిపిస్తుంటాడు. ఇంకొంతమంది క్రికెటర్లు మాత్రం సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోతుంటారు. షోయబ్ అక్తర్ లాంటి పాక్ క్రికెటర్లు ఎక్కువగా యూట్యూబ్ చానెళ్లు నడుపుతూ మరింత ఫేమస్ అయిపోతున్నారు. కొందరు మాత్రం ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత లగ్జరీ జీవితానికి దూరంగా బతకాలని ఆశపడతారు. ఆ కోవకు చెందిన వాడే న్యూజిలాండ్ మాజీ బౌలర్ క్రిస్ మార్టిన్. క్రిస్ మార్టిన్ న్యూజిలాండ్ తరపున 2000వ సంవత్సరం నుంచి 2013 వరకు 71 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. 71 టెస్టుల్లో 233 వికెట్లు తీశాడు. ఒక దశలో న్యూజిలాండ్ తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. క్రిస్ మార్టిన్ కంటే ముందు టెస్టుల్లో రిచర్డ్ హడ్లీ, డానియెల్ వెటోరిలు మాత్రమే ఉన్నారు. మరో విషయమేంటంటే.. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని తన బౌలింగ్‌తో ముప్పుతిప్పలు పెట్టిన బౌలర్‌గా క్రిస్ మార్టిన్ నిలిచాడు. చాలా సందర్భాల్లో ధోనిని ఔట్ చేసిన ఘనత క్రిస్ మార్టిన్ సొంతం. ఇక 40 ఏళ్ల వయసు దాకా క్రిస్ మార్టిన్ క్రికెట్లో కొనసాగాడు. అయితే 35 ఏళ్ల వయసుకు చేరుకోగానే క్రిస్ మార్టిన్ తన పోస్ట్ రిటైర్మెంట్పై ఆలోచనలో పడ్డాడు. అప్పటినుంచే తన వ్యాపార రంగాన్ని విస్తృతం చేయాలని భావించాడు. ఆటకు రిటైర్మెంట్ ఇచ్చేలోపే న్యూజిలాండ్‌లోని ఈస్ట్‌బోర్న్‌లో ''Four Square'' పేరుతో సూపర్‌మార్కెట్‌ను నెలకొల్పాడు. మొదట చిన్న స్టోర్‌గా ప్రారంభించినప్పటికి 2019లో దానిని బిగ్స్టోర్గా మార్చాడు. ఫుడ్‌స్టఫ్ సహా మార్కెట్లో అవసరమైన అన్ని రకాల రిటైల్ వస్తువులను అందుబాటులో ఉంచాడు. అనతికాలంలోనే కస్టమర్స్ దగ్గర మంచి పేరు సంపాదించాడు. He took 233 Test wickets for New Zealand - the third highest of all-time for the Blackcaps, but only scored 123 runs in 71 matches! Happy Birthday to Chris Martin! pic.twitter.com/WAzVuktrNO — ICC (@ICC) December 10, 2017 చదవండి: రాత్రి 7:45కు ముహూర్తం.. దాయాదుల మ్యాచ్ సెప్టెంబర్ 2న! SL Vs PAK 1st Test: లంక కీపర్‌ను ముప్పతిప్పలు పెట్టిన పాక్ బౌలర్ -
సారూ.. ఈమె కత్రిన.. ఆమె కరీన!
కత్రినా కైఫ్, కరీనా కపూర్ ఖాన్.. ఈ ఇద్దరూ బాలీవుడ్ హీరోయిన్లు. ఎన్నో సినిమాల్లో నటించిన వీరికి ప్రత్యేకంగా తమకంటూ ఓ గుర్తింపు ఉంది. కానీ, వీరి విషయంలో ‘కోల్డ్‌ప్లే’ సింగర్ క్రిస్ మార్టిన్ తికమక పడ్డాడు. కరీనాను, కత్రినాను వేర్వేరుగా కాకుండా కలిపి గుర్తుంచుకున్నట్టు ఉంది. అందుకే ఇద్దరి పేర్లను కలిపి కత్రినా ఖాన్ చేసేశాడు. నవంబర్ 19న గ్లోబల్ సిటిజెన్ కాన్సర్ట్ తొలిసారి భారత్‌లో జరగబోతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని శనివారం న్యూయార్క్‌లో జరిగిన గ్లోబల్ సిటిజెన్ కాన్సర్ట్‌లో క్రిస్ మార్టిన్ ప్రకటించాడు. ముంబైలో జరగనున్న ఈ సంగీత విభావరిలో తనతోపాటు బాలీవుడ్ స్టార్లు ఆమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ తదితరులు వేదిక పంచుకోనున్నట్టు చెప్పాడు. ఈ మేరకు తన వద్ద ఉన్న ఓ జాబితాను కూడా చదివి వినిపించిన క్రిస్ కరీనా, కత్రినా పేర్లను మాత్రం విడివిడిగా చెప్పలేదు. కత్రినా ఖాన్ అంటూ ఇద్దరిని కలిపి చెప్పాడు. దీంతో వేదికపై ఆయన పక్కనే ఉన్న ప్రియాంక చోప్రా కంగుతింది. ’ఓహ్’ అంటూ విస్మయాన్ని వ్యక్తం చేసింది. అయితే, భారతీయ పేర్లను పలుకడంలో అంతబాగా రాదని క్రిస్ సర్దిచెప్పాడు. స్వచ్ఛంద సేవ కోసం ఉద్దేశించిన గ్లోబల్ సిటిజెన్ కాన్సర్ట్ కు ప్రియాంక బ్రాండ్ అంబాసిడర్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కరీన, కత్రిన పేర్ల విషయంలో క్రిస్ తికమక పడటాన్ని కావాలంటే మీరు కూడా ఈ కింది వీడియోలో 5.20 నిమిషాల వద్ద చూడొచ్చు. -
ఆ జంట మళ్లీ ఒక్కటైంది?
లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ నటి జెన్నీఫర్ లారెన్స్-మ్యుజీషియన్ క్రిస్ మార్టిన్ ల జంట మళ్లీ ఒక్కటైయ్యారు. చి న్నపాటి విభేదాల వల్ల విడిపోయిన ఈ జోడి తిరిగి డేటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం వారిద్దరు బిజీగా ఉన్నా.. వారి మధ్య బంధాన్ని యథావిధిగా కొనసాగిస్తున్నట్లు పీపుల్ డాట్ కమ్ పేర్కొంది. భార్య వైనీత్ కు మార్టిన్ దగ్గరగా ఉంటున్నాడని భావించిన జెన్నీఫర్ అతనితో బంధాన్ని అక్టోబర్ లో తెంచుకుంది. గత ఆగస్టులోడేటింగ్ ఆరంభించిన ఈ జోడీ రెండు నెలల్లోనే దూరమయ్యారు. అయితే ఆ జోడీ డిసెంబర్ 30 వ తేదీన మళ్లీ వారి బంధాన్నిబలపరస్తూ ఓ డిన్నర్ లో కలుసుకుంది. వారి మధ్య చోటు చేసుకున్న విభేదాలను ప్రక్కకు పెట్టిన జెన్నీఫర్-మార్టిన్ లు తిరిగి రొమాన్స్ లో మునిగితేలుతున్నారు. అసలు వారిద్దరి మధ్య గొడవ రావడానికి మార్టిన్ పిల్లలే కారణమట. మార్టిన్ -వైనీత్ జంటకు కు ఇద్దరు పిల్లలు ఆపిల్(10), మోసెస్(8) లు ఉన్నారు. ఈ క్రమంలోనే మార్టిన్ తరచు వైనీత్ ఇంటికి వెళ్లడంతో జెన్నీఫర్ కాస్త అలిగింది. అయితే తిరిగి ఈ విషయాన్ని లైట్ గా తీసుకున్న జెన్నీఫర్ తిరిగి మార్టిన్ తో తన రిలేషన్ ను కొనసాగిస్తోంది. -
నన్ను జోలీ దంపతులు కిడ్నాప్ చేశారు!
లాస్ ఏంజిల్స్: తనను హాలీవుడ్ నటి ఏంజిలీనా జోలీ మరియ ఆమె భర్త బ్రాడ్ పిట్ లు కిడ్నాప్ చేశారంటూ సింగర్ క్రిస్ మార్టిన్ తెలిపాడు. ఏంజిలీనా జోలీ దర్శకత్వం వహిస్తున్న 'అన్ బ్రోకెన్' సినిమాకు పిట్ రాస్తున్న పాట కోసం తనను కిడ్నాప్ చేశారని మార్టిన్ అన్నాడు. 'తొలుత ఆ సినిమాకు సంబంధించి ఒక సందేశాన్ని జోలీ-పిట్ లు పంపారు. ఆ పాట ఎలా వస్తుందో నన్ను చూడమంటూ ఆ మెస్సేజ్ సారాంశం. ఇందుకోసం వారు ముందు హెచ్చరించినట్లుగానే నన్ను కిడ్నాప్ చేశారు. తలపై కొట్టడమే కాకుండా ముఖంపై స్ప్రే చేశారు. తరువాత చూస్తే తాను ఒక ఆఫీస్ లో ఉన్నానన్నాడు. అక్కడ బ్రాడ్ పిట్ ఎక్సర్ సైజ్ లు చేస్తుండగా.. ఏంజిలీనా జోలి భర్త ముందు కూర్చుని ఉంది. అంతేకాకుండా ఓ వ్యక్తి తనపీకపై కత్తిపెట్టి కూర్చున్నాడన్నాడు. ప్రస్తుతం పాట రాస్తున్నామని.. అది విన్నాక అభిప్రాయం చెప్పమన్నారని వారు తనకు తెలిపారని మార్టిన్ అన్నాడు. కాకపోతే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉందండోయ్. ఇదంతా తమ వద్ద ఉన్న సాన్నిహిత్యం కారణంగానే అంటూ మార్టిన్ జోక్ పేల్చాడు. -
బ్రేకై.. ఒక్కటై..!
వద్దనుకొని విడిపోయి... మళ్లీ ఒక్కటైపోయి... డేటింగ్ల్లో మునిగిపోతూ... మాంచి మసాలా సినిమాను తలపిస్తున్నారు హాలీవుడ్ సూపర్‌స్టార్ జెన్నీఫర్ లారెన్స్, మ్యుజీషియన్ క్రిస్ మార్టిన్. రియల్ లైఫ్‌లో చాలా కాలం రొమాన్స్ చేసిన ఇద్దరూ.. అలా బ్రేకపయ్యారో లేదో... అంతలోనే ఒకరికొకరు దగ్గరైపోయారు. వినేత్కు బాగా క్లోజైపోయి జెన్నీఫర్‌ను నిర్లక్ష్యం చేస్తున్నాడని... దాని ఫలితమే ఈ బ్రేకప్ అని ఓ వెబ్సైట్ కథనం. అయితే రోజైనా గడవక ముందే మార్టిన్ ఇంట్లో రెండు గంటలకు పైగా ఈ ముద్దుగుమ్మ స్పెండ్ చేసిందని సమాచారం.